తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Toyota Rumion Vs Kia Carens : రుమియన్​ వర్సెస్​ క్యారెన్స్​.. ఏది బెస్ట్​?

Toyota Rumion vs Kia Carens : రుమియన్​ వర్సెస్​ క్యారెన్స్​.. ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

13 August 2023, 19:19 IST

    • Toyota Rumion vs Kia Carens : టయోటా రుమియన్​ వర్సెస్​ కియా క్యారెన్స్​. ఈ రెండు ఎంపీవీల్లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకుందాము..
రుమియన్​ వర్సెస్​ క్యారెన్స్​.. ఏది బెస్ట్​?
రుమియన్​ వర్సెస్​ క్యారెన్స్​.. ఏది బెస్ట్​? (HT AUTO)

రుమియన్​ వర్సెస్​ క్యారెన్స్​.. ఏది బెస్ట్​?

Toyota Rumion vs Kia Carens : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో అటు ఎస్​యూవీ సెగ్మెంట్​తో పాటు ఎంపీవీ విభాగంలోనూ పోటీ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త లాంచ్​ చేస్తున్న సంస్థలు.. కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. తాజాగా.. ఈ జాబితాలోకి టయోటా రుమియన్​ చేరింది! ఈ మోడల్​ను ఇటీవలే ఆవిష్కరించింది టయోటా సంస్థ. త్వరలోనే లాంచ్​ చేయనుంది. ఇది.. కియా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న క్యారెన్స్​ ఎంపీవీకి గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ఈ ఎంపీవీల డైమెన్షన్స్​ వివరాలివే..

మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా ఈ రుమియన్​ను రూపొందించింది టయోటా సంస్థ. ఇందులో ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​, క్రోమ్​ సరౌండెడ్​ గ్రిల్​, ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​, రిమోట్​ ఫోల్టింగ్​ ఫంక్షన్​తో కూడిన బాడీ కలర్డ్​ ఓఆర్​వీఎంలు, 16 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ అలాయ్​ వీల్స్​ లభిస్తున్నాయి.

టయోటా కొత్త ఎంపీవీ పొడవు 4,420ఎంఎం. వెడల్పు 1,735ఎంఎం. ఎత్తు 1,690ఎంఎం. వీల్​బేస్​ 2,740ఎంఎం.

Toyota Rumion on road price Hyderabad : మరోవైపు కియా క్యారెన్స్​లో స్కల్ప్​టెడ్​ హుడ్​, స్లీక్​ గ్రిల్​ డిజైన్​, ఆటోమెటిక్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, స్ప్లిట్​ టైప్​ డీఆర్​ఎల్స్​, సిల్వర్డ్​ రూఫ్​ రెయిల్స్​, క్రోమ్​ లింక్​డ్​ విండోలు, కనెక్టెడ్​ స్టైల్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, బ్లాక్​డ్​ ఔట్​ క్లాడింగ్​, 16 ఇంచ్​ డైమెండ్​ కట్​ లాయ్​ వీల్స్​ వస్తున్నాయి.

క్యారెన్స్​ ఎంపీవీ పొడవు 4,540ఎంఎం. వెడల్పు 1,800ఎంఎం. ఎత్తు 1,708ఎంఎం. వీల్​బేస్​ 2,780ఎంఎం.

ఈ రెండు ఎంపీవీ ఫీచర్స్​ ఇవే..

రుమియన్​ ఎంపీవీ 7 సీటర్​ కేబిన్​లో డ్యూయెల్​ టోన్​ డాష్​బోర్డ్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 7 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 4 ఎయిర్​ బ్యాగ్స్​ వస్తున్నాయి.

ఇక క్యారెన్స్​లో 6 సీట్​, 7సీట్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఈ కారు కేబిన్​లో ప్రీమియం లెథరెట్​ అప్ ​హోలిస్ట్రీ, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, పానారోమిక్​ సన్​రూఫ్​, వయర్​లెస్​ ఛార్జర్​, ఎయిర్​ ప్యూరిఫయర్​, 6 ఎయిర్​బ్యాగ్స్​, 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ వంటివి లభిస్తున్నాయి.

ఈ రెండింటి ఇంజిన్​ ఆప్షన్​ వివరాలు..

టయోటో కొత్త కారులో 1.5 లీటర్​, డ్యూయెల్​ జెట్​ పెట్రోల్​ ఇంజిన్​ (మైల్డ్​ హైబ్రీడ్​) ఉంటుంది. ఇది 103 హెచ్​పీ పవర్​ను ,136.8 ఎన్​ఎంట్​ టర్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇక సీఎన్​జీ వేరియంట్​.. 87 హెచ్​పీ పవర్​ను, 121 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ దీని సొంతం.

ఇక కియా క్యారెన్స్​లో 1.4 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ (140 హెచ్​పీ పవర్​- 242 ఎన్​ఎం టార్క్​), 1.5 లీటర్​ పెట్రోల్​ (115 హెచ్​పీ పవర్​- 144 ఎన్​ఎం టర్క్​), 1.5 లీటర్​ టర్బో డీజిల్​ (113.4 హెచ్​పీ పవర్​- 250 ఎన్​ఎం టార్క్​) ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 6 స్పీడ్​ మేన్యువల్​/ ఆటోమెటిక్​తో పటు 7 స్పీడ్​ డీసీటీ గేర్​బాక్స్​ లభిస్తోంది.

వీటి ధరల వివరాలివే..

Kia Carens on road price Hyderabad : టయోటా రుమియన్​ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 9లక్షలుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరోవైపు కియా క్యారెన్స్​ ఎంపీవీ ఎక్స్​షోరూం ధర రూ. 10.45లక్షలు- రూ. 18.9లక్షల మధ్యలో ఉంటుంది.

తదుపరి వ్యాసం