Redmi K60 Ultra : రెడ్మీ కే60 అల్ట్రా లాంచ్ రేపే.. ఈ ఫీచర్స్‌తో!
04 September 2023, 14:59 IST
- Redmi K60 Ultra : రెడ్మీ కే60 అల్ట్రా లాంచ్ సోమవారం జరగనుంది. ఇందుకోసం సంస్థ ఓ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రెడ్మీ కే60 అల్ట్రా లాంచ్ రేపే.. ఈ ఫీచర్స్‌తో!
Redmi K60 Ultra : షావోమీకి చెందిన రెడ్మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ రెడ్మీ కే60 అల్ట్రా.. ఆగస్ట్ 14న చైనాలో లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాము..
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవే..?
ఈ రెడ్మీ కే60 అల్ట్రా.. గతేడాది లాంచ్ అయిన రెడ్మీ కే50 అల్ట్రాకు సక్సెసర్‌గా రానుంది. కే50 అల్ట్రా.. చైనా మార్కెట్‌కే పరిమితమైంది. ఇక కొత్త మొబైల్ కూడా అక్కడే లభించొచ్చు. అయితే.. కే50 అల్ట్రాకు స్వల్ప మార్పులు చేసి షావోమీ 12టీ ప్రోగా అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది సంస్థ. కొత్త డివైజ్ విషయంలోనూ ఇదే జరగొచ్చు! చైనాలో లాంచ్ తర్వాత.. షావోమీ 13టీ ప్రో పేరుతో మొబైల్‌ను లాంచ్ చేయాలని సంస్థ భావిస్తున్నట్టు సమాచారం.
Redmi K60 Ultra features : ఇక స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఈ రెడ్మీ కే60 అల్ట్రాలో 6.67 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండనుంది. పిక్సెల్‌వర్క్స్ ఎక్స్7 డిస్ప్లే చిప్.. ఈ ప్యానెల్లో ఉంటుంది. కెమెరా వివరాలపై ప్రస్తుతం సమాచారం లేదు. అయితే ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుందని, దీనితో 8కే వీడియోలు షూట్ చేయవచ్చని తెలుస్తోంది. ఫ్రెంట్ కెమెరాపైనా క్లారిటీ లేదు.
ఇక ఈ కొత్త స్మార్ట్‌ఫోన్.. సియాన్, బ్లాక్ షేడ్స్‌లో అందుబాటులోకి రానుంది. స్పెషల్ వైట్ వర్షెన్ కూడా వస్తుందని తెలుస్తోంది. సెంట్రల్ అలైన్డ్ పంచ్ హోల్, స్లిమ్ బెజెల్స్, అండర్- డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్లు ఫ్రెంట్లో వస్తాయి. ఐపీ68 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సేఫ్టీ ఈ మొబైల్‌కు లభిస్తుందని సమాచారం.
Redmi K60 Ultra price : ఈ రెడ్మీ కే60 అల్ట్రాలో డైమెన్సిటీ 9200 ప్లస్ చిప్సెట్ ఉంటుందని రూమర్స్ ఉన్నాయి. 24జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీపీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ వంటివి ఇందులో ఉంటాయని సంస్థ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది.
ఈ మొబైల్ బ్యాటరీ కెపాసిటీపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. కాకాపోతే దీనికి 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. డ్యూయెల్ సిమ్, 5జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.3, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ- సీ పోర్ట్, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఇందులో ఉండే అవకాశం ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుంది?
Redmi K60 Ultra price in India : చైనాలో రెడ్మీ కే60 అల్ట్రా ధర 3వేల యువాన్లుగా ఉండొచ్చని సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీలో అది దాదాపు రూ. 35వేలు.
ఇక సోమవారం జరగనున్న ఈవెంట్‌తో ఈ మోడల్‌పై పూర్తి క్లారిటీ వస్తుంది. ఇదే ఈవెంట్లో షావోమ మిక్స్ ఫోల్డ్ 3 ఫోల్డెబుల్ ఫోన్, ప్యాడ్ 6 మ్యాక్స్ ట్యాబ్, షావోమ బ్యాండ్ 8 ప్రో వంటి గ్యాడ్జెట్స్‌ని కూడా రిలీజ్ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది.