తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Ev9 India Launch : ఇండియాలో కియా ఈవీ9 టెస్ట్​ డ్రైవ్​.. లాంచ్​ త్వరలోనే!

Kia EV9 India Launch : ఇండియాలో కియా ఈవీ9 టెస్ట్​ డ్రైవ్​.. లాంచ్​ త్వరలోనే!

Sharath Chitturi HT Telugu

03 February 2024, 7:20 IST

google News
    • Kia EV9 electric SUV : ఇండియాలో కియా ఈవీ9 టెస్ట్​ డ్రైవ్​ జరిగింది. అంటే.. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ, ఇండియాలో లాంచ్​కు సిద్ధమవుతున్నట్టు!
ఇండియాలో కియా ఈవీ9 టెస్ట్​ డ్రైవ్​..
ఇండియాలో కియా ఈవీ9 టెస్ట్​ డ్రైవ్​..

ఇండియాలో కియా ఈవీ9 టెస్ట్​ డ్రైవ్​..

Kia EV9 price in India : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​పై కియా మోటార్స్​ ఫోకస్​ చేసింది. తమ ప్లాన్స్​లో భాగంగా.. అంతర్జాతీయంగా బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్న కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని.. 2024లో ఇండియాలో లాంచ్​ చేస్తామని గతేడాది చెప్పింది ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇక ఇప్పుడు.. ఈ కియా ఈవీ9కి సంబంధించిన కీలక అప్డేట్​ బయటకి వచ్చింది. ఇండియా రోడ్లపై టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ కనిపించింది ఈ 3 రో ఈవీ. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కియా ఈవీ9 ఫీచర్స్​..

కియా ఈవీ9 అనేది ఒక ప్రీమియం కారు. ఇందులో బ్లాంక్​డ్​ ఆఫ్​ గ్రిల్​, వర్టికల్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, ఇంటిగ్రేటెడ్​ ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ లైట్స్​, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​, ఫ్లష్​ ఫిట్టెడ్​ డోర్​ హ్యాండిల్స్​ వంటివి వస్తున్నాయి. ఇందులో 21 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ వీల్స్​ ఉంటాయి.

ఇక ఈ 3 రో ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఇంటీరియర్​ చాలా స్పేషియస్​గా ఉంటుంది. డిజైన్​ మినిమలిస్ట్​గా ఉంటుంది. 4 స్పోక్​ స్టీరింగ్​ వీల్​, పానారోమిక్​ సన్​రూఫ్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​- ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ కోసం భారీ స్క్రీన్​ వంటివి వస్తున్నాయి.

ఈ-జీఎంపీ (ఎలక్ట్రిక్​ గ్లోబల్​ మాడ్యులర్​ ప్లాట్​ఫామ్​)పై ఈ కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని రూపొందించింది కియా మోటార్స్​. దీని పొడవు 5,000ఎంఎం. వీల్​బేస్​ 3,1000ఎంఎం. సైజు పరంగా చూసుకుంటే.. ఈ వెహికిల్​ చాలా పెద్దదే!

అంతర్జాతీయంగా ఉన్న కియా ఈవీ9లో రెండు బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉన్నాయి. అవి.. 76.1 కేడబ్లూహెచ్​, 99.8 కేడబ్ల్యూహెచ్​. ఈ ఈవీ రేంజ్​ 540కి.మీలు. 800వోల్ట్​ అల్ట్రా ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ ఈ కియా ఎలక్ట్రిక్​ వెహికిల్​కి లభిస్తోంది. మరి ఇండియాలో.. ఏ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది? అనేది వేచి చూడాలి.

కియా ఈవీ9 ధర ఎంత ఉండొచ్చు..?

కియా ఈవీ9 ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ ఇదొక ప్రీమియం కారు కాబట్టి.. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 40లక్షల కన్నా ఎక్కువగానే ఉంటుంది మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కియా ఈవీ9 ఇతర ఫీచర్స్​, లాంచ్​ డేట్​పైనా క్లారిటీ లేదు. త్వరలోనే ఈ మోడల్​పై సంస్థ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఈ కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని.. 2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించింది సంస్థ​. అప్పటి నుంచి ఈ మోడల్​పై మంచి బజ్​ నెలకొంది. వాస్తవానికి.. 2025లో ఈ మోడల్​ని లాంచ్​ చేస్తామని, ఆ సమయంలో చెప్పింది కియా మోటార్స్​. కానీ ఇప్పుడు.. ఆ టైమ్​ని 2024లోకి తీసుకొచ్చింది. టాటా మోటార్స్​ ఆధిపత్యం అధికంగా ఉన్న ఇండియా ఈవీ సెగ్మెంట్​లో 15శాతం మార్కెట్​ వాటాను సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తోంది కియా మోటార్స్​. టార్గెట్​లో భాగంగా.. ఇండియాలో వరుసగా ఈవీలను లాంచ్​ చేయాలని సంస్థ చూస్తోంది. మొదట వచ్చేదే ఈ కియా ఈవీ9!

తదుపరి వ్యాసం