తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Android Users : ఆండ్రాయిడ్ యూజర్లకు భారత ప్రభుత్వం వార్నింగ్.. ప్రమాదంలో మీ సమాచారం

Android Users : ఆండ్రాయిడ్ యూజర్లకు భారత ప్రభుత్వం వార్నింగ్.. ప్రమాదంలో మీ సమాచారం

Anand Sai HT Telugu

12 September 2024, 11:30 IST

google News
  • Android Users In Risk : ఆండ్రాయిడ్ యూజర్లకు భారత ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. మీ డేటా ప్రమాదంలో ఉందని పేర్కొంది. సైబర్ నేరగాళ్లు దానిని పొందే అవకాశం ఉందని తెలిపింది. జాగ్రత్తగా ఉండాలి హెచ్చరించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. మిలియన్ల మంది వినియోగదారులు గూగుల్ యాజమాన్యంలోని ఓఎస్‌పై ఆధారపడతారు. శాంసంగ్ గెలాక్సీ, గూగుల్ పిక్సెల్, వన్ ప్లస్, వివో.. ఇలా ఇతర ప్రసిద్ధ స్మార్ట్ ఫోన్ సిరీస్‌లు ఆండ్రాయిడ్ ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తాయి. స్మార్ట్‌ఫోన్లపై ఆధారపడటం పెరగడంతో, లొకేషన్, బ్యాంకింగ్ వివరాలతోపాటుగా ఇతర విషయాలు స్మార్ట్‌ఫోన్లలో స్టోర్ అయి ఉంటాయి.

ఓఎస్ అప్డేట్

అందుకే యూజర్లను సురక్షితంగా ఉంచేందుకు గూగుల్ ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ ఓఎస్‌కు అప్‌డేట్స్ ఇస్తుంది. అయితే డేటా లేకపోవడం, స్టోరేజ్ సమస్య, ఉపయోగిస్తున్నప్పుడు సమస్యలు లేకపోవడం కారణంగా చాలా మంది వినియోగదారులు ఓఎస్‌ను అప్డేట్ చేయరు. ఓఎస్ పాత వెర్షన్లు ఉన్న ఇటువంటి పరికరాలు సైబర్ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అత్యాధునిక భద్రతా ఫీచర్లతో ఫోన్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్లు 12, 12ఎల్, 13, 14 యూజర్లకు భారత ప్రభుత్వం ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్ టీ-ఇన్) ఆండ్రాయిడ్ ఓఎస్ లో అనేక లోపాలు నమోదయ్యాయని తెలిపింది. మోసగాళ్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి వీలు కల్పిస్తుందని హెచ్చరించింది.

ఆండ్రాయిడ్‌లో లోపాలు

ఆండ్రాయిడ్‌లో అనేక బలహీనతలు ఉన్నాయని చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు సున్నితమైన సమాచారాన్ని పొందడానికి, మీ ఫోన్ పని చేయకుండా చేసేందుకు వీలు కల్పిస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు ఫోన్‌ ఓఎస్‌ను అప్‌డేట్ చేయాలి. ఫ్రేమ్ వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్ డేట్స్ (రిమోట్ కీ ప్రొవిజనింగ్ సబ్ కాంపోనెంట్), కెర్నల్, ఆర్మ్ కాంపోనెంట్, ఇమాజినేషన్ టెక్నాలజీస్ కాంపోనెంట్స్, యూనిసో కాంపోనెంట్స్, క్వాల్ కామ్ కాంపోనెంట్స్, క్వాల్ కామ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్స్‌లో లోపాల కారణంగా ఆండ్రాయిడ్‌లో ఈ లోపాలు ఉన్నాయి. మోసాలను నివారించడానికి, వినియోగదారులు గూగుల్ పేర్కొన్న విధంగా తగిన అప్‌డేట్స్ చేసుకోవాలి.

మీ ఫోన్లకు చెవులు ఉంటాయ్

మరో విషయం ఏంటంటే మీ ఫోన్లకు కూడా చెవులు ఉంటాయ్. అవి మీరు మాట్లాడే మాటలను వింటుంటాయి. యాక్టివ్ లిజెనింగ్ టెక్నాలజీ ద్వారా స్మార్ట్‌పోన్స్‌లో ఉండే పరికరాలు సమాచారాన్ని సేకరిస్తాయి. మీరు మాట్లాడిన మాటలు ఏఐతో విశ్లేషిస్తాయి. అందుకే మీరు కొన్నిసార్లు ఏదైనా టాపిక్‌ మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ వస్తుంటాయి.

తదుపరి వ్యాసం