Akasa Air | మరో దేశీ విమానయాన సంస్థ ప్రయాణం ప్రారంభం
Akasa Air | మరో స్వదేశీ విమానయాన సంస్థ సేవలు ఆగస్ట్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. `ఆకాశ ఎయిర్` సంస్థ తమ తొలి కమర్షియల్ విమానాన్ని ఆదివారం ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య నడపనుంది.
Akasa Air | స్టాక్ మార్కెట్ హీరో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సపోర్ట్‌తో, విమానయాన రంగంలో అపార అనుభవం ఉన్న ఆదిత్య ఘోష్, వినయ్ దూబేల సారధ్యంలో ఈ దేశీ, బడ్జెట్ క్యారియర్ `ఆకాశ ఎయిర్` ప్రారంభమవుతోంది.
Akasa Air | తొలి ఫ్లైట్
`ఆకాశ ఎయిర్` తొలి ఫ్లైట్ ముంబై నుంచి ఆదివారం ఉదయం 10.05 గంటలకు బయల్దేరనుంది. ఇది అహ్మదాబాద్‌కు ఉదయం 11.25 గంటలకు చేరుకుంటుంది. తొలి విమానాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా జెండా ఊపి ప్రారంభిస్తారు. త్వరలో బెంగళూరు- ముంబై, బెంగళూరు -కొచ్చి, చెన్నై- ముంబైల మధ్య కూడా `ఆకాశ ఎయిర్` విమాన సేవలు ప్రారంభం కానున్నాయి.
Akasa Air | మొత్తం 72 విమానాలు
ప్రయాణ సేవల కోసం ఈ సంస్థ బోయింగ్ 737 మ్యాక్స్(Boeing 737 Max) విమానాన్ని ఫ్లైట్ నెంబర్ QP 1101తో ఉపయోగిస్తోంది. విమాన సేవల కోసం మొత్తం 72 Max విమానాలను కొనుగోలు చేయడానికి `ఆకాశ ఎయిర్` సంస్థ Boeing సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. `ఆకాశ ఎయిర్` సిబ్బంది యూనీఫామ్స్‌ను కూడా ఈ మధ్యనే ఆవిష్కరించారు. అవి మిగతా విమానయాన సంస్థల యూనీఫామ్స్ కన్నా ఇవి డిఫరంట్‌గా ఉన్నాయి. ఈ సంస్థ కమర్షియల్ విమానాలను నడపడానికి అవసరమైన లైసెన్స్ air operator certificate (AOC) ను ఈ సంస్థ గత నెలలోనే పొందింది. జులై 7వ తేదీన ఈ సర్టిఫికెట్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) `ఆకాశ ఎయిర్` కు అందజేసింది.
Akasa Air | త్వరలో అంతర్జాతీయ సేవలు
`ఆకాశ ఎయిర్` సంస్థ అంతర్జాతీయ విమాన సేవలను కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. 2023 సంవత్సరం ద్వితీయార్ధంలో అంతర్జాతీయ విమాన సేవలను ప్రారంభిస్తామని `ఆకాశ ఎయిర్` ప్రకటించింది. మొదట ఈస్ట్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏసియా, సింగపూర్, ఇండోనేషియా దేశాలకు విమాన సేవలను ప్రారంభించాలనుకుంటున్నామని ఆకాశ్ ఎయిర్ సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు.