Discounts on Apple products : అతి తక్కువ ధరకే యాపిల్ ఐప్యాడ్, ఫ్రీగా ఎయిర్‌పాడ్స్- ఇలా చేయండి..
Published Jun 22, 2024 10:15 AM IST
Apple back to school offers : అతి తక్కువ ధరకే యాపిల్ ఐప్యాడ్ కావాలా? ఫ్రీగా ఎయిర్‌పాడ్స్ కూడా పొందాలా? అయితే.. ఇది మీకోసమే! యాపిల్ ప్రాడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
అతి తక్కువ ధరకే యాపిల్ ఐప్యాడ్..
Apple back to school offers 2024 : మీరు ఇంకా చదువుకుంటున్నారా? అయితే.. ఐప్యాడ్, మ్యాక్ వంటి ప్రాడక్ట్స్‌ని అతి తక్కువ ధరకే మీరు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. యాపిల్ ఎయిర్పాడ్స్ని ఫ్రీగా కూడా పొందొచ్చు. ప్రతియేటా యాపిల్ ప్రవేశపెట్టే బ్యాక్-టు- స్కూల్ ఆఫర్ల ద్వారా మీరు లబ్ధిపొందొచ్చు. ఈసారి కూడా మంచి డీల్స్‌తో.. ఇండియాలో బ్యాక్-టు-స్కూల్ ఆఫర్స్‌ని లాంచ్ చేసింది యాపిల్ సంస్థ. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
యాపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్: పూర్తి వివరాలు..
ఇండియాలో యాపిల్ బ్యాక్-టు-స్కూల్ ఆఫర్ ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు ఈ ఆఫర్లను పొందడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది.
Apple back to school offers India : ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలంటే మీకు.. చెల్లుబాటు అయ్యే స్టూడెంట్ ఐడీ ఉండాలి. మీరు యునీడేస్లో మీ ఐడీని వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు డిస్కౌంట్ ధరల్లో యాపిల్ ప్రాడక్ట్స్‌ని కొనుగోలు చేయడానికి, ఉచిత ఆఫర్లను పొందడానికి అర్హత సాధిస్తారు.
ఇదీ చూడండి:- Vivo Y58 5G : వివో వై58 5జీ లాంచ్.. రూ. 20వేల బడ్జెట్లో ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్?
యాపిల్ మ్యాక్, ఐప్యాడ్.. మీకు ఎలా ఉపయోగపడతాయి?
యాపిల్ మ్యాక్ గురించి మాట్లాడాలంటే.. విద్యార్థులు తమ యాప్స్‌ని స్టేజ్ మేనేజర్‌తో మేనేజ్ చేసుకోవచ్చు. స్పేస్ బార్ని ప్రెస్ చేసి క్విక్ ప్రివ్యూస్ చూడొచ్చు. మాటిమాటికీ అదే లాంగ్ సెంటెన్స్‌లను రిపీట్ చేయాల్సి వస్తే.. సింపుల్‌గా టెక్ట్స్ ఆధారిత షార్ట్ కట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కీబోర్డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టెమ్ ప్రిఫరెన్స్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి.. టెక్ట్స్ రిప్లేస్మెంట్ బటన్ మీద ప్రెస్ చేయాలి.
Discounts on Apple iPad : ఐప్యాడ్ విషయానికొస్తే, ఇది మీ మ్యాక్ కంప్యూటర్‌కు సెకండరీ స్క్రీన్‌గా పనిచేస్తుంది. సృజనాత్మక అవకాశాలకు వీలు కల్పిస్తుంది. ఇది మీకు పని చేయడానికి ఎక్కువ స్క్రీన్ ఇవ్వడమే కాకుండా మల్టీటాస్కింగ్ చేయడానికి కూడా సహాయపడుతుంది. లూమాఫ్యూషన్, ఫైనల్ కట్ ప్రో, ప్రో క్రియేట్ వంటి యాప్స్ ఉండటం విద్యార్థులకు మరో ప్రధాన ప్లస్. ఈ సృజనాత్మక యాప్స్ అనేక రకాల పనులను రూపొందించడానికి. అసైన్మెంట్లలో సహాయపడటానికి ఉపయోగించవచ్చు.
యాపిల్ మ్యాక్, యాపిల్ ఐప్యాడ్‌ని కలిపి వాడితే చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎయిర్‌డ్రాప్, ఇన్స్టెంట్ హాట్‌స్పాట్, యూనివర్సల్ క్లిప్‌బోర్డ్, ఈవెన్ కంటిన్యూటీ కెమెరా వంటివి వాడుకోవచ్చు.
Discounts on Apple Mac : యాపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు మీ సమీపంలోని యాపిల్ స్టోర్స్‌ని సందర్శించడం ఉత్తమం. యాపిల్ వెబ్సైట్లో కూడా ఈ బ్యాక్ టు స్కూల్ ఆఫర్స్‌పై వివరాలు ఉంటాయి. విద్యార్థులకు ఇవి నిజంగా మంచి డీల్స్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
