Akasa Air services from Bengaluru: ఆకాశ ఎయిర్ సంస్థ బెంగళూరు నుంచి ఈశాన్య రాష్ట్రాలకు విమానయాన సేవలు అందించనున్నట్టు ప్రకటించింది. అగర్తల (త్రిపుర), గువాహటి (అస్సోం) నగరాలకు అక్టోబరు 21 నుంచి విమానయాన సేవలు అందించనుంది.
ఆకాశ ఎయిర్ విస్తరణలో భాగంగా రెండు నార్త్ ఈస్ట్ గమ్యస్థానాలను చేరనుంది. బెంగళూరు నుంచి ఈరెండు మార్గాలతో కలిపి మొత్తం 8 గమ్యస్థానాలకు విమానయాన సేవలు అందించనుంది.
అగర్తలకు వన్ స్టాప్ కనెక్టివిటీ ఉంటుందని, గువాహటిలో ఎయిర్ క్రాఫ్ట్ మారాల్సిన అవసరం లేదని ఆకాశ ఎయిర్ తెలిపింది.
ఆగస్టు 7న ఆకాశ ఎయిర్ తన విమానయాన సేవలు ప్రారంభించింది. క్రమంగా తన సేవలను వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోంది. మొత్తం 11 నాన్ స్టాప్ రూట్లలో, 8 నగరాలకు విమానయాన సేవలను అందిస్తోంది. అహ్మదాబాద్, బెంగళూరు, కొచ్చి, చెన్నై, ముంబై, ఢిల్లీ, గువాహటి, అగర్తలకు ఆకాశ ఎయిర్ విమానయాన సేవలు అందిస్తోంది. కాగా బెంగళూరు - చెన్నై మధ్య అక్టోబరు 21 నుంచి అదనపు డెయిలీ ఫ్లైట్స్ అనౌన్స్ చేసింది.
అస్సోం రాష్ట్రానికి గేట్‌వే అయిన గువాహటి, అగర్తల నగరాలు ఈశాన్య రాష్ట్రాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు. ఈ ప్రాంతాలకు విమానయాన సేవలు అందడం వల్ల పారిశ్రామిక, పర్యాటక రంగాల వృద్ధికి దోహదపడుతుందని ఆకాశ ఎయిర్ కో ఫౌండర్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు.
బెంగళూరు, అగర్తల మధ్య మాత్రమే కాకుండా బెంగళూరు, చెన్నై మార్గంలో తన ఐదో విమాన సర్వీసును చేర్చిందని వివరించారు. అక్టోబర్ చివరిలోగా 300 వీక్లీ ఫ్లైట్స్‌కు తమ నెట్‌వర్క్ చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆకాశ ఎయిర్ తెలిపింది.