Maruti Suzuki price hike : మరోసారి భారీగా పెరగనున్న మారుతీ సుజుకీ కార్ల ధరలు!
Maruti Suzuki price hike : మారుతీ సుజుకీ వాహనాల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలు..
Maruti Suzuki price hike : కస్టమర్లకు మళ్లీ షాక్ ఇచ్చింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ! తమ పోర్ట్‌ఫోలియోలోని వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెంచిన ధరలు.. 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాగా.. ధరల పెంపునకు ఎప్పుడు చెప్పే కారణాలే ఈసారి కూడా చెప్పింది. ప్రొడక్షన్ కాస్ట పెరుగుతోందని, అందుకే వాహనాలపై ధరలను పెంచాల్సి వస్తోందని పేర్కొంది. అయితే.. ఏ వాహనాలపై ఎంత రేట్ హైక్ ఉంటుందనే విషయాన్ని సంస్థ ఇంకా చెప్పలేదు.
'ధరలు పెంచడానికి ఇదే కారణం..'
"ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు పెరుగుతుండటంతో కాస్ట్ ప్రెజర్ పడుతోంది. అందుకే.. వాహనాల ధరలను పెంచాల్సి వస్తోంది. అయితే, కస్టమర్లపై తక్కువ ప్రభావం పడే విధంగా చూస్తాము," అని మారుతీ సుజుకీ సంస్థ వెల్లడించింది.
Maruti Suzuki latest news : మారుతీ సుజుకీ పోర్ట్‌ఫోలియోలో హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్యూవీ, ఎంపీవీలు ఉన్నాయి. ఎంట్రీ లెవల్ మోడల్ ఆల్టో ఎక్స్‌షోరూం ధర రూ. 3.54లక్షలుగా ఉంది. ఇటీవలే లాంచ్ అయిన ఇన్విక్టో ఎంపీవీ ఎక్స్‌షోరూం ధర రూ. 24.80లక్షలుగా ఉంది. ఏ వాహనాలపై ధరల పెంపు ఉంటుందనేది సంస్థ ఇంకా చెప్పలేదు కానీ.. ఆల్టో నుంచి ఇన్విక్టో వరకు అన్ని వెహికిల్స్‌పై ప్రైజ్ హైక్ తీసుకుంటుందని టాక్ నడుస్తోంది.
బలెనో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా, ఆల్టో, ఎక్స్ఎల్6, ఎర్టిగా వంటి మోడల్స్.. మారుతీ సుజుకీకి బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్నాయి. కొత్త వచ్చిన ఫ్రాంక్స్, జిమ్నీకి కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది.
Maruti Suzuki rate hike news : మారుతీ సుజుకీ సంస్థ ఒక్కటే కాదు.. దాదాపు అన్ని సంస్థలు ప్రైజ్ హైక్ తీసుకుంటున్నాయి. దాదాపు రెండేళ్ల నుంచి ధరలను పెంచుకుంటూ వెళుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే కస్టమర్ల మీద చాలా భారం పడుతోంది. మళ్లీ ఇప్పుడు కూడా ధరలను పెంచేందుకు సిద్ధమవుతుండటం ఆందోళనకర విషయం.
మరోవైపు.. ఇండియాలో ఆటోమొబైల్ సెగ్మెంట్‌కి క్రేజీ డిమాండ్ కనిపిస్తోంది. ధరలు ఎంత పెరుగుతున్నా.. కస్టమర్లు వాహనాలను కొంటూనే ఉంటున్నారు. అందుకే.. వాహనాల తయారీ సంస్థలు, ధరల పెంపునకు ధైర్యం చేయగలుగుతున్నాయి!
సంబంధిత కథనం