Family Safety Cars : ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు ఈ కార్లు సేఫ్.. 5 స్టార్ రేటింగ్!
24 September 2024, 10:14 IST
- Safety Cars : కుటుంబంతో కారులో లాంగ్ డ్రైవ్ వెళ్తే.. ఆ థ్రిల్ బాగుంటుంది. అయితే ఇలాంటి సమయంలో సేఫ్టీ కూడా చూసుకోవాలి. కారు కొనే ముందే సెఫ్టీ ఫీచర్లు చెక్ చేయాలి. క్రాష్ టెస్ట్‌లో వచ్చిన రిజల్ట్ గురించి తెలుసుకోవాలి.
మహీంద్రా ఎక్స్‌యూవీ700
కొత్త కారు కొనే సమయంలో మైలేజీ, ధర, కారు సేఫ్టీ ఫీచర్లను చూసుకుని కొనుగోలు చేసే అలవాటు ఇటీవలి కాలంలో పెరిగింది. ముఖ్యంగా 6-7 మందితో కుటుంబ సమేతంగా ప్రయాణించాలనుకునే వారి మొదటి దృష్టి కారు భద్రతపైనే ఉంటుంది. అటువంటి వ్యక్తుల కోసం 5 స్టార్ రేటింగ్‌తో భారతదేశంలో అందుబాటులో ఉన్న అతిపెద్ద ఫ్యామిలీ SUVల గురించి చూద్దాం..
మహీంద్రా స్కార్పియో-ఎన్
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మహీంద్రా కార్లలో మహీంద్రా స్కార్పియో ఒకటి. స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ అనే 2 విభిన్న వెర్షన్‌లలో అమ్ముతున్నారు. ఆధునిక స్కార్పియో కారు అయిన స్కార్పియో-ఎన్ భద్రతా ఫీచర్ల పరంగా 5 స్టార్‌లను పొందింది.
Scorpio-N 2.2-లీటర్ Mhawk డీజిల్, 2.0-లీటర్ Mstaleon టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటితో పాటు గేర్‌బాక్స్ ఎంపికలుగా అందించారు. ఇది 6-7 సీటర్ ఎంపికలలో లభిస్తుంది. Scorpio-N పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ700
ఇటీవలి కాలంలో మహీంద్రా నుండి వచ్చిన కార్లలో ఎక్స్‌యూవీ700 ఒకటి. XUV700 గతంలో వచ్చిన XUV500 తర్వాతి వెర్షన్. గ్లోబల్ NCAPలో పెద్దల భద్రత కోసం XUV700 5 స్టార్, పిల్లల భద్రత కోసం 4 స్టార్‌లను స్కోర్ చేసింది. ఇది 5-సీటర్, 7-సీటర్ ఎంపికలలో ఉంది. MX, AX అనే 2 వేరియంట్‌లలో లభిస్తుంది. XUV700 స్కార్పియో-Nలాగానే అదే డీజిల్, టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపికలను అందిస్తుంది.
టాటా సఫారి
భారతదేశంలోని మరొక ప్రముఖ కార్ కంపెనీ అయిన టాటా మోటార్స్ నుండి సఫారి ఖరీదైన కారు. గ్లోబల్ NCAP, ఇండియా NCAP(New Car Assessment Program) క్రాష్ టెస్ట్‌లలో సఫారి 5 స్టార్ రేటింగ్ పొందింది.
ఇది కూడా 6-7 సీట్లు కలిగిన మిడ్-సైజ్ SUV. సఫారీ 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 3,750 rpm వద్ద 167.6 bhp శక్తిని, 1,750 - 2,500 rpm వద్ద 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కలిగి ఉంటుంది.
కారును కొనేటప్పుడు క్రాష్ టెస్ట్‌లో ఎంత స్కోర్ చేసిందో తెలుసుకోవడం ముఖ్యం. దీని కోసమే భారత ప్రభుత్వం గత సంవత్సరం భారత్ NCAP క్రాష్ టెస్ట్‌ని ప్రవేశపెట్టింది. ఫ్యామిలీతో వెళ్లేటప్పుడు కారు సేఫ్టీపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.