Bajaj Auto CNG bikes : 'ఇక రోడ్డు మీదకి సీఎన్జీ బైక్స్’- బజాజ్ ఆటో
02 February 2024, 6:38 IST
- Bajaj Auto bikes latest news : ఇప్పటివరకు సీఎన్జీ ఆటోలు, సీఎన్జీ కార్లను చూసి ఉంటారు. ఇక ఇప్పుడు.. ఇండియాలో సీఎన్జీ బైక్స్‌ని కూడా చూడబోతున్నారు! బజాజ్ ఆటో సంస్థ నుంచి పలు సీఎన్జీ బైక్స్.. లాంచ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా వెల్లడించింది. ఆ వివరాలు..
'ఇక రోడ్డు మీదకి సీఎన్జీ బైక్స్’- బజాజ్ ఆటో
Bajaj Auto CNG bikes launch : దేశంలో అతిపెద్ద బైక్స్ తయారీ సంస్థగా బజాజ్ ఆటో.. సీఎన్జీ మోటార్‌సైకిల్స్‌ని లాంచ్ చేసేందుకు ఏర్పాటు చేసుకుంటోంది. ఇవి.. 2025 ఆర్థిక ఏడాదిలోనే మార్కెట్లోకి అడుగుపెడతాయని సమాచారం. ఈ బైక్స్.. అటు పెట్రోల్‌తో పాటు ఇటు సీఎన్జీపైనా నడుస్తాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ బజాజ్ ఆటో సీఎన్జీ బైక్స్‌పై ప్రస్తుతం ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
బజాజ్ ఆటో సీఎన్జీ బైక్స్..
3 వీలర్ సీఎన్జీ వెహికల్స్‌లో గ్రాండ్‌గా సక్సెస్ అయిన సంస్థ బజాజ్ ఆటో. ఇక ఇప్పుడు.. 2 వీలర్ సీఎన్జీ బైక్స్‌పై ఫోకస్ చేసింది. ఇందుకోసం పక్కా ప్రణాళికలే రచించినట్టు కనిపిస్తోంది. ఈ సరికొత్త సీఎన్జీ బైక్స్ కోసం ప్రత్యేకంగా ఓ బ్రాండ్‌ని సృష్టిస్తున్నట్టు.. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు.
అయితే.. పెట్రోల్ ఆధారిత బైక్స్‌తో పోల్చుకుంటే.. ఈ సీఎన్జీ 2 వీలర్ వెహికల్స్ ధర కాస్త ఎక్కువే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మేన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉండటం ఇందుకు ఓ కారణం. సీఎన్జీ బైక్స్ కోసం ఫ్యూయెల్ ట్యాంక్స్‌ని ప్రత్యేకంగా రూపొందించాలి. ఈ ఫ్యూయెల్ ట్యాంక్‌లో పెట్రోల్, సీఎన్జీ.. రెండు ఆప్షన్స్ ఉండాలి. ఈ టెక్నాలజీకి సంబంధించిన ఎలాంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.
Bajaj Auto CNG bikes launch date : మరి.. ఈ సీఎన్జీ బైక్స్ పూర్తిగా కొత్తగా ఉంటాయా? లేక ఇప్పుడున్న బైక్ మోడల్స్‌కి సీఎన్జీ టచ్ ఇస్తుందా? అన్న క్లారిటీ ప్రస్తుతం లేదు. ప్రస్తుతం మార్కెట్లో అనేక సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దాదాపు అన్ని.. ఐసీఈ ఇంజిన్ మోడల్స్‌కి సీఎన్జీ టచ్ ఇచ్చినవే!
అయితే.. ఒక్క బైక్ లాంచ్ చేసి, దానికి ఎంతటి ఆదరణ లభిస్తోంది? అని చూసి, మరో బైక్‌ని రూపొందించడం కాకుండా.. వరుసగా సీఎన్జీ బైక్స్‌ని తయారు చేసి, వాటిని మార్కెట్లో విడుదల చేయాలన్న స్ట్రాటజీతో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యూయెల్ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించే కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని.. ఈ సీఎన్జీ బైక్స్‌ని రూపొందిస్తున్నట్టు శర్మ తెలిపారు.
Bajaj Auto latest bikes launch : "ఒక్క బైక్‌ని మాత్రమే లాంచ్ చేయడం లేదు. ఈ సెగ్మెంట్లో వివిధ బైక్స్‌ని లాంచ్ చేస్తున్నాము. సీఎన్జీ మోటార్‌సైకిల్స్ కోసం ప్రత్యేకంగా ఓ పోర్ట్‌ఫోలియో ఉండాలన్నది మా ఆలోచన," అని శర్మ వివరించారు.
ఈ బజాజ్ ఆటో సీఎన్జీ బైక్స్ ఎలా ఉంటాయి? అన్న విషయంపై.. బైక్ లవర్స్‌లో ఆసక్తి నెలకొంది. టెక్నాలజీ, డిజైన్, ఫీచర్స్, ధర వంటి వివరాలు ఎప్పుడు రివీల్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. వీటిపై అప్డేట్స్ రాగానే.. మేము మీకు చెబుతాము. స్టే ట్యూన్డ్ టూ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.