Akasa Air plane hit by bird: ‘ఆకాశ’ విమానానికి స్వల్ప ప్రమాదం
Akasa Air plane hit by bird: అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఆకాశ(Akasa) ఎయిర్ లైన్స్ విమానానికి స్వల్ప ప్రమాదం జరిగింది.
Akasa Air plane hit by bird: గురువారం ఉదయం అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఆకాశ(Akasa) ఎయిర్ లైన్స్ విమానాన్ని టేకాఫ్ అయిన కాసేపటికి ఒక పక్షి ఢీ కొట్టింది. భూమి నుంచి 1900 అడుగుల ఎత్తున ఈ స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.
Akasa Air plane hit by bird: డీజీసీఏ ప్రకటన
ఈ ప్రమాదం విషయాన్ని Directorate General of Civil Aviation నిర్ధారించింది. ఆకాశ(Akasa) ఎయిర్ లైన్స్ ఇటీవలనే బడ్జెట్ ఎయిర్ లైన్స్ కేటగిరీలో ఆపరేషన్స్ ప్రారంభించింది. ఈ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 (Boeing 737 Max 8) QP-1333 (Ahmedabad-Delhi) విమానానికి గురువారం ఉదయం ప్రమాదం జరిగింది.
Akasa Air plane hit by bird: స్వల్ప డ్యామేజ్
1900 అడుగుల ఎత్తున పక్షి ఢీ కొనడంతో విమానం ముందు భాగంలో కొన్ని చోట్ల స్వల్పంగా డ్యామేజ్ జరిగిందని DGCA వెల్లడించింది. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తరువాత ఈ డ్యామేజ్ ను గుర్తించారు. దాంతో, మరమ్మత్తుల నిమిత్తం ప్రస్తుతానికి విమానాన్ని విధుల నుంచి తప్పించారు. ఈ నెల ప్రారంభంలో అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే విమానాన్ని కూడా ఆకాశ(Akasa) ఎయిర్ లైన్స్ చివరి నిమిషంలో రద్దు చేసి ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేసింది.