Akasa Air Pay Day sale : విమాన టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్లు.. త్వరపడండి!
30 June 2024, 9:35 IST
Discounts on flight tickets : ‘పే డే సేల్’ని ప్రకటించింది ఆకాశా ఎయిర్. ఇప్పుడు.. భారీ డిస్కౌంట్లతో మీరు విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..
ఆకాశా పే డే సేల్ వివరాలు..
తరచూ విమాన ప్రయాణాలు చేసే వారికి గుడ్ న్యూస్! ఆకాశ ఎయిర్ సంస్థ, తమ విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. 'పే డే సేల్'లో భాగంగా ఈ డిస్కౌంట్లను ఇస్తోంది సంస్థ. ఇప్పటికే మొదలైన ఈ సేల్.. జులై 1, అంటే సోమవారం వరకు కొనసాగనుంది. త్వరపడితే, మీరు చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
ఆకాశా ఎయిర్ పే డే సేల్‌లో ఎలా డిస్కౌంట్లు పొందాలి?
పే డే సేల్‌లో భాగంగా డొమెస్టిక్ ట్రావెల్స్‌పై 20శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తోంది ఆకాశా ఎయిర్. ఈ సంస్థకు చెందిన వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా ట్రావెల్ ఎజెంట్స్ దగ్గర 'పేడే' ప్రోమో కోడ్ వాడి సేవర్, ఫ్లెక్సీ ఫేర్లకు డిస్కౌంట్లు పొందొచ్చు.
"ఆకాశా ఎయిర్‌కి చెందిన డొమెస్టిక్ నెట్‌వర్క్‌లోని 22 గమ్యస్థానాలకు ప్రయాణించేందుకు కస్టమర్లు సేవర్, ఫ్లెక్సీ ఛార్జీలపై 20శాతం వరకు డిస్కౌంట్లు పొందొచ్చు. www.akasaair.com, మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్ దగ్గర ఈ నెల 28 నుంచి జులై 1 వరకు ఈ ఆఫర్ పనిచేస్తుంది," అని సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది.
అయితే.. ఇది కేవలం డొమెస్టిక్ ఫ్లైట్స్‌కి మాత్రమే వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అది కూడా 2024 జులై 5 నుంచి సెప్టెంబర్ 30 వరకు చేసే ట్రావెల్స్‌కే వర్తిస్తుంది. అయితే.. ఆగస్ట్ 15, ఆగస్ట్ 19, సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 7 వంటి కొన్ని ఎంపిక చేసిన డేట్స్‌లో ఈ డిస్కౌంట్లు ఉండవు అని గుర్తించాలి.
పే డే సేల్‌ని సంస్థ ప్రకటించినప్పటికీ.. ఇందులో పలు టర్మ్స్ అండ్ కండీషన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అడల్ట్, చైల్డ్ కేటగిరీ వారికే ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. ఆర్మీ సిబ్బంది, డాక్టర్లు, స్టూడెంట్స్, వృద్ధులకు ఇది వర్తించదు. మీల్ ఛార్జీలు, ఎక్సెస్ బ్యాగేజ్ ఛార్జీలు, ఎయిర్పోర్ట్ ఛార్జీలు, ప్రభుత్వ ఛార్జీలకు ఈ డిస్కౌంట్ వర్తించదు. ఇతర ప్రోమో కోడ్స్, ఆఫర్స్‌తో ఈ డిస్కౌంట్లను జతచేయలేము. గ్రూప్ బుకింగ్స్ అస్సలు చేసుకోలేము.
ఆకాశా ఎయిర్ సేవలు..
మరోవైపు.. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు నూతన ప్రాడక్ట్స్‌ని తీసుకొచ్చినట్టు ఆకాశా ఎయిర్ తెలిపింది. తాము వాడుతున్న బోయింగ్ 373 మ్యాక్స్ విమానాల్లో ప్రయాణికులకు మంచి లెగ్ రూమ్, పరికరాల ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్ వంటివి ఇస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఇక అప్డేట్ చేసిన కెఫే ఆకాశా మెన్యూలో 45 మీల్ ఆప్షన్స్ ఇస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇందులో.. హెల్తీ మీల్, ఫెస్టివల్ ఫేవరెట్స్, గౌర్మెట్, ఫ్యూషన్ డిషెస్ వంటివి కూడా ఉన్నాయి.
ఇతర విషయాలకు వస్తే.. ముంబై నుంచి అబుదాబికి ప్రత్యక్ష విమాన సేవలను ప్రారంభించినట్టు ఆకాశా ఎయిర్ ప్రకటించింది. ఈ విమాన సేవలు జులై 11న ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. సంస్థకు చెందిన అంతర్జాతీయ సేవ లిస్ట్‌లో అబుదాబి నాలుగోది. దోహా, జెడ్డాహ్, రియాద్‌లకు ఇప్పటికే విమానాలను నడుపుతోంది. కువైట్, మెదీనా ట్రాఫిక్ రైట్స్ సైతం ఈ సంస్థ వద్ద ఉన్నాయి.
2022 ఆగస్టులో ఆకాశా ఎయిర్ తన కార్యకలాపాలను ప్రారంభించింది.