Top automatic cars under 10 lakh : రూ. 10లక్షల బడ్జెట్లోపు.. టాప్ ఆటోమెటిక్ కార్లు ఇవే!
02 February 2024, 10:39 IST
- Best automatic cars in India under ₹10 Lakh : ట్రాఫిక్ని చూసి విసిగెత్తిపోయారా? రోడ్ల మీద ఇక మేన్యువల్ కారు నడపలేనని భావిస్తున్నారా? అయితే.. ఇండియాలో.. రూ. 10లక్షల బడ్జెట్లోపు అందుబాటులో ఉన్న టాప్ ఆటోమెటిక్ కార్స్ లిస్ట్ మీకోమే..
రూ. 10లక్షల బడ్జెట్లో టాప్ ఆటోమెటిక్ కార్లు ఇవే!
Best automatic cars in India : దేశంలో.. ఇటీవలి కాలంలో ఆటోమెటిక్ వెహికిల్స్‌కి మంచి డిమాండ్ కనిపిస్తోంది. నగరాల్లో ట్రాఫిక్ కష్టాలను భరించలేక.. చాలా మంది ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్వైపు అడుగులు వేస్తున్నారు. మరి.. మీరు కూడా ఒక ఆటోమెటిక్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! దేశంలో.. రూ. 10లక్షల బడ్జెట్లోపు అందుబాటులో ఉన్న ది బెస్ట్ ఆటోమెటిక్ వెహికిల్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రూ. 10లక్షల బడ్జెట్- టాప్ ఆటోమెటిక్ కార్స్..
మారుతీ సుజుకీ ఇగ్నిస్:- క్రాసోవర్- హ్యాచ్‌బ్యాక్‌కి మిక్స్‌గా ఉంటుంది ఈ ఇగ్నిస్ డిజైన్. ఎస్యూవీ కాకపోయినా.. డిజైన్ని చూస్తే మాత్రం.. ఇదొక మైక్రో ఎస్యూవీ అనిపిస్తుంది. ప్రీమియం నెక్సా షోరూమ్స్‌లో వీటిని విక్రయిస్తోంది మారుతీ సుజుకీ. ఇందులో 1.2 లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 88 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ దీని సొంతం. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 6.93లక్షలు- రూ. 8.16లక్షల మధ్యలో ఉంటుంది.
Tata Punch on road price Hyderabad : టాటా పంచ్:- ఇండియాలో.. బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఈ టాటా పంచ్ ఒకటి. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఏఎంటీ వర్షెన్‌లో 12 ట్రిమ్స్ ఉండటం విశేషం. వీటిల్లోని 11 ఆప్షన్స్ ధర రూ. 10లక్షల (ఎక్స్‌షోరూం ప్రైజ్) కన్నా తక్కువగా ఉన్నాయి. టాప్ ఎండ్ మోడల్ని పక్కన పెడితే.. ఈ టాటా పంచ్ ఏఎంటీ ఎస్యూవీ ఎక్స్‌షోరూం ధర రూ. 7.50లక్షలు- రూ. 9.35లక్షల మధ్యలో ఉంటుంది. ఇందులోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కి 5 స్పీడ్ ఏఎంటీ కనెక్ట్ చేసి ఉంటుంది. ఇది.. 87 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్:- హ్యుందాయ్ నుంచి కొత్తగా వచ్చిన ఎక్స్టర్ ఎస్‌యూవీకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఏఎంటీ వర్షెన్‌లో ఆరు వేరువేరు ట్రిమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్.. 82 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఆరు వేరువేరు ట్రిమ్స్లని ఐదంటి ఎక్స్‌షోరూం ధర రూ. 10లక్షలలోపే ఉంటాయి.
Maruti Suzuki Fronx AMT on road price : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్:- 2023లో లాంచ్ అయిన మారుతీ సుజుకీ ఫ్రాంక్స్.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బలెనోకి క్రాసోవర్లా కనిపిస్తుంది. ఇందులో 1.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌కి ఏఎంటీ కనెక్ట్ చేసి ఉంటుంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఆటోమెటిక్ ఎక్స్‌షోరూం ధర రూ. 8.88లక్షలు- రూ. 9.28లక్షల మధ్యలో ఉంటుంది.
రెనాల్ట్ ఖైగర్:- ఇండియాలో రెనాల్ట్‌కి ఉన్న ఏకైక ఎస్యూవీ.. ఈ ఖైగర్. ఏఎంటీ వర్షెన్‌లో ఆరు ట్రిమ్స్ ఉన్నాయి. వీటి ఎక్స్షోరూ ధరలు రూ. 7.10లక్షలు- రూ. 9.53లక్షల మధ్యలో ఉంటుంది.