ఇండియాలో నెం.1 ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర పెరుగుతోంది- ముందే కొంటే డబ్బులు ఆదా!
20 December 2024, 6:40 IST
- Ather Rizta : ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఇండియాలో అడుగుపెట్టిన ఏథర్ రిజ్టా ధరలు తొలిసారి పెరగనున్నాయి. ప్రైజ్ హైక్ సహా ఫీచర్స్, రేంజ్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఏథర్ రిజ్టా ధరలు పెంపు!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కొనసాగుతోంది ఏథర్ రిజ్టా. 2024 తొలినాళ్లల్లో లాంచ్ అయిన ఈ ఈ-స్కూటర్ ధరలను తొలిసారి పెంచుతోంది సంస్థ. జనవరి 1, 2025 నుంచి కొత్త రిజ్టా ధర పెరుగుతుందని డీలర్లు హెచ్‌టీ ఆటోకు స్పష్టం చేశారు. ప్రస్తుత ధరల కంటే రూ.5,000 నుంచి 6,000 వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ రూ .1.10 లక్షలు- రూ .1.46 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. ధరల పెంపునకు ముందే కొనుగోలు చేస్తే డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వెహికిల్ ఫీచర్స్, రేంజ్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఏథర్ రిజ్టా బ్యాటరీ- రేంజ్..
ఏథర్ రిజ్టా మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి.. ఎస్, జెడ్ (2.9 కిలోవాట్), జెడ్ (3.7 కిలోవాట్). రిజ్టా ఎస్, జెడ్ వేరియంట్లలోని 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 123 కిలోమీటర్లు (ఐడీసీ) రేంజ్‌ని ఇస్తాయి. టాప్-స్పెక్ రిజ్టా జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 159 కిలోమీటర్ల (ఐడీసీ) రేంజ్‌తో 3.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. 5.7 బీహెచ్పీ పవర్‌ని, 22 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేయగలిగే 4.3 కిలోవాట్ల మోటర్ ఇందులో ఉంటుంది.
ఇక ఈ ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ 0-40 కిలోమీటర్ల వేగాన్ని 4.7 సెకన్లలో అందుకుంటుంది. అన్ని వేరియంట్లలో టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు.
ఏథర్ రిజ్టా ఫీచర్స్..
కుటుంబ సభ్యులందరి అవసరాలకు అనుగుణంగా ఏథర్ రిజ్టాను రూపొందించడం జరిగింది. సెగ్మెంట్లోనే పొడవైన సీటుతో విశాలమైన స్కూటర్‌గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఇది పెద్ద 34 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్‌ని కూడా పొందుతుంది. అయితే యాక్సెసరీ స్టోరేజ్ సామర్థ్యం 22 లీటర్లుగా ఉంది. ఈ-స్కూటర్ రెండు వైపులా 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ని పొందింది.
ఎస్ ట్రిమ్‌లో 7 ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హై జెడ్ వేరియంట్లలో 7 ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లే అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటికీ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ లభిస్తాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ వాట్సాప్ నోటిఫికేషన్లు, అలెక్సా వాయిస్ అసిస్టెన్స్‌తో పాటు మరెన్నో కీలక ఫీచర్స్ ఉన్నాయి.
రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్లోని ఇతర ఫీచర్లలో స్కిడ్ కంట్రోల్ ఉంది. ఇది అవసరమైన ట్రాక్షన్ కంట్రోల్, టాప్ వేరియంట్లో మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్ మరింత నియంత్రిత రీజనరేటివ్ బ్రేకింగ్‌ని తీసుకువస్తుంది. ప్రీమియం ఫీచర్లు రూ.13,000 నుంచి రూ.20,000 వరకు ఉన్న ప్రో ప్యాక్ ద్వారా లభిస్తాయి.
టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్ 1 ప్రో, బజాజ్ చేతక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి ఈ ఏథర్ రిజ్టా గట్టి పోటీనిస్తోంది. వీటన్నింటికీ, రాబోయే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి తీవ్ర పోటీ తప్పదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరీ ఈ సమయంలో ఏథర్ సంస్థ రిజ్టా ధరలను పెంచడం గమనార్హం.