Maruti Suzuki price hike : ప్చ్.. వాహనాల ధరలను మళ్లీ పెంచాలని ఫిక్స్ అయిన మారుతీ సుజుకీ!
Maruti Suzuki price hike news : మారుతీ సుజుకీ సంస్థ.. వాహనాల ధరలను మళ్లీ పెంచాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఈ సంస్థకు చెందిన ఓ అధికారు ఈ మేరకు సంకేతాలిచ్చారు. పూర్తి వివరాలు..
Maruti Suzuki price hike 2024 : సేల్స్ పరంగా.. గత కొన్నేళ్లుగా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ దూసుకెళుతోంది. అందుకు తగ్గట్టుగానే.. వాహనాల ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఆటోమొబైల్ సంస్థలు.. ధరలను మాటిమాటికి పెంచేస్తున్నాయి. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ.. మరోమారు ధరలను పెంచాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది!
ధరలు పెంపునకు మారుతీ సుజుకీ నిర్ణయం!
మారుతీ సుజుకీ ఎనలిస్ట్ కాల్ ఇటీవలే జరిగింది. అందులో.. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భార్తి మాట్లాడారు. మరోమారు ధరలు పెంచే యోచనలో ఉన్నట్టు ఆయన సంకేతాలిచ్చారు.
వాహనాల ధరల పెంపును ఎప్పుడు చెప్పే కారణాలే ఈసారి కూడా చెప్పారు రాహుల్. ముడిసరకు ధరలు, ప్రొడక్షన్ ఖర్చులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. వాటికి తోడు.. రెడ్ సీలో సంక్షోభం కారణంగా.. ప్రొడక్షన్‌కు అడ్డంకులు ఎదురవుతున్నాయని.. అందుకే ధరలను పెంచే యోచనలో ఉన్నట్టు తెలిపారు.
Maruti Suzuki latest news in Telugu : ఇజ్రాయెల్- హమాస్ మధ్య గతేడాది యుద్ధం మొదలైనప్పటి నుంచి రెడ్ సీలో ఉద్రిక్తతలు పెరుగుతూ వస్తున్నాయి. అనేక కంటైనర్ షిప్‌లపై మిలిటెంట్లు దాడి చేసి.. సప్లై చెయిన్ వ్యవస్థకి సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ఇదే విషయంపై ఆడీ ఇండియా ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు.. మారుతీ సుజుకీ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది.
"రెడ్ సీలో సంక్షోభం కారణంగా లాజిస్టిక్స్ పరంగా మాకు సవాళ్లు ఎదురవుతున్నాయి. రిస్క్ కారణంగా.. ఖర్చులు పెరగొచ్చు," అని రాహుల్ తెలిపారు. ఓడల రాకపోకలకు సంబంధించి సమస్యలు ఎదురవ్వొచ్చని, సరకును పిక్ చేసుకోవడంలో అనిశ్చితి ఉండొచ్చని ఆయన అన్నారు. అయితే.. ఇది ప్రస్తుతానికి సాధారణమైన విషయంగానే ఉందని, తీవ్రత ఇంకా పెరగలేదని వ్యాఖ్యానించారు.
వాహనాల ధరలు ఎంత పెరగొచ్చు? కొత్త రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? అన్న వివరాలను సంస్థ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
Maruti Suzuki : ఇండియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ. ప్యాసింజర్ వెహికిల్స్ ఎగుమతుల్లోనూ ఈ సంస్థ హవా కొనసాగిస్తోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 2.7లక్షల మేడ్ ఇన్ ఇండియా ప్యాసింజర్ వెహికిల్స్‌ని ఎగుమతి చేసింది. రానున్న రోజుల్లో ఈ నెంబర్ ఇంకా పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.
మారుతీ సుజుకీ ఈవీఎక్స్పై కీలక అప్డేట్..
Maruti Suzuki EVX electric SUV : ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కి మంచి డిమాండ్ కనిపిస్తోంది. కానీ.. ఈ సెగ్మెంట్లో మారుతీ సుజుకీకి ఇంకా ఒక్క మోడల్ కూడా లేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు.. మారుతీ సుజుకీ ఈవీఎక్స్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ వెహికిల్‌ని తయారు చేస్తోంది. తాజాగా జరిగిన ఎనలిస్ట్ కాల్లో.. ఈ ఈవీపై కీలక అప్డేట్ ఇచ్చారు రాహుల్. ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన ప్రొడక్షన్‌ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారును జపాన్‌తో పాటు యూరోప్‌కి కూడా ఎగుమతి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఈవీఎక్స్ ఈవీ.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా కన్నా పెద్దగా ఉంటుందని, రేంజ్ 550 కి.మీలుగా ఉండొచ్చని అన్నారు. తమ మొదటి ఎలక్ట్రిక్ వెహికిల్.. కస్టమర్లకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం