తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Audi Q3 Sportback Launch : ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​.. ఇండియా లాంచ్​ రేపే!

Audi Q3 Sportback launch : ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​.. ఇండియా లాంచ్​ రేపే!

Sharath Chitturi HT Telugu

12 February 2023, 13:44 IST

google News
    • Audi Q3 Sportback facelift launch in India : ఇండియాలో ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ సోమవారం లాంచ్​ కానుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ లాంచ్​ రేపే!
ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ లాంచ్​ రేపే!

ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ లాంచ్​ రేపే!

Audi Q3 Sportback launch in India : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​పై మరింత పట్టు సాధించేందుకు కృషిచేస్తోంది ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ ఆడీ. ఈ నేపథ్యంలోనే వరుస లాంచ్​లతో బిజీబిజీగా ఉంటోంది. ఇక ఇప్పుడు.. బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్న క్యూ3 మోడల్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను ఇండియాలోకి తీసుకురానుంది. ఫిబ్రవరి 13.. అంటే సోమవారమే ఈ ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ లాంచ్​ కానుంది!

మరింత స్టైలిష్​గా.. లగ్జరీగా..

Audi Q3 Sportback 2023 : సరికొత్త ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​లో కూప్​ రూఫ్​లైన్​ వస్తోంది. ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​కు సంబంధించిన బుకింగ్స్​ను ఇప్పటికే మొదలుపెట్టింది ఆడీ. సంస్థ అధికారిక వెబ్​సైట్​ లేదా డీలర్​షిప్​ షోరూమ్​లో దీనిని బుక్​ చేసుకోవచ్చు. ఇందుకోసం రూ. 2లక్షల టోకెన్​ అమౌంట్​ చెల్లించాల్సి ఉంటుంది.

ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ ఎస్​యూవీ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​కి.. మామూలు వర్షెన్​కి పెద్దగా తేడా కనిపించడం లేదు. క్యూ3 స్పోర్ట్​బ్యాక్​లో స్లోపింగ్​ రూఫ్​లైన్​, హనీకోంబ్​-మెష్​ గ్రిల్​, బ్లాక్​డ్​ ఔట్​ క్రోమ్​ అసెంట్స్​, ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, స్పోర్టీ అలాయ్​ వీల్స్​ వస్తాయి.

Audi Q3 Sportback price in India : ఇక ఈ ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ ఫేస్​లిఫ్ట్​ మోడల్​ క్యాబిన్​లో 8.9 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ విత్​ ఆడీ ఇంటర్​ఫేస్​ వస్తుంది. యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో కనెక్టివిటీ, ఎంఎంఐ నేవిగేషన్​, ఐడీ స్మార్ట్​ఫోన్​ ఇంటర్​ఫస్​, ఆడీ వర్చ్యువల్​ కాక్​పిట్​, వయర్​లెస్​ ఛార్జింగ్​, యాంబియెంట్​ లైటింగ్​, ఎలక్ట్రికల్లీ అడ్జస్టెబుల్​ సీట్స్​, 10- స్పీకర్​ ఆడీ సిస్టెమ్​ వంటి ఫీచర్స్​ వస్తున్నాయి.

ఫీచర్స్​ ఇవే..

ఇక ఈ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​లో 2.0 లీటర్​ 4 సిలిండర్​ టర్బోఛార్జ్​డ్​ టీఎఫ్​ఎస్​ఐ మోటార్​ ఉంటుంది. క్యూ3లోనూ ఇదే ఉంటుంది. ఇది 188 బీహెచ్​పీ పవర్​ను, 320 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 7- స్పీడ్​ డీఎస్​జీ ట్రాన్స్​మిషన్​ ఉంది. అయితే.. 45 టీఎఫ్​ఎస్​ఐ ఇంజిన్​ వేరియంట్​ను కూడా ఆడీ ఇండియా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది 241 బీహెచ్​పీ పవర్​ను, 370 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

Audi Q3 Sportback launch : ఇక లాంచ్​ అయిన తర్వాత.. ఈ ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​.. మెర్సిడెస్​ జీఎల్​ఏ, బీఎండబ్ల్యూ ఎక్స1 వంటి లగ్జరీ వాహనాలకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

ఆడీ క్యూ3.. గతేడాది ఇండియాలో లాంచ్​ అయ్యింది. దీని ప్రారంభం ఎక్స్​షోరూం ధర రూ. 44.89లక్షలుగా ఉంది. ఇక ఆడీ క్యూ3 స్పోర్ట్​బ్యాక్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రూ. 50లక్షల ప్రైజ్​ పాయింట్​తో మొదలవుతుందని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం