Bajaj Avenger street 220 : బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220.. తిరిగొస్తోంది!
12 May 2023, 8:12 IST
- Bajaj Avenger street 220 : బజాజా అవెంజర్ స్ట్రీట్ 220 తిరిగొస్తోంది! ఈ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సంస్థ ప్లాన్ చేస్తోంది.
బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220.. తిరిగొస్తోంది!
Bajaj Avenger street 220 : పాత మోటార్‌సైకిల్స్‌ను మళ్లీ మార్కెట్లోకి రీ-లాంచ్ చేసే పనిలో పడింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో! ఈ క్రమంలోనే.. అవెంజర్ స్ట్రీట్ 220ని తీసుకురానుంది. ఈ మేరకు డీలర్షిప్ షోరూమ్‌ల నుంచి హెచ్‌టీ ఆటో బృందానికి సమాచారం అందింది. అవెంజర్ క్రూజ్ 220, అవెంజర్ స్ట్రీట్ 160 సరసన ఈ అవెంజర్ స్ట్రీట్ 220 చేరనుంది.
తిరిగొస్తున్న స్ట్రీట్ 220..
ఈ బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 స్టైలింగ్.. అవెంజర్ స్ట్రీట్ 160ని పోలి ఉంటుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్, బ్లాక్డ్ ఔట్ ఇంజిన్, ఫోర్క్ గైటెర్స్, బ్లాక్ అలాయ్ వీల్స్, స్మాలర్ పిలియన్ బ్యాక్‌రెస్ట్ వంటివి ఉంటాయి. ఇందులో చిన్నపాటి ఫ్లైస్క్రీన్, ఫ్లాట్ హ్యాండిల్బార్లు వస్తాయి. క్రూజ్ 220లో మాత్రం పెద్ద విండ్‌స్క్రీన్, రైజెడ్ హ్యాండిల్బార్లు ఉంటాయి.
Bajaj Avenger street 220 relaunch : రీ- లాంచ్ అవుతున్న అవెంజర్ స్ట్రీట్ 220లో 200 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. బజాజ్ పల్సర్ 220ఎఫ్లోనూ ఇదే ఇంజిన్ కనిపిస్తుంది. ఈ ఇంజిన్ 18.7 బీహెచ్పీ పవర్‌ను, 17.5 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. బీఎస్6 ఫేజ్ 2 ఎమిషన్ నార్మ్స్కు ఈ మోడల్ అప్డేట్ అయ్యింది.
ఇదీ చూడండి:- Bajaj Avenger 220 bobber : బాబర్‌గా మారిన బజాజ్ అవెంజర్ 220.. బైక్ అదిరింది!
ఇక సస్పెషన్స్ కోసం బైక్ ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో ట్విన్ షాక్ అబ్సార్బర్స్ వంటివి వస్తున్నాయి. ఫ్రెంట్, రేర్‌లో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. సింగిల్ ఛానెల్ ఏబీఎస్ కూడా లభిస్తుంది.
స్ట్రీట్ 220 ధర ఇదే..!
Bajaj Avenger street 220 price : స్టైలింగ్‌లో మార్పులను మినహాయిస్తే.. అవెంజర్ స్ట్రీట్ 220, క్రూజ్ 220 బైక్స్ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే.. క్రూజ్ 220 కన్నా స్ట్రీట్ 220 ధర తక్కువగా ఉంటుంది. ఇక రీ లాంచ్‌కు సిద్ధమవుతున్న బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.40లక్షలుగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ బైక్ రీ-లాంచ్ డేట్, ఇతర ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వంటి వివరాలు తెలియాల్సి ఉంది. లాంచ్ టైమ్ సమీపిస్తున్న కొద్ది.. వివరాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.