Cars launch in October : టాటా పంచ్ ఈవీ లాంచ్ డేట్ ఫిక్స్! అక్టోబర్‌లో వచ్చేవి ఇవే!
29 September 2023, 11:57 IST
- Cars launch in October : టాటా పంచ్ ఈవీతో పాటు మరికొన్ని వాహనాలు.. అక్టోబర్‌లో లాంచ్‌కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు..
అక్టోబర్‌లో ఈ మచ్ అవైటెడ్ వాహనాల లాంచ్ ఫిక్స్..!
Cars launch in October 2023 : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో మచ్ అవైటెడ్ మోడల్స్‌లో ఒకటి టాటా పంచ్ ఈవీ. ఈ మోడల్.. వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు.. టాటా మోటార్స్ నుంచి అక్టోబర్‌లో 3 వాహనాలు లాంచ్ అవుతాయని తెలుస్తోంది. నిస్సాన్ సంస్థ కూడా ఓ స్పెషల్ ఎడిషన్ వెహికిల్‌ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
నిస్సాన్ మాగ్నైట్ కురో..
ఇండియాలో నిస్సాన్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది మాగ్నైట్. ఇక ఇప్పుడు.. మాగ్నైట్ స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేస్తోంది నిస్సాన్ సంస్థ. దీని పేరు నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్! ఈ మోడల్ బుకింగ్స్ ఇప్పటికే మొదలైపోయాయి. రూ. 11వేల టోకెన్ అమౌంట్‌తో.. సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్, డీలర్షిప్షోరూమ్స్లో ఈ వెహికిల్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్స్‌వీ ఎంటీ, టర్బో ఎక్స్‌వీ ఎంటీ, టర్బో ఎక్స్‌వీ సీవీటీ మోడల్స్ ఉండొచ్చు.
టాటా పంచ్ ఈవీ..
Tata Punch EV launch date : టాటా పంచ్ ఈవీ.. గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ నెలలో లాంచ్, వచ్చే నెలలో లాంచ్ అంటూ కొన్ని నెలలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు.. ఈ ఈవీని అక్టోబర్‌లో లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. ఈ టాటా పంచ్ ఈవీ టెస్ట్ రన్ జరిగినట్టు సమాచారం.
టాటా పంచ్ ఐసీఈ మోడల్‌కు భారీ డిమాండ్ కనిపించింది. ఇక ఈవీ వర్షెన్‌కి కూడా ఆదరణ లభిస్తుందని టాటా మోటార్స్ భావిస్తోంది. అయితే.. ఎలక్ట్రిక్ వర్షెన్కు పలు మార్పులు చేసినట్టు స్పై షాట్స్ చూస్తే తెలుస్తోంది.
టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను గత నెలలోనే లాంచ్ చేసింది టాటా మోటార్స్. ఇక టాటా పంచ్ ఈవీపైనా ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
టాటా హారియర్- టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్..
2024 Tata Harrier launch date : టాటా హారియర్, టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్లను టాటా మోటార్స్ సిద్ధం చేస్తోంది. ఈ రెండు ఎస్‌యూవీలను ఇప్పటికే చాలాసార్లు టెస్ట్ చేసింది సంస్థ. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అనధికారిక బుకింగ్స్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఫలితంగా.. అక్టోబర్‌లో ఈ ఎస్‌యూవీల ఫేస్‌లిఫ్ట్ వర్షెన్లు లాంచ్ అవుతాయని మార్కెట్లో రూమర్స్ మొదలయ్యాయి.
నిస్సాన్ మాగ్నైట్ మినహా.. మిగిలిన మోడల్స్‌కు చెందిన లాంచ్ డేట్‌పై అధికారిక ప్రకటన లేదు. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.