5 top Android smartphones: స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ ఉన్న 5 పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్స్ ఇవే; వీటిలో ఏది బెటర్ అంటే?
04 December 2024, 17:08 IST
5 top Android smartphones: స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్లు శక్తివంతమైన పనితీరుకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. స్నాప్ డ్రాగన్ అడ్వాన్స్డ్ చిప్ సెట్ పై నడిచే ఐదు అత్యంత శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ జాబితాను మీ కోసం తీసుకువచ్చాం..
స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ తో పనిచేసే 5 పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్స్
5 top Android smartphones: ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో సాధారణంగా స్నాప్ డ్రాగన్ చిప్సెట్ ఉంటుంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన వివిధ బ్రాండ్స్ ఫ్లాగ్ షిప్ మోడళ్లలో ఎక్కువ భాగం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్లను కలిగి ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ అనంతరం మీడియా టెక్ ప్రాసెసర్లు తదుపరి ప్రాధాన్యతగా ఉన్నాయి. ముఖ్యంగా డైమెన్సిటీ 9400 స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ తో పోటీ పడుతోంది. ఏదేమైనా, స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ ఉన్న, రూ.50,000 అంతకంటే ఎక్కువ ధర ఉన్న 5 ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ఇవే..
1. ఐక్యూ 13
ఐక్యూ 13.. ఐక్యూ నుండి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఇది. ఇది నిన్ననే (డిసెంబర్ 3) భారతదేశంలో లాంచ్ అయింది. క్వాల్ కామ్ ప్రస్తుత ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ తో ఇది పని చేస్తుంది. ఈ డివైస్ లో ఇన్-హౌస్ క్యూ2 గేమింగ్ చిప్ కూడా ఉంది. 6.82 అంగుళాల డిస్ ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా తదితర ప్రీమియం ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఐక్యూ 13 (IQOO 13) స్మార్ట్ ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధరను రూ.54,999గా నిర్ణయించారు. వివిధ డిస్కౌంట్లను వర్తింపజేయడం ద్వారా రూ .51,999 కు కొనుగోలు చేసే లాంచ్ ఆఫర్ కూడా ఉంది. 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.59,999 గా (ప్రారంభ లాంచ్ సమయంలో రూ.56,999) నిర్ణయించారు. ఇది లెజెండ్, నార్డో గ్రే అనే రెండు రంగుల్లో లభిస్తుంది. డిసెంబర్ 5 నుంచి ఐక్యూ (IQOO) 13 ప్రి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
2. రియల్మీ జీటీ 7 ప్రో
స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ తో వచ్చిన మరో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రియల్మీ (Realme) జీటీ 7 ప్రో. ఇది 16 జిబి LPDDR5X ర్యామ్, 512 జిబి స్టోరేజ్ తో వస్తుంది. ఇది గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి ఇంటెన్సివ్ టాస్క్ లకు పవర్ హౌజ్ గా మారుతుంది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్ కూడా ఉన్నాయి. 12 జీబీ+256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రియల్మీ జీటీ 7 ప్రో (Realme GT 7 Pro) ధర రూ.59,999 కాగా, 16 జీబీ+512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.65,999గా ఉంది. అమెజాన్, రియల్మీ ఇండియా, పలు ఇతర ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ సేల్ నవంబర్ 29న ప్రారంభమైంది.
3. వన్ ప్లస్ 13
ఇంకా అధికారికంగా వన్ ప్లస్ 13 (OnePlus 13) ను భారతదేశంలో లాంచ్ చేయలేదు. ఇది డిసెంబర్లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ చిప్ సెట్, ట్రిపుల్ కెమెరా సెటప్ తో సహా హాసెల్బ్లాడ్ ట్యూన్డ్ కెమెరాలు ఉంటాయి. మునుపటి వన్ ప్లస్ (OnePlus) డివైజ్ ల మాదిరిగా కాకుండా, ఇది ఫ్లాట్ ప్యానెల్, ఫ్లాట్ సైడ్లను కలిగి ఉంటుంది.
4. షియోమీ 14
మీరు కెమెరా సెంట్రిక్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు షియోమీ 14 (Xiaomi 14) కోసం వెయిట్ చేయాల్సిందే. లైకా ఆప్టిక్స్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇందులో ఉంది. అలాగే, మోస్ట్ అడ్వాన్స్డ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా వంటి డివైజ్ లలో కనిపించే ప్రాసెసర్ ఇదే. షియోమీ (Xiaomi) 14 స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఇటీవల ఈ ఫోన్ పై డిస్కౌంట్ (Discount) లభించగా, అమెజాన్ లో దీని సాధారణ ధర రూ.65,000 నుంచి రూ.49,999కు తగ్గింది. వివిధ ఆఫర్లను కలపడం ద్వారా మీరు మరింత మెరుగైన డీల్ పొందవచ్చు.
5. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా
శాంసంగ్ (samsung) గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 2024 ప్రారంభంలో లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా దాని టైటానియం ఫ్రేమ్ తో బిల్డ్ క్వాలిటీ పరంగా తిరుగులేనిదిగా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra) కూడా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 తో పనిచేస్తుంది. ఇది స్టాండర్డ్ వెర్షన్ కంటే కొంచెం శక్తివంతమైన కస్టమైజ్డ్ చిప్. ఇందులో 12 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ వేరియంట్లను ఎంచుకోవచ్చు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, 3ఎక్స్ టెలీఫోటో కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉన్నాయి. ఇందులో 6.8 అంగుళాల ఫ్లాట్ డిస్ ప్లే, పాపులర్ ఎస్ పెన్ ఉన్నాయి.
బెస్ట్ ఆప్షన్
దాదాపు ఒక సంవత్సరం పాతది అయినప్పటికీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా శక్తివంతమైన ఎంపికగా ఉంది. ముఖ్యంగా కెమెరా ఔత్సాహికులకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఐఫోన్ 16 ప్రో తో ఈ స్మార్ట్ ఫోన్ పోటీ పడుతోంది. దీని ధర రూ.1,00,000 మార్క్ వద్ద ఉంది. మన్నికైన, భవిష్యత్తు-ప్రూఫ్ మొబైల్ కావాలనుకునేవారికి ఇది గొప్ప ఎంపిక.
టాపిక్