Audi future plans : మూడేళ్లు.. 20కిపైగా లాంచ్‌లు- ఆడీ క్రేజీ 'ప్లాన్'!
30 January 2023, 11:32 IST
- Audi future product plan : మూడేళ్లల్లో 20కిపైగా వాహనాలను లాంచ్ చేయనున్నట్టు ఆడీ ప్రకటించింది. సంస్థ చరిత్రలోనే ఈ లైనప్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినట్టు వివరించింది.
మూడేళ్లు.. 20కిపైగా కార్ లాంచ్‌లు- ఆడీ క్రేజీ ప్లాన్
Audi cars lineup : ఆడీ వాహనాల ప్రియులకు క్రేజీ న్యూస్! కొత్త కొత్త కార్లను లాంచ్ చేసేందుకు ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ ఆడీ.. క్రేజీ ప్లాన్‌ను రచించింది. రానున్న 2-3ఏళ్లల్లో 20కిపైగా కొత్త వాహనాలను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది.
మూడేళ్లు.. 20కిపైగా లాంచ్‌లు..
ఆడీ చీఫ్ డిజైన్ మార్క్ లిచ్టే.. ఇటీవలే యూకే ఆటో ఎక్స్‌ప్రెస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆడీ భవిష్యత్తు కార్యచరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండు- మూడేళ్లను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నట్టు, అందుకే భారీ సంఖ్యలో లాంచ్‌లకు ప్రణాళికలు రచిస్తున్నట్టు వివరించారు. ఓవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు లభిస్తున్న డిమాండ్‌ను అందిపుచ్చుకుంటూనే.. మరోవైపు ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) మోడల్స్‌కు అప్డేటెడ్, కొత్త వర్షెన్లను తీసుకురావాలని సంస్థ యోచిస్తున్నట్టు స్పష్టం చేశారు.
2023లో లాంచ్‌కానున్న లగ్జరీ వాహనాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
Audi future product plan : "ఈవీలు, ఐసీఈ మోడల్స్‌కు సక్సెసర్లను తీసుకొచ్చేందుకు మేము ప్లాన్ చేస్తున్నాము. ఆడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా.. మా ప్రాడక్ట్ లైనప్ ఉండుంది. రానున్న రెండు-మూడేళ్లలలో 20కిపైగా కార్లను లాంచ్ చేస్తాము. యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్‌తో కూడిన మోడల్స్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము," అని మార్క్ తెలిపారు. ఏ6 ఈ-ట్రాన్ వంటి న్యూ-జెనరేష్ ఎలక్ట్రిక్ కార్ల ప్రాధాన్యత, వాటికి లభిస్తున్న డిమాండ్ గురించి మార్క్ వివరించారు.
భారీ ప్రణాళికలే..
Audi new cars launch : 2026 నుంచి ఈవీలను మాత్రమే లాంచ్ చేస్తామని లగ్జరీ వాహనాల తయారీ సంస్థ ఆడీ ఇప్పటికే ప్రకటించింది. 2033 నాటికి ఐసీఈ వాహనాలను ఫేజౌట్ చేస్తామని తెలిపింది. 2029 నాటికి జీరో ఎమిషన్ వెహికిల్స్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొంది. ఈవీ ప్రాడక్టుల ఉత్పత్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు 500 యూరోలు ఖర్చు చేసి ట్రైనింగ్ ఇస్తామని వివరించింది.