తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi K70 Pro : రెడ్​మీ కే70 ప్రో స్పెసిఫికేషన్స్​ లీక్​..!

Redmi K70 Pro : రెడ్​మీ కే70 ప్రో స్పెసిఫికేషన్స్​ లీక్​..!

Sharath Chitturi HT Telugu

14 July 2023, 12:20 IST

google News
    • Redmi K70 Pro : రెడ్​మీ కే70 ప్రోకు సంబంధించిన స్పెసిఫికేషన్స్​ లీక్​ అయ్యాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము..
రెడ్​మీ కే70 ప్రో స్పెసిఫికేషన్స్​ లీక్​..!
రెడ్​మీ కే70 ప్రో స్పెసిఫికేషన్స్​ లీక్​..! (HT TECH/ Representative image)

రెడ్​మీ కే70 ప్రో స్పెసిఫికేషన్స్​ లీక్​..!

Redmi K70 Pro specs : రెడ్​మీ నుంచి ఓ కొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​ ఈ ఏడాది చివర్లో లాంచ్​ అవుతుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇది.. "రెడ్​మీ కే70" అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్​లోని ప్రో మోడల్​కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్​ ఆన్​లైన్​లో తాజాగా లీక్​ అయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాము..

రెడ్​మీ కే70 ప్రో స్పెసిఫికేషన్స్​ ఇవే..!

చైనాకు చెందిన డిజిటల్​ చాట్​ స్టేషన్​ అనే టిప్​స్టర్​ ప్రకారం.. ఈ కే70 ప్రో స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 ప్రాసెసర్​ ఉంటుంది. గతంలో వచ్చిన లీక్స్​ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. బేస్​ మోడల్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 చిప్​సెట్​ ఉంటుందని పేర్కొన్నాయి.

ఇక రెడ్​మీ కే70 ప్రోలో 5,120ఎంఏహెచ్​తో కూడిన బ్యాటరీ ఉంటుందని, ఇది 120వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ చేస్తుందని టిప్​స్టర్​ నుంచి పోస్ట్​ వచ్చింది. ఇందులో 2కే రిసొల్యూషన్​తో కూడిన డిస్​ప్లే ఉంటుందని ఆ పోస్ట్​లో ఉంది.

ఇదీ చూడండి:- షావోమీ, రెడ్​మీ బ్రాండ్స్​లో టాప్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే! ఓ లుక్కేయండి..

వాస్తవానికి ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​లో మొత్తం 3 గ్యాడ్జెట్స్​ ఉంటాయని తెలుస్తోంది. కే70, కే70తో పాటు కే70-ఈ మోడల్​ కూడా లాంచ్​ అవుతుందని సమాచారం. గతేడాది కూడా కే60 సిరీస్​లో కే60 ఈని సంస్థ లాంచ్​ చేసింది. అయితే.. ఈ కే70- ఈ మోడల్​ చైనాకే పరిమితం అవ్వొచ్చు. ఇందులో డైమెన్సిటీ 8300 చిప్​సెట్​ ఉండనుంది.

మరోవైపు చైనాలో రెడ్​మీ కే70, కే70 ప్రో లాంచ్​ తర్వాత.. ఆ మోడల్స్​ అంతర్జాతీయంగానూ రిలీజ్​ అవ్వొచ్చు. ఇవన్నీ చూస్తుంటే.. ఈ మోడల్స్​ పోకో ఎఫ్​6, పోకో ఎఫ్​6 ప్రో పేర్లతో ఇండియాలో అడుగుపెట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

రెడ్​మీ నోట్​ 12.. త్వరలోనే లాంచ్​..!

Redmi latest smartphones : రెడ్​మీ 12 త్వరలోనే లాంచ్​ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​.. రెడ్​మీ 10కి సక్సెసర్​గా ఉంటుందని తెలుస్తోంది. పోర్చుగల్​లోని రెడ్​మీ అధికారిక వెబ్​సైట్​లో రెడ్​మీ 12 దర్శనమిచ్చింది. 4జీబీ ర్యామ్​- 8జీబీ ర్యామ్​/ 12జీబీ స్టోరేజ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్లలో ఇది అందుబాటులోకి రావచ్చు. ఇక స్మార్ట్​ఫోన్​ ధర 209.99 యూరోలుగా ఉంది. అంటే ఇండియన్​ కరెన్సీలో అది సుమారు రూ. 18,600. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం