Akasa Air data breach : ప్రయాణికుల డేటా ‘లీక్’.. ఆకాశ్ ఎయిర్ క్షమాపణలు
Akasa Air data breach : ఆకాశ ఎయిర్‌లో ప్రయాణికుల డేటా లీక్ అయ్యింది. ఈ విషయాన్ని ఆ సంస్థ వెల్లడించింది.
Akasa Air data breach : విమానయాన రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన ఆకాశ్ ఎయిర్‌కు మరో షాక్ తగిలింది. ఆ సంస్థ నుంచి ప్రయాణికుల విలువైన డేటా లీక్ అయ్యింది. ఆకాశ్ ఎయిర్ డేటా బ్రీచ్ గురువారం జరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. సీఈఆర్టీ-ఇన్‌కి ఈ విషయాన్ని సొంతంగా తెలియజేసినట్టు ఆదివారం పేర్కొంది.
ప్రయాణికుల పేర్లు, లింగం, ఫోన్ నెంబర్లు, ఈమెయిల్-ఐడీ తదితర వివరాలు లీక్ అయినట్టు ఆకాశ్ ఎయిర్ వివరించింది. ఘటనకు గల కారణాలు, ఈ డేటా లీక్‌కు ఎవరు పాల్పడ్డారు? అన్న వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టింది ఆకాశ ఎయిర్.
"ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. అన్అథారైజడ్ యాక్సిస్‌ను అడ్డుకున్నాము. సంబంధిత సిస్టమ్‌లను వెంటనే షట్‌డౌన్ చేసేశాము. పరిస్థితిని అదుపుచేసేందుకు మరిన్ని చర్యలు చేపట్టాము. లాగిన్ సేవలు మళ్లీ మొదలుపెట్టాము," అని ఓ ప్రకటనలో వెల్లడించింది ఆకాశ ఎయిర్.
Akasa Air : ఎయిర్‌లైన్స్‌తో రిజర్ట్ అయ్యి, వ్యక్తిగత వివరాలను పంచుకున్న ప్రయాణికులకు కూడా.. ఈ డేటా లీక్ గురించి ఈ-మెయిల్స్ పంపించింది ఆ సంస్థ. ఆందోళన చెందవద్దని ప్రయాణికులకు సూచించింది.
అయితే.. ప్రయాణికుల ట్రావెల్ రికార్డులు, పేమెంట్ వంటి సమాచారం.. డేటాలో లీక్ అవ్వలేదని ఆకాశ ఎయిర్ పేర్కొంది. తమ వ్యవస్థ భద్రతను త్వరలోనే సమీక్షించి, దానిని మరింత మెరుగుపరుస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని ప్రయాణికులకు హామీనిచ్చింది.
గురువారం.. డేటా బ్రీచ్ వ్యవహారం తెలుసుకున్న వెంటనే.. లాగిన్ సేవలను నిలిపివేసింది విమానయాన సంస్థ. పరిస్థితిని పరిశీలించి.. కొన్ని రోజుల తర్వాత వాటిని పునరుద్ధరించింది. ఈ పూర్తి వ్యవహారంపై ప్రయాణికులకు క్షమాపణలు చెప్పుకుంది ఆకాశ ఎయిర్.
"కస్టమర్ల సమాచారం రక్షణే.. ఆకాశ ఎయిర్ ప్రథమ లక్ష్యం. కస్టమర్లకు మంచి అనుభూతిని కల్గించేందుకు మేము నిత్యం కృషి చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే మేము అప్డేట్ అవుతూ ఉంటాము. డేటా లీక్ వ్యవహారంపై క్షమాపణలు," అని ఓ ప్రకటనలో పేర్కొంది.
విమాన సేవలు..
Akasa Air routes : దివంగత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మద్దతుతో ఆకాశ ఎయిర్ సేవలు ఈ నెల 7న ప్రారంభమయ్యాయి. కొత్తగా కొనుగోలు చేసిన బీ737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ముంబై- అహ్మదాబాద్ ప్రయాణాలు సాగుతున్నాయి.
త్వరలో బెంగళూరు- ముంబై, బెంగళూరు -కొచ్చి, చెన్నై- ముంబైల మధ్య కూడా ఆకాశ ఎయిర్ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి.
విమాన సేవల కోసం మొత్తం 72 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేయడానికి ఆకాశ ఎయిర్.. బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆకాశ ఎయిర్ సిబ్బంది యూనీఫామ్స్‌ను కూడా ఈ మధ్యనే ఆవిష్కరించింది. అవి మిగతా విమానయాన సంస్థల యూనీఫామ్స్ కన్నా చాలా డిఫరంట్‌గా ఉన్నాయి.
సంబంధిత కథనం