తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Android 15 Release : పిక్సెల్​ 9 కాదు.. ఆండ్రాయిడ్​ 15 ఓఎస్​ అప్డేట్​ అందుకున్న తొలి స్మార్ట్​ఫోన్​ ఇదే!

Android 15 release : పిక్సెల్​ 9 కాదు.. ఆండ్రాయిడ్​ 15 ఓఎస్​ అప్డేట్​ అందుకున్న తొలి స్మార్ట్​ఫోన్​ ఇదే!

Sharath Chitturi HT Telugu

30 September 2024, 13:40 IST

google News
  • Android 15 release date in India : గూగుల్ పిక్సెల్ స్మార్ట్​ఫోన్స్​ కంటే వివో ఎక్స్ ఫోల్డ్ 3ప్రో ముందు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్​టచ్ ఓఎస్ 15 అప్డేట్​ని అందుకున్నాయి! ఇదొక ఆసాధారణమైన విషయం!

వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రోలో ఆండ్రాయిడ్​ 15
వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రోలో ఆండ్రాయిడ్​ 15 (Vivo)

వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రోలో ఆండ్రాయిడ్​ 15

ఆండ్రాయిడ్​ 15 ఓఎస్​ అప్డేట్​ కోసం ఎదురుచూస్తున్న గూగుల్​ పిక్సెల్​ 9 యూజర్స్​కి షాక్​! కొత్త ఓఎస్​ తొలుత ఈ గ్యాడ్జెట్​కి వస్తుందని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా.. ఆండ్రాయిడ్​ 15 ఓఎస్​ పొందిన తొలి స్మార్ట్​ఫోన్​గా వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రో నిలిచింది. ఆండ్రాయిడ్​ 15 ఆధారిత ఫన్​టచ్​ ఓఎస్​ 15ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వివో ప్రకటించింది.

ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఓఎస్ అప్డేట్..

ఈ సంవత్సరం గూగుల్ ఆండ్రాయిడ్ 14 తో పిక్సెల్ 9 సిరీస్​ను విడుదల చేసింది. ఇది వినియోగదారులను నిరాశపరిచింది. ఇప్పుడు, ఆండ్రాయిడ్ 15 లాంచ్​ దగ్గరలో ఉంది. ఇది పిక్సెల్ వినియోగదారుల కోసం అక్టోబర్​లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అధికారిక విడుదలకు ముందు వివో తన ఫోల్డెబుల్ స్మార్ట్​ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో కోసం ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్​టచ్ ఓఎస్ 15ను భారతదేశం, ఇండోనేషియాలో విడుదల చేయడం ప్రారంభించింది!

ఇదీ చూడండి:- Vivo V40e vs Vivo V40 : ఈ రెండు వీ- సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ?

వివో ఫోల్డెబుల్ స్మార్ట్​ఫోన్​లో కొత్త ఫన్​టచ్ ఓఎస్ 15లో అనేక కొత్త కస్టమైజేషన్ ఆప్షన్లు, పవర్ యూసేజ్​ ఆప్టిమైజేషన్, సిస్టమ్ ఎఫెక్ట్స్, స్మూత్ ఎక్స్​పీరియన్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఫోల్డెబుల్ స్మార్ట్​ఫోన్​కి కవర్ డిస్ప్లే, మెయిన్ డిస్ప్లే కోసం అదనపు కస్టమైజేషన్లు అవసరం కాబట్టి ఈ రోల్-అవుట్ ఒక అసాధారణమైన విషయం అనే చెప్పుకోవాలి. మరోవైపు ఫోల్డెబుల్ సెటప్​లో యాప్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయో కూడా ఈ యాప్స్​కు బాగా ట్యూనింగ్ చేయాల్సి ఉంటుంది.

ఆక్సిజన్ ఓఎస్, ఫన్​టచ్ ఓఎస్, వన్ యూఐ వంటి కస్టమ్ ఆండ్రాయిడ్ స్కిన్స్ కోసం గూగుల్ ఇటీవల ఆండ్రాయిడ్ ఏఓఎస్​పీని విడుదల చేసింది. అయితే, వివో కొత్త ఓఎస్ స్కిన్​ని వేగంగా అభివృద్ధి చేసి, దాని టెస్టింగ్ నిర్వహించి, స్థిరమైన వెర్షన్​ని గూగుల్, శాంసంగ్ కంటే వెంటనే యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది!

ఇదీ చూడండి:- అమెజాన్​ సేల్​లో ఈ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్స్​.. తక్కువ ధరకే సూపర్​ ఫీచర్స్​!

మరేదైనా ఓఈఎం ముందస్తు విడుదలకు ప్లాన్ చేస్తోందా? లేదా? అనే ఇప్పుడు అసలైన ప్రశ్నగా మారింది. మరి రాబోయే వారంలో ఇతర సంస్థలు ఏం ప్లాన్ చేస్తారో చూడాలి.

శాంసంగ్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 ప్రస్తుతం ఆలస్యమైంది. ఫలితంగా ఇప్పుడు గూగుల్​ పిక్సెల్​ 9 మాత్రమే ఆండ్రాయిడ్​ 15 ఓఎస్​ పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతర సంస్థలు షాక్​ ఇస్తాయో లేదో చూడాలి.

మరి మీరు ఏ ఫోన్​ వాడుతున్నారు? ఆండ్రాయిడ్​ 15 లాంచ్​ కోసం మీరు ఎదురుచూస్తున్నారా?

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్స్​లో అందుబాటులో ఉంది. టెక్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి..

తదుపరి వ్యాసం