తెలుగు న్యూస్  /  బిజినెస్  /  యూట్యూబర్స్ బ్రాండ్ ప్రమోషన్ గురించి ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మెుదటికే మోసం!

యూట్యూబర్స్ బ్రాండ్ ప్రమోషన్ గురించి ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మెుదటికే మోసం!

Anand Sai HT Telugu

19 December 2024, 8:14 IST

google News
    • YouTube Content Creators : ఇటీవలి కాలంలో యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్ విపరీతంగా పెరిగారు. చిన్న చిన్న బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు. ఇలాంటివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ డబ్బులను దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో చూస్తారు.
యూట్యూబ్‌
యూట్యూబ్‌ (REUTERS)

యూట్యూబ్‌

ఓ వైపు సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో వినియోగదారుల సంఖ్య కూడా పెరిగింది. కొందరు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి అప్లికేషన్‌లను ఉపయోగించి కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు. ఎక్కువగా యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తారు. దీనితో మండి డబ్బులు సంపాదిస్తారు. ఇదే సైబర్ నేరగాళ్లు మీ వైపు చూసేలా చేస్తుంది.

సైబర్ మోసగాళ్లు ఫిషింగ్ చేస్తూ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను మోసం చేస్తున్నారు. అధికారిక బ్రాండ్ డీలర్ల మాదిరిగానే నకిలీ వెబ్‌సైట్‌ లింక్ మిమ్మల్ని ముంచేస్తారు. ఇమెయిల్‌ల ద్వారా మీకు కాంటాక్ట్ అవుతారు. బ్రాండ్ ప్రమోషన్ అంటూ ఫేక్ లింక్‌ల ద్వారా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌ల సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. మాల్వేర్ లాగిన్‌లు, ఆర్థిక సమాచారం వంటి సున్నితమైన డేటాను తీసుకుంటున్నారు.

చాలామంది యూట్యూబ్‌లో వీడియోలను క్రియేట్ చేయడం ప్రొఫెషన్‌గా చేసుకున్నారు. దీంతో మాల్‌వేర్‌లను వ్యాప్తి చేయడానికి హ్యాకర్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌లను టార్గెట్ చేసుకుని ఫిషింగ్ ప్రచారాలను ఉపయోగిస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది. బ్రాండ్ ప్రమోషన్‌ల అవకాశాలతో ఎర వేస్తున్నారు.

హ్యాకర్లు ఫిషింగ్ ఇమెయిల్‌లను పంపడం ద్వారా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను మోసగిస్తారు. అధికారిక బ్రాండ్‌ల మాదిరిగానే ఆఫర్‌లను అందించే ఇమెయిల్‌లు లేదా యూట్యూబ్ సంబంధిత నోటిఫికేషన్‌లు పంపుతారు. అటువంటి నకిలీ లింక్‌లపై క్లిక్ చేసినప్పుడు లేదా యాప్‌లను డౌన్‌లోడ్ చేసినప్పుడు, హ్యాకర్లు వారి లాగిన్ ఆధారాలను దొంగిలిస్తారు. యూట్యూబ్ ఖాతాలకు కూడా యాక్సెస్‌ పొందవచ్చు. కంటెంట్ క్రియేటర్లు ఒప్పందాలపై సంతకం చేసిన తర్వాత హ్యాకర్లు ఖాతా వివరాలను మార్చవచ్చు. లాగ్ అవుట్ చేసి వారి నియంత్రణలోకి తీసుకోవచ్చు.

కొన్ని ఫిషింగ్ స్కామ్‌లలో హ్యాకర్లు క్రియేటర్ యూట్యూబ్ ఖాతాకు లింక్ చేసిన చెల్లింపు సమాచారాన్ని మార్చవచ్చు. ఇక్కడే హ్యాకర్ యూట్యూబ్ ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌ల నుండి వచ్చే ఆదాయాన్ని వారి స్వంత బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకుంటారు. హ్యాకర్లు యూట్యూబ్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కంటెంట్‌ను పోస్ట్ చేయవచ్చు. ఈ విధంగా సబ్‌స్క్రైబర్‌లు అన్‌సబ్‌స్క్రైబ్ అయిపోవచ్చు. బ్రాండ్ ప్రమోషన్ ఆఫర్లు పోవచ్చు. ఇది కంటెంట్ క్రియేటర్ విశ్వసనీయత, ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది.

యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్.. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయకుండా ఉండాలి. యూట్యూబ్ ఖాతాలను సురక్షితంగా ఉంచుకోవాలి. యూట్యూబ్ లేదా బ్రాండ్‌ల నుండి వచ్చినట్లుగా చూపించే ఇమెయిల్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.

తదుపరి వ్యాసం