(1 / 5)
వివో వి40ఇ ఇటీవల వి40 సిరీస్ కింద అరంగేట్రం చేసింది. ఇది వివో వి 40 సిరీస్ తరహా డిజైన్ నే కలిగి ఉంది. వివో వి40ఇ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, ఇది అంత ప్రీమియం లుక్ తో కనిపించదు. చేతిలో పట్టుకుంటే జారిపోయేలా ఉంటుంది. కలర్స్ లో చాలా వైబ్రంట్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి.
(Aishwarya Panda/ HT Tech)(2 / 5)
వివో వి 40 ఈ లో 6.77-అంగుళాల 3 డి కర్వ్డ్ డిస్ప్లే ఉంది, ఇందులో హెచ్డీ కంటెంట్ వీక్షించడం కొత్త అనుభవం. ఈ స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్మార్ట్ ఫోన్ పనితీరు సాఫీగా ఉంటుంది.
(Aishwarya Panda/ HT Tech)(3 / 5)
వివో వి 40ఇ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో పనిచేస్తుంది, ఇది రోజువారీ పనులను సులభతరం చేస్తుంది. ఉపయోగించే సమయంలో ఎటువంటి ల్యాగ్స్ ఎదురుకాలేదు. సోషల్ మీడియా ద్వారా స్క్రోలింగ్ చేయడం, సందేశం పంపడం, వీడియో కంటెంట్ చూడటం వంటి రోజువారీ పనులను సులభంగా నిర్వహించవచ్చు.
(Aishwarya Panda/ HT Tech)(4 / 5)
వివో వి 40 ఇ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో సోనీ ఐఎంఎక్స్ 882 తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 ఎక్స్ పోర్ట్రెయిట్ మోడ్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. మంచి లైటింగ్ పరిస్థితులలో ప్రధాన కెమెరాతో మంచి క్వాలిటీ చిత్రాలను తీయవచ్చు.
(Aishwarya Panda/ HT Tech)ఇతర గ్యాలరీలు