తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Car Sales : దుమ్మురేపుతున్న ఎస్​యూవీ సెగ్మెంట్​.. మహీంద్రా, హ్యుందాయ్​కు బెస్ట్​ సేల్స్​!

Car sales : దుమ్మురేపుతున్న ఎస్​యూవీ సెగ్మెంట్​.. మహీంద్రా, హ్యుందాయ్​కు బెస్ట్​ సేల్స్​!

Sharath Chitturi HT Telugu

01 October 2023, 18:30 IST

google News
    • Car sales in September : ఎం అండ్​ ఎం, హ్యుందాయ్​ మోటార్​ సంస్థలు తమ సెప్టెంబర్​ సేల్స్​ డేటాను ప్రకటించాయి. ఆ వివరాలు..
 దుమ్మురేపుతున్న ఎస్​యూవీ సెగ్మెంట్​..
దుమ్మురేపుతున్న ఎస్​యూవీ సెగ్మెంట్​..

దుమ్మురేపుతున్న ఎస్​యూవీ సెగ్మెంట్​..

Car sales in September : సెప్టెంబర్​ నెలకు సంబంధించిన కార్​ సేల్స్​ డేటాను ఆటోమొబైల్​ సంస్థలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాయి. కాగా.. ఇప్పటికే విడుదలైన మహీంద్రా అండ్​ మహీంద్రా, హ్యుందాయ్​ మోటార్​ డేటాను చూస్తుంటే.. ఇండియాలో ఎస్​యూవీ సెగ్మెంట్​ హవా ఏ రేంజ్​లో ఉందనేది స్పష్టంగ తెలుస్తుంది.

మహీంద్రా అండ్​ మహీంద్రా సేల్స్​..

2023 సెప్టెంబర్​ నెలకుగాను సంస్థ చరిత్రలోనే ది బెస్ట్​ ఎస్​యూవీ సేల్స్​ను నమోదు చేసినట్టు ఎం అండ్​ ఎం ప్రకటించింది. గత నెలలో 41,267 యూనిట్​లను విక్రయించింది. 2022 సెప్టెంబర్​తో పోల్చుకుంటే (34,262) ఇది 20శాతం ఎక్కువ!

M&M sales September 2023 : ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటివరకు.. అంటే ఏప్రిల్​ నుంచి సెప్టెంబర్​ వరకు ఏకంగా 2,14,904 ఎస్​యూవీలను అమ్మినట్టు ఎం అండ్​ ఎం స్పష్టం చేసింది. గతేడాది ఇదే కాలంతో పోల్చుకుంటే (1,67,052) ఇది 29శాతం వృద్ధిచెందినట్టు!

మహీంద్రా అండ్​ మహీంద్రా పోర్ట్​ఫోలియోలో ఎక్స్​యూవీ700, ఎక్స్​యూవీ400, ఎక్స్​యూవీ300, స్కార్పియో ఎన్​, స్కార్పియో క్లాసిక్​తో పాటు మరెన్నో ఎస్​యూవీలు ఉన్నాయి. రానున్న పండుగ సీజన్​లో సేల్స్​ నెంబర్లు మరింత పెరుగుతాయని ఎం అండ్​ ఎం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:- 2024 టాటా హారియర్​, టాటా సఫారీ బుకింగ్స్​ షురూ..!

హ్యుందాయ్​ మోటార్​ సేల్స్​..

హ్యుందాయ్​ మోటార్​ కూడా తన సేల్స్​ డేటాను ఆదివారం ప్రకటించింది. సెప్టెంబర్​లో 71,641 యూనిట్​లను విక్రయించినట్టు వెల్లడించింది. సంస్థ చరిత్రలో ఓ నెలలో ఈ స్థాయిలో సేల్స్​ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ 71,641 యూనిట్​లలో దేశీయంగా 54,241 యూనిట్​లను విక్రయించినట్టు, విదేశాలకు 17,400 కార్లను ఎగుమతి చేసినట్టు సంస్థ వెల్లడించింది.

Hyundai car sales September 2023 : సెప్టెంబర్​లో చేసిన సేల్స్​లో ఎస్​యూవీ సెగ్మెంట్​కే 65శాతం వాటా ఉండటం విశేషం. హ్యుందాయ్​కి కూడా ఎస్​యూవీ పోర్ట్​ఫోలియో పటిష్ఠంగా ఉంది. వెన్యూ, క్రేటా, అల్కజార్​, టుక్సన్​ వంటి మోడల్స్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇక హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎంట్రీతో.. ఈ సెగ్మెంట్​లో పోటీ మరింత తీవ్రంగా మారిందనే చెప్పుకోవాలి.

తదుపరి వ్యాసం