Safest SUVs in India : ధర చూస్తే సరిపోదు.. ఫ్యామిలీ 'సేఫ్టీ' కూడా ముఖ్యం- ఈ ఎస్‌యూవీలకు 5 స్టార్ రేటింగ్
08 October 2024, 7:05 IST
- Safest SUVs in 2024 : కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో 5 స్టార్ రేటింగ్‌తో వస్తున్న టాప్ ఎస్‌యూవీల లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకోండి..
ఈ ఎస్‌యూవీలకు 5 స్టార్ రేటింగ్..
పండగ సీజన్లో దాదాపు అన్ని ఆటోమొబైల్ సంస్థలు తమ ప్రాడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది కొత్త వాహనం కొనేందుకు వెళుతున్నాయి. అయితే వాహనం కొనేందుకు ధర ఒక్కటే ప్రామాణికం కాదని గుర్తుపెట్టుకోవాలి. కుటుంబం సేఫ్‌గా ఉండాలంటే.. సంబంధిత కారు సేఫ్టీ రేటింగ్ కూడా చూడాలి. ఈ నేపథ్యంలో భారత దేశంలో 5 స్టార్ రేటింగ్‌తో అందుబటులో ఉన్న కొన్ని ఎస్‌యూవీల లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకోండి..
5 స్టార్ రేటింగ్ పొందిన ఎస్‌యూవీల లిస్ట్..
టాటా నెక్సాన్
గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లను రెండుసార్లు ఎదుర్కొని, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఏకైక ఎస్యూవీ టాటా నెక్సాన్. అత్యధిక భద్రతా రేటింగ్‌ను ఈ ఎస్యూవీ పొందింది. మారుతీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచిన ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ అడల్ట్ ప్రొటెక్షన్ లో 34 పాయింట్లకు గాను 32.22 పాయింట్లు, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 49కి 44.52 పాయింట్లు సాధించింది. ఈ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ మౌంట్స్, రేర్ పార్కింగ్ సెన్సార్లు, టిల్ట్ అండ్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టాటా హారియర్..
భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ చేయించుకున్న మొదటి ఎస్యూవీ టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్. ఆరు ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్‌గా కలిగి ఉండి, మెరుగైన భద్రతా ఫీచర్లతో ఇది గత సంవత్సరం లాంచ్ అయ్యింది. టాప్-ఎండ్ వేరియంట్లలో ఏడు ఎయిర్ బ్యాగుల వరకు వస్తున్నాయి. ఇతర భద్రతా ఫీచర్లతో పాటు డ్రైవర్లకు సహాయపడటానికి ఏడీఏఎస్ టెక్నాలజీని కూడా ఇందులో ఉంది. హారియర్ బాడీషెల్ ఇంటిగ్రిటీ స్థిరంగా ఉందని గ్లోబల్ ఎన్సీఏపీ పేర్కొంది. పాదచారుల రక్షణ కోసం యూఎన్ 127, జీటీఆర్ 9 అవసరాలను కూడా ఈ ఎస్యూవీ ప్రామాణికంగా తీర్చింది. అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్‌లో ఈ ఎస్యూవీ 34 పాయింట్లకు గాను 33.05 పాయింట్లు, చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్‌లో 49కి 45 పాయింట్లు సాధించింది. ఎస్యూవీ మొత్తం భద్రతా స్కోరు 78.05 పాయింట్లు.
టాటా సఫారీ..
హారియర్ ఫేస్‌లిఫ్ట్‌తో పాటు లాంచ్ చేసిన కొత్త సఫారీ కూడా భారత్ ఎన్సీఏపీ పరీక్షకు వెళ్లింది. ఈ ఎస్‌యూవీలోనూ చాలా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఊహించినట్లుగానే, ఈ ఎస్యూవీ హారియర్ మాదిరిగానే పాయింట్లు, సేఫ్టీ ర్యాంకింగ్‌తో తిరిగి వచ్చింది. రూ.16.19 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ అయిన ఈ మూడు వరుసల ఎస్‌యూవీలో ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్పీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ అటెన్షన్ అలర్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎమర్జెన్సీ కాల్, బ్రేక్ డౌన్ అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
టాటా పంచ్..
టాటా మోటార్స్‌కి చెందిన అతిచిన్న ఎస్యూవీ పంచ్ కూడా భారతదేశంలో సురక్షితమైన ఎస్‌యూవీల జాబితాలో ఉంది. గ్లోబల్ ఎన్సీఏపీలో ఓవరాల్ ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి పంచ్ అందరిని ఆశ్చర్యపరిచింది. అడల్ట్ లేదా చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే సేఫ్టీ రేటింగ్స్ ఎక్స్‌యూవీ700 మాదిరిగానే ఉండటం విశేషం. అయితే పంచ్ మొత్తం సేఫ్టీ స్కోర్ 57.34 పాయింట్లుగా ఉంది.
వోక్స్వ్యాగన్ టైగన్..
జర్మన్ ఆటో దిగ్గజం నుంచి వచ్చిన టైగన్ కాంపాక్ట్ ఎస్యూవీ కూడా భారతదేశంలోని సురక్షితమైన ఎస్‌యూవీల్లో ఒకటి. గత ఏడాది జరిగిన గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో వయోజన, పిల్లల రక్షణ చర్యల్లో పర్ఫెక్ట్ 5 మార్కులు సాధించింది. మొత్తం సేఫ్టీ స్కోర్ 71.64 పాయింట్లుగా ఉంది.
స్కోడా కుషాక్..
వోక్స్వ్యాగన్ టైగన్ సాంకేతిక సిబ్లింగ్ అయిన స్కోడా కుషాక్ కాంపాక్ట్ ఎస్యూవీ సైతం గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లలో ఇదే భద్రతా రేటింగ్ పొందింది. అడల్ట్, చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ రెండింటిలోనూ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది.
మహీంద్రా స్కార్పియో-ఎన్..
మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ స్కార్పియో ఎస్యూవీ కొత్త తరం వెర్షన్ అయిన స్కార్పియో-ఎన్ ఎస్యూవీ ప్రస్తుతం భారతదేశంలోని సురక్షితమైన ఎస్‌యూవీల్లో ఒకటి. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఇది 58.18 పాయింట్లు సాధించింది. వయోజన ప్రయాణీకుల రక్షణలో ఫైవ్ స్టార్ రేటింగ్‌ను పొందింది. కానీ పిల్లల రక్షణలో కేవలం 3 స్టార్ పాయింట్లను మాత్రమే సాధించింది. ఇది అధికారికంగా భారతీయ కార్ల తయారీదారుల నుంచి సురక్షితమైన ఎస్యూవీ.
మహీంద్రా ఎక్స్‌యూవీ700..
మహీంద్రా ఫ్లాగ్షిప్ ఎక్స్‌యూవీ 700 ఎస్యూవీ ఇంతకుముందు అత్యంత సురక్షితమైన కారుగా ఉండేది. ఎక్స్‌యూవీ 700 అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, ఫోర్ స్టార్ రేటింగ్ చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. అయితే మొత్తం సేఫ్టీ స్కోర్ 57.69 పాయింట్లు కాగా, స్కార్పియో-ఎన్ కంటే కాస్త తక్కువగా ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ300..
గ్లోబల్ ఎన్సీఏపీలో మొత్తం ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన మూడవ మహీంద్రా ఎస్యూవీ ఈ ఎక్స్‌యూవీ300. ఇది అడల్ట్ రక్షణలో 5 స్టార్ సాధించగా, చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ రేటింగ్ నాలుగు స్టార్లుగా ఉంది. ఎక్స్‌యూవీ 300 మొత్తం భద్రతా స్కోరు 53.86 పాయింట్లు.