తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bank Holiday Today : అలర్ట్​- నేటి నుంచి బ్యాంకులకు వరుసగా 4 రోజుల సెలవులు..!

Bank holiday today : అలర్ట్​- నేటి నుంచి బ్యాంకులకు వరుసగా 4 రోజుల సెలవులు..!

Sharath Chitturi HT Telugu

11 October 2024, 7:15 IST

google News
  • Bank holidays in October : నేటి నుంచి బ్యాంకులకు వరుసగా 4 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర ప్రాంతాల బ్యాంకులు మూసిపేసి ఉంటాయి. పూర్తి వివరాలు..

బ్యాంకులకు వరుసగా 4 రోజుల సెలవులు!
బ్యాంకులకు వరుసగా 4 రోజుల సెలవులు! (Mint)

బ్యాంకులకు వరుసగా 4 రోజుల సెలవులు!

అక్టోబర్ 2024 బ్యాంకు సెలవుల లిస్ట్​ని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) ఇప్పటికే ప్రకటించింది. ఈ నెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులు పనిచేయవు. మరీ ముఖ్యంగా శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుసగా సెలవులు లభించనున్నాయి. పూర్తి వివరాలు..

బ్యాంకులకు వరుసగా 4 రోజుల సెలవులు..

అక్టోబర్ 2వ తేదీ బుధవారం గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు ఇప్పటికే సెలవు లభించింది. ఇక నవరాత్రి, దుర్గాపూజ, రాష్ట్ర ప్రత్యేక పండుగలు వంటి పలు ప్రాంతీయ సెలవుల కారణంగా 4 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడి ఉంటాయి.

అక్టోబర్ 2024లో కీలక బ్యాంకు సెలవులు..

  • అక్టోబర్ 11: దసరా (మహాష్టమి/ మహానవమి)/ ఆయుధ పూజ/ దుర్గా పూజ (దసైన్)/ దుర్గా అష్టమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్​కతా, పట్నా, షిల్లాంగ్, రాంచీలో బ్యాంకులకు సెలవు)
  • అక్టోబర్ 12: రెండవ శనివారం/ దసరా / దసరా (మహానవమి / విజయదశమి)/ దుర్గాపూజ (దసేన్) (అగర్తలా, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్టక్, గౌహతి, హైదరాబాద్ - ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ - తెలంగాణ, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, కోల్​కతా, లక్నో, ముంబై, నాగ్​పూర్​, దిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్​పూర్, రాంచీ, షిల్లాంగ్, షిల్లాంగ్, రాంచీలలో బ్యాంకులకు సెలవు)
  • అక్టోబర్ 13: ఆదివారం, అన్ని బ్యాంకులకు సెలవు.

  • అక్టోబర్ 14: దుర్గా పూజ (దసైన్) (గ్యాంగ్టక్​లో బ్యాంకులకు సెలవు)
  • అక్టోబర్ 17, 2024 (గురువారం): మహర్షి వాల్మీకి జయంతి / కతి బిహు - కర్ణాటక, అసోం, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరుపుకుంటారు.
  • అక్టోబర్ 26, 2024 (శనివారం): విలీన దినోత్సవం - జమ్ముకశ్మీర్​ బ్యాంకులకు సెలవు.
  • అక్టోబర్ 31, 2024 (గురువారం): సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గుజరాత్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో జరుపుకునే ప్రధాన పండుగ దీపావళి.

వీటితో పాటు రెండు, నాలుగో శనివారాలు (అక్టోబర్ 12, 26) అలాగే నెలలో ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.

రాష్ట్రాల వారీగా బ్యాంకు సెలవులు

అక్టోబర్ నెలలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సెలవులు ఉంటాయి.

  • అక్టోబర్ 11 (శుక్రవారం): మహా అష్టమి / ఆయుధ పూజ (కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరుపుకుంటారు).
  • అక్టోబర్ 12 (శనివారం): విజయదశమి/దసరా (పలు రాష్ట్రాల్లో).
  • అక్టోబర్ 31 (గురువారం): నరక చతుర్దశి/ కాళీ పూజ (పశ్చిమ బెంగాల్, అసోం, కర్ణాటక, గుజరాత్).

ఈ సెలవు దినాల్లో బ్యాంకు శాఖలు మూసివేసి ఉంటాయి. వినియోగదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇది నెలంతా లావాదేవీలను నిర్వహించడానికి, చెల్లింపులు చేయడానికి, ఇతర ఆన్​లైన్​ సేవలను నిరాటంకంగా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప బ్యాంకు శాఖను సంప్రదించాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం