Xiaomi 14 Civi vs Motorola Edge 50 : ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది కొనొచ్చు?
Xiaomi 14 : షావోమీ 14 సివి వర్సెస్ మోటోరోలా ఎడ్జ్ 50.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..
Xiaomi 14 price in India : మోటోరోలా, షావోమీ సంస్థలు.. ఇటీవల తమ వాల్యూ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్‌ని లాంచ్ చేశాయి. అవి.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా, షావోమీ 14 సివి.
షావోమీ 14 సివి ప్రధానంగా దాని కెమెరా సామర్థ్యాల కోసం మార్కెట్ చేయడం జరిగింది. అయితే మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ప్రీమియం డిజైన్, కెమెరా పనితీరు సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్? అనేది ఇక్కడ తెలుసుకుందాము..
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా వర్సెస్ షావోమీ 14 సివి..
ఈ రెండు ఫోన్లు స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్3తో పనిచేస్తాయి. 12 జీబీ ర్యామ్‌తో వస్తాయి. షావోమీ 14 సివి 8 జీబీ ర్యామ్ వేరియంట్‌ని కూడా అందిస్తుంది. స్టోరేజ్ విషయానికొస్తే.. షావోమీ 14 సివి 256 జీబీ, 512 జీబీ ఆప్షన్స్‌ని ఇస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో 512 జీబీ స్టోరేజ్ మాత్రమే లభిస్తుంది.
Xiaomi 14 features : ఆప్టిక్స్ విషయానికి వస్తే.. షావోమీ 14 సివిలో 50 మెగాపిక్సెల్ (ఎఫ్ / 1.63) వైడ్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2 ఎక్స్ టెలిఫోటో లెన్స్‌తో సహా లైకా ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి.
మరోవైపు మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో 50 మెగాపిక్సెల్ (ఎఫ్ / 1.6) వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 64 మెగాపిక్సెల్ 3ఎక్స్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
ఇదీ చూడండి:- Realme GT 6 vs Realme GT 6T : ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో అసలు తేడా ఏంటి?
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ కెమెరా స్పెసిఫికేషన్లు ఒకే విధంగా ఉన్నప్పటికీ, షావోమీ 14 సివి ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు అదనపు లైకా విజువల్ ఎఫెక్ట్స్‌ని అందిస్తుంది.
Motorola Edge 50 Ultra price in India : షావోమీ 14 సివిలో 68వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా కొంచెం చిన్న 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. కానీ వేగవంతమైన 125 వాట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్, 10వాట్ వైర్లెస్ పవర్ షేరింగ్‌ని అందిస్తుంది.
షావోమీ సివీలో రెండు ఆప్షన్స్ ఉన్నందు వల్ల 8 జీబీ + 256 జీబీ వేరియంట్ లేదా 12 జీబీ + 512 జీబీ వేరియంట్ మధ్య ఎంపిక చేసుకునే ఆప్షన్ మీకు లభిస్తుంది. దీని ధర వరుసగా రూ. 42,999, రూ .47,999. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా కేవలం ఒకే ఒక్క వేరియంట్లో వస్తుంది: 12 జీబీ + 512 జీబీ. దీని ధర రూ .54,999.
ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్‌లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లోని హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం