Grand Vitara on road price Hyderabad : మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
16 March 2024, 11:29 IST
- Maruti Suzuki grand vitara price : మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ఎస్యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే.. హైదరాబాద్‌లో ఈ ఎస్యూవీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా..
Maruti Suzuki grand vitara price in Hyderabad : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ.. గత కొంతకాలంగా ఎస్‌యూవీలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే లాంచ్ అయిన మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాకు డీసెంట్ డిమాండ్ కనిపిస్తోంది. సూపర్ డిజైన్‌తో పాటు తక్కువ ధరకే మంచి ఫీచర్స్ వస్తుండటంతో కస్టమర్లు.. గ్రాండ్ విటారాను కొనేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మీరు కూడా ఒక ఎస్యూవీ కొనాలని చూస్తున్నారు? మీ బడ్జెట్ రూ. 14లక్షలు- 24 లక్షల మధ్యలో ఉందా? అయితే.. ఇది మీకోసమే! హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ఆన్‌రోడ్ ప్రైజ్..
మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా సిగ్మా:- రూ. 13,25,030
గ్రాండ్ విటారా డెల్టా:- రూ. 14.95 లక్షలు
గ్రాండ్ విటారా డెల్టా సీఎన్జీ:- రూ. 16.12 లక్షలు
గ్రాండ్ విటారా డెల్టా ఏటీ:- రూ. 16.64 లక్షలు
గ్రాండ్ విటారా జీటా:- రూ. 17.14 లక్షలు
గ్రాండ్ విటారా జీటా సీఎన్జీ:- రూ. 18.25 లక్షలు
గ్రాండ్ విటారా ఆల్ఫా:- రూ. 18.97 లక్షలు
గ్రాండ్ విటారా ఆల్ఫా డీటీ:- రూ. 19.16 లక్షలు
గ్రాండ్ విటారా ఆల్ఫా ఏటీ:- రూ. 20.66 లక్షలు
ఇదీ చూడండి:- Tata Punch EV on road price in Hyderabad : హైదరాబాద్‌లో టాటా పంచ్ ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
గ్రాండ్ విటారా ఆల్ఫా ఏడబ్ల్యూడీ:- రూ. 20.78 లక్షలు
గ్రాండ్ విటారా ఆల్ఫా ఏటీ డీటీ:- రూ. 20.86 లక్షలు
గ్రాండ్ విటారా ఆల్ఫా ఏడబ్ల్యూ డీటీ:- రూ. 20.99 లక్షలు
గ్రాండ్ విటారా జీటా ప్లస్ హైబ్రీడ్ సీవీటీ:- రూ. 22.54 లక్షలు
గ్రాండ్ విటారా జీటా ప్లస్ హైబ్రీడ్ సీవీటీ డీటీ:- రూ. 22.73 లక్షలు
గ్రాండ్ విటారా ఆల్ఫా ప్లస్ హైబ్రీడ్ సీవీటీ:- రూ. 24.35 లక్షలు
గ్రాండ్ విటారా ఆల్ఫా ప్లస్ హైబ్రీడ్ సీవీటీ డీటీ:- రూ. 24.76 లక్షలు.
Maruti Suzuki grand vitara on road price in Hyderabad : అంటే.. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ఆన్‌రోడ్ ప్రైజ్.. రూ. 13.25 లక్షలు- రూ. 24.76 లక్షల మధ్యలో ఉంటుంది. ఇక.. సీఎన్జీ మినహాయిస్తే.. మిగిలినవి అన్ని పెట్రోల్ వేరియంట్లే. ఈ ఎస్‌యూవీలో డీజిల్ వేరియంట్‌ని మారుతీ సుజుకీ ప్రవేశపెట్టలేదు.
ఏదైనా వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో.. దాని ఎక్స్‌షోరూం ధరను మాత్రమే చెబుతుంది ఆటోమొబైల్ సంస్థ. కానీ ఆన్‌రోడ్ ప్రైజ్ వేరుగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. అందుకే.. ఎక్స్‌షోరూం ప్రైజ్‌తో పాటు వెహికిల్ ఆన్‌రోడ్ ప్రైజ్‌ని పరిగణించిన.. బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవాలి. మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌కి వెళితే.. ఆ సమయంలో వెహికిల్‌పై ఏవైనా ఆఫర్స్ ఉన్నాయా? అన్న విషయం కూడా తెలుస్తుంది. అది మీకు ఉపయోగపడొచ్చు.