Tata Motors Share : పడిపోయిన టాటా మోటార్స్ స్టాక్.. నిఫ్టీ 50లో టాప్ లూజర్!-stock market ubs securities gives sell call on tata motors share price fall ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Motors Share : పడిపోయిన టాటా మోటార్స్ స్టాక్.. నిఫ్టీ 50లో టాప్ లూజర్!

Tata Motors Share : పడిపోయిన టాటా మోటార్స్ స్టాక్.. నిఫ్టీ 50లో టాప్ లూజర్!

Anand Sai HT Telugu
Sep 11, 2024 12:22 PM IST

Tata Motors Share : సెప్టెంబర్ 11న ప్రారంభ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్లు పడిపోయాయి. నిఫ్టీ 50 టాప్ లూజర్లలో ఒకటిగా నిలిచింది. టాటా మోటార్స్ షేరు ఉదయం 09.52 గంటలకు ఎన్‌ఎస్‌ఇలో రూ.988.45 వద్ద ట్రేడ్ అయింది. తర్వాత మరింత పడిపోయింది.

టాటా మోటర్స్
టాటా మోటర్స్

టాటా మోటార్స్ షేర్ ధర క్షీణించాయి. ఉదయంపూట నెమ్మదిగా పతనమైన ఈ షేర్లు తర్వాత ఐదు శాతానికిపైగా కిందకు వెళ్లాయి. బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ టాటా మోటార్స్‌పై 'అమ్మకం' కాల్‌ని కొనసాగించిన తర్వాత ఇది జరిగింది . కంపెనీ లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్, ల్యాండ్ రోవర్, దేశీయ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ మార్జిన్ ధర మరింత తగ్గే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది.

దీని ప్రకారం టాటా మోటార్స్ స్టాక్ కోసం UBS టార్గెట్ ధరను రూ. 825గా కొనసాగించింది. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 20 శాతం కంటే తక్కువను చూపిస్తుంది. JLR(జాగ్వార్ లాండ్ రోవర్) డిఫెండర్, రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ వంటి ప్రీమియం మోడల్స్ సేల్స్ రాబోయే రోజుల్లో మితంగా ఉంటాయని బ్రోకరేజీ సంస్థ అంచనా. ఈ మూడింటి ఆర్డర్‌బుక్ ఇప్పుడు ప్రీ-కోవిడ్ కంటే ముందు స్థాయికి పడిపోయినట్టుగా పేర్కొంది. రేంజ్ రోవర్ డిస్కౌంట్లు మరింత పెరుగుతాయని భావిస్తోంది. డిస్కౌంట్లు పెరిగితే ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతారని యూబీఎస్ అంటోంది. ప్రస్తుతం టాటా మోటర్స్ షేరు రూ.980(12.05 గంటలకు) వద్ద ట్రేడ్ అవుతోంది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3.61 లక్షల కోట్లకు తగ్గింది.

'జెఎల్‌ఆర్ డిస్కౌంట్‌ల ఎక్కువ అవడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు.' అని బ్రోకరేజ్ ఒక నోట్‌లో రాసింది. ఇలాంటి కారణాలతో టాటా మోటర్స్ షేరు పతనమైంది.

సెప్టెంబర్ 10న టాటా మోటర్స్ ఫెస్టివల్ ఆఫ్ కార్స్ ప్రచారంలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) శ్రేణిలో గణనీయమైన ధరల తగ్గింపులను ప్రారంభించింది. అక్టోబరు 31 వరకు చెల్లుబాటు అయ్యే టైమ్ పీరియడ్‌తో ఆఫర్ ప్రకటించింది. భారతదేశంలో టాటా మోటర్స్ EVలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ చర్య తీసుకుంది.

అంతేకాదు అదనంగా వినియోగదారులు దేశవ్యాప్తంగా 5,500 టాటా పవర్ స్టేషన్లలో ఆరు నెలల ఉచిత ఛార్జింగ్ పొందే అవకాశాన్ని కూడా కంపెనీ ఇచ్చింది. ఇది ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్లేందుకు ఖర్చు లేకుండా చేస్తుంది.

టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స EV కొనుగోలుదారులను పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. 'TATA.evలో యాజమాన్యం వ్యయాన్ని తగ్గించడం ద్వారా EVలను ఎక్కువగా జనాల్లోకి తీసుకురావడమే మా లక్ష్యం. ఈ ప్రత్యేక ధరలతో ఈవీలు, పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాటి మధ్య అంతరాన్ని తొలగిస్తున్నాం.' అని చెప్పారు.

Whats_app_banner