Jagitial Ganesh: జగిత్యాల జిల్లా గణేషులకు జియో ట్యాగింగ్ టెక్నాలజీ.. ఒక్క క్లిక్ చేస్తే చాలు!
Geotagging To Ganesh Mandapam In Jagitial District: జగిత్యాల జిల్లాలో ఏర్పాటైన 2791 గణేష్ విగ్రహ మండపాలకు జియో ట్యాగింగ్ వంటి నూతన సాంకేతికతను వాడుతున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఒక్క క్లిక్‌తో మండపాల సమచారం తెలుసుకుని అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
(1 / 8)
జగిత్యాల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో వినాయకుడి ఉత్సవాలు జరిగేలా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
(2 / 8)
గణేష్ మండపాల అనుమతులను ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే సూచించిన జిల్లా పోలీసులు అందుకు అనుగుణంగా ప్రతి మండపానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో తెలుసుకునేలా టెక్నాలజీ జియో ట్యాగింగ్‌ను వాడుతున్నారు.
(3 / 8)
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం సుమారు 2791 వరకు వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. వీటన్నింటికి ఇప్పటికే జియో ట్యాగింగ్ చేశారు. ఇలా జియో ట్యాగింగ్ చేసిన మండపాలను క్లిక్ చేస్తే మండపానికి సంబందించిన పూర్తి వివరాలు కనిపించేలా చర్యలు చేపట్టారు.
(4 / 8)
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.
(5 / 8)
మండపాల వద్దకు ఎలా వెళ్లాలి, ఏదైనా అనుచిత సంఘటనలు జరిగినప్పుడు త్వరగా చేరుకునే విధంగా గూగుల్ మ్యాప్‌తో యాప్‌ను అనుసంధానించారు. ఏ మండపం వద్దయినా ఘర్షణ జరిగినట్లుగా సమాచారం వస్తే ఆ మండపం అడ్రస్ వెతకాల్సిన అవసరం లేకుండా జియో ట్యాగింగ్ ద్వారా కేవలం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
(6 / 8)
జగిత్యాల జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్‌ల పెట్రోలింగ్, బ్లూ కోట్స్ వాహనాలతో రాత్రి, పగలు గణేష్ మండపాలతో పాటు అన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ వివరించారు.
(7 / 8)
జిల్లాలో నవరాత్రుల సందర్బంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రతి మండపం వద్ద విధిగా సీసీ కెమెరాలు అమర్చుకునే విధంగా మండపాల నిర్వాహకులలో అవగాహన కల్పించామని ఆయన అన్నారు.
ఇతర గ్యాలరీలు