తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Inter Colleges Dasara Holidays : కాలేజీలకు 8 రోజులు దసరా సెలవులు - తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటన

Inter Colleges Dasara Holidays : కాలేజీలకు 8 రోజులు దసరా సెలవులు - తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటన

03 October 2024, 21:10 IST

google News
    • తెలంగాణలోని ఇంటర్‌ కాలేజీలకు దసరా సెలవులపై ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. 13వ తేదీ వరకు హాలీ డేస్ ఉంటాయని పేర్కొంది. 14వ తేదీన తిరిగి కాలేజీలు పునఃప్రారంభమవుతాయని తెలిపింది.
ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు
ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు

ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు

రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులపై ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ఉంటాయని పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలకు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. అక్టోబర్ 14వ తేదీన కళాశాలలు తిరిగి పునఃప్రారంభమవుతాయని తెలిపింది. ఈ మేరకు గురువారం ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

గడువు పొడిగింపు:

ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఇంటర్ బోర్డు. జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశ గడువును పొడిగించింది. అక్టోబర్ 15 తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది.

ఈ ఏడాది ప్రవేశాలకు సంబంధించి ఇదే చివరి అవకాశమని తెలంగాణ ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇంకా అడ్మిషన్లు తీసుకొని విద్యార్థులు ఏవరైనా ఉంటే వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లో మాత్రమే చేరాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను ఇంటర్ బోర్డు సైట్ లో ఉంచినట్లు తెలిపింది. వాటిని చెక్ చూసుకున్న తర్వాతే… అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది.

షెడ్యూల్ నిర్ణయించిన ప్రకారం… ఇంటర్ ఫస్టియర్ తరగతులు జూన్ 01 నుంచే ప్రారంభమయ్యాయి. పాఠశాల అధికారులు జారీ చేసిన పాస్ సర్టిఫికేట్, ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, తాత్కాలిక టెన్త్ మార్కుల మెమో ఆధారంగా ప్రిన్సిపాల్స్ ఇంటర్ ప్రవేశాలను పొందవచ్చు. ఒరిజినల్ ఎస్ఎస్సీ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత అడ్మిషన్ ను నిర్థారిస్తారు.

మరోవైపు ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నవంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరగనున్నాయి. సంక్రాంతి సెలవులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 16 వరకు ప్రకటించారు. సంక్రాంతి అనంతరం జనవరి 17, 2025న ఇంటర్ కాలేజీలు రీఓపెన్ చేస్తారు. 2025 జనవరి 20 నుంచి 25 వరకు ఇంటర్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో జరుగుతాయి.

తదుపరి వ్యాసం