తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Wagon R On Road Price In Hyderabad : హైదరాబాద్​లో వాగన్​ ఆర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

Maruti Wagon R on road price in Hyderabad : హైదరాబాద్​లో వాగన్​ ఆర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

Sharath Chitturi HT Telugu

02 March 2024, 9:00 IST

    • Maruti Wagon R price in Hyderabad : మారుతీ వాగన్​ ఆర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. హైదరాబాద్​లో వాగన్​ ఆర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో వాగన్​ ఆర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..
హైదరాబాద్​లో వాగన్​ ఆర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

హైదరాబాద్​లో వాగన్​ ఆర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

Maruti Wagon R on road price Hyderabad : ఇండియాలో మారుతీ సుజుకీ వాహనాలకు డిమాండ్​ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఫిబ్రవరి నెలలో మొత్తం మీద 1,97,471 యూనిట్​లను విక్రయించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. వీటిల్లో దేశీయ సేల్స్​ నెంబర్​ 1,63,397. కంపెనీకి చెందిన కాంపాక్ట్​ సెగ్మెంట్​ బాగా రాణించింది. ఫిబ్రవరి 71,627 యూనిట్​లు ఈ కాంపాక్ట్​ సెగ్మెంట్​ నుంచి అమ్ముడుపోయాయి. మరీ ముఖ్యంగా.. కాంపాక్ట్​ సెగ్మెంట్​లోని వాగన్​ ఆర్​కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. తక్కువ ధరకు, మంచి ఫీచర్స్​ కావాలని చూస్తున్న కస్టమర్లకు.. ఈ వాగన్​ ఆర్​ మంచి ఆప్షన్​గా మారిందని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి. మరి మీరు కూడా ఒక వాగన్​ ఆర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. హైదరాబాద్​లో వాగన్​ ఆర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

హైదరాబద్​లో వాగన్​ఆర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

మారుతీ వాగన్​ ఆర్​ ఎల్​ఎక్స్​ఐ:- రూ. 6,52,268

వీఎక్స్​ఐ- రూ. 7.04 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ:- రూ. 7.43 లక్షలు

ఎల్​ఎక్స్​ఐ సీఎన్​జీ:- రూ. 7.57 లక్షలు

వీఎక్స్​ఐ ఏటీ:- రూ. 7.68 లక్షలు

Maruti Wagon R : జెడ్​ఎక్స్​ఐ ప్లస్​:- రూ. 7.98 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ ఏటీ:- రూ. 8.06 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ డ్యూయెల్​ టోన్​:- రూ. 8.12 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ ఏటీ:- రూ. 8.61 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ ఏటీ డ్యూయెల్​ టోన్​:- రూ. 8.75 లక్షలు

అంటే.. హైదరాబాద్​లో మారుతీ వాగన్​ ఆర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ రేంజ్​ రూ. 6.52లక్షలు- రూ. 8.75 లక్షల మధ్యలో ఉంటుంది. సీఎన్​జీ అని చెప్పిన మోడల్స్​ మినహా.. మిగిలినవి అన్ని పెట్రోల్​ ఇంజిన్​ ఉన్నవే. మారుతీ వాగన్​ ఆర్​లో డీజిల్​ మోడల్​ లేదు!

Maruti Suzuki latest news : ఇక మారుతీ వాగన్​ ఆర్​లో వీఎక్స్​ఐ సీఎన్​జీ, వీఎక్స్​ఐ పెట్రోల్​ మోడల్స్​.. బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప మారుతీ సుజుకీ డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శించాల్సి ఉంటుంది.

సాధారణంగా.. వెహికిల్​ని లాంచ్​ చేసేటప్పుడు.. దాని ఎక్స్​షోరూం ధరను మాత్రమే చెబుతుంది ఆటోమొబైల్​ సంస్థ. కానీ ఆ వెహికిల్​ ఆన్​రోడ్​ ప్రైజ్​.. ఎక్స్​షోరూం ప్రైజ్​ కన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో.. ట్యాక్స్​లు అనేవి వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. ఏదైనా బండి కొనాలని ప్లాన్​ చేస్తుంటే, దాని ఎక్స్​షోరూం ధర కాకుండా.. ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాలి. డీలర్​షిప్​ షోరూమ్స్​ని సంప్రదిస్తే.. ఏవైనా ఆఫర్స్​, డిస్కౌంట్స్​ ఉన్నాయా? అన్న వివరాలు కూడా తెలుస్తాయి.

తదుపరి వ్యాసం