Electric scooter : ఈ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్- ఫుల్‌గా డబ్బులు ఆదా!
24 December 2024, 6:40 IST
- TVS iQube electric scooter : మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ఒకటైన టీవీఎస్ ఐక్యూబ్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఆ వివరాలు..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్స్..
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ఒకటి టీవీఎస్ ఐక్యూబ్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కర్ట్లో భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఈ-స్కూటర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు సుమారు రూ.85,000 (ఎక్స్ షోరూమ్)కు లభిస్తోంది. డిసెంబర్ 25, అంటే బుధవారం వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొనుగోలు చేస్తే భారీగా డబ్బులు ఆదా చేసుకున్నట్టు అవుతుంది.
టీవీఎస్ ఐక్యూబ్: ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్..
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో.. డిస్కౌంట్లకి ముందు రూ .1,03,299 (ఎక్స్-షోరూమ్) వద్ద ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ #justforyou డిస్కౌంట్ ప్రోగ్రామ్‌లో ఈ ఈ-స్కూటర్ ధర రూ .4000 తగ్గింది. ఇక రూ.20,000 కార్ట్ వాల్యూపై రూ.12,300 డిస్కౌంట్ లభిస్తోంది. గేమ్ ఛేంజర్ అయిన చివరి డిస్కౌంట్ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు నుంచి పేమెంట్ ఆఫర్. ఈ కార్డును ఉపయోగించి, కొనుగోలుదారులు రూ. 5,619 తగ్గింపు పొందవచ్చు. ఫలితంగా టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ ఫైనల్ రేటు కేవలం రూ .85,380 కు తగ్గుతుంది.
టీవీఎస్ ఐక్యూబ్: బ్యాటరీ, రేంజ్..
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 2.2 కిలోవాట్, 3.4 కిలోవాట్ ఆప్షన్స్ సహా రెండు వేరియంట్లు ఉన్నాయి. 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ టీవీఎస్ ఐక్యూబ్ 2 గంటల 45 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జింగ్ అవుతుంద. ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ బ్యాటరీ ప్యాక్ 75 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్ మోటార్ 4.4 కిలోవాట్ల రేటింగ్ కలిగి ఉంది. ఇది 140 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ-స్కూటర్ గరిష్ట వేగం గంటకు 75 కిలోమీటర్లు.
టీవీఎస్ ఐక్యూబ్: ఫీచర్లు, కలర్ ఆప్షన్లు..
2.2 కిలోవాట్ల వేరియంట్లో 5 ఇంచ్ కలర్ టీఎఫ్టీ స్క్రీన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. వెహికల్ క్రాష్ అండ్ టో అలర్ట్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్, పార్క్ అసిస్ట్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్, ఇతర కనెక్టెడ్ ఫీచర్లు ఈ స్కూటర్లో ఉన్నాయి.
టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కిలోవాట్ ఆప్షన్ వాల్నట్ బ్రౌన్, పర్ల్ వైట్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎయిర్, ఆంపియర్ నెక్సస్, బజాజ్ చేతక్ తదితర మోడళ్లకు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి పోటీని ఇస్తోంది.