2024 Kia Sonet : కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ధర ఎంతంటే!
12 January 2024, 11:55 IST
- 2024 Kia Sonet facelift price : కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని తాజాగా ఇండియాలో లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీలోని వేరియంట్లు, వాటి ధరలను ఇక్కడ తెలుసుకుందాము..
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ధర ఎంతంటే!
2024 Kia Sonet facelift price : మచ్ అవైటెడ్ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని శుక్రవారం లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటర్స్. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఇంట్రొడక్టరీ ఎక్స్‌షోరూం ధర రూ. 8లక్షలుగా ఉంది. మొత్తం మూడు ట్రిమ్స్‌లో అనేక వేరియంట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో 2024 కియా సోనెట్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్..
2020లో తొలిసారి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది కియా సోనెట్. అప్పటి నుంచి సంస్థకు ఉన్న బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటిగా నిలిచింది. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో.. ఇండియాలో ఉన్న బీభత్సమైన పోటీని తట్టుకుని మరి, సేల్స్‌లో దూసుకెళుతోంది కియా సోనెట్. ఇందుకు.. సోనెట్‌లో ఉన్న ట్రిమ్స్, వేరియంట్స్, ఇంజిన్ ఆప్షన్స్, ఫీచర్స్ ముఖ్య కారణం. ఇక 2024 కియా సోనెట్ లాంచ్‌తో.. సేల్స్ మరింత పెరుగుతాయని కంపెనీ ఆశిస్తోంది.
2024 Kia Sonet facelift : కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో మూడు ట్రిమ్స్ ఉంటాయి. అవి.. టెక్ లైన్, జీటీ లైన్, ఎక్స్ లైన్. ఇక వీటన్నింటిని కలుపుకుంటే.. సోనెట్‌లో 19 వేరియంట్లు ఉంటాయి!
2024 కియా సోనెట్ ఎస్‌యూవీలో 3 ఇంజిన్ ఆప్షన్స్ ఉంటయి. మొదటిది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది.. 81 బీహెచ్పీ పవర్‌ని, 115 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. దీనికి 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇక రెండోది.. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 118 హెచ్‌పీ పవర్‌ని, 170 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. దీనికి.. ఐఎంటీ (సెమీ-ఆటోమెటిక్) లేదా డీటీసీ గేర్‌బాక్స్‌లు కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇక మూడోది.. 1.5 లీటర్ సీఆర్డీఐ డీజిల్ యూనిట్. ఇది 114 హెచ్‌పీ పవర్‌ని, 250 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ ఐఎంటీ, 6 స్పీడ్ ఏటీ గేర్‌బాక్స ఆప్షన్స్ ఉంటాయి.
2024 కియా సోనెట్ వేరియంట్లు- వాటి ధరల వివరాలు..
2024 Kia Sonet specs : 25,000. ఆ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్ లేదా డీలర్షిప్ షోరూమ్స్‌లో రూ. 25వేల టోకెన్ అమౌంట్‌తో ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.