Samsung Galaxy Z Flip4 : మెరుగైన కెమెరా సెటప్‌తో.. అద్భుతమైన ఫీచర్లతో..-samsung galaxy z flip4 will be launched on samsung galaxy unpacked event ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samsung Galaxy Z Flip4 : మెరుగైన కెమెరా సెటప్‌తో.. అద్భుతమైన ఫీచర్లతో..

Samsung Galaxy Z Flip4 : మెరుగైన కెమెరా సెటప్‌తో.. అద్భుతమైన ఫీచర్లతో..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 20, 2022 02:00 PM IST

Samsung Galaxy Z Flip 4 మునుపటి కంటే మెరుగైన కెమెరా సెటప్‌తో వస్తుంది. అయితే దీనిని Samsung Galaxy అన్‌ప్యాక్డ్ ఈవెంట్​లో విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 10వ తేదీన జరగనుంది. అయితే Samsung Galaxy Z Flip 4 గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

<p>గెలాక్సీ Z ఫ్లిప్ 4</p>
<p>గెలాక్సీ Z ఫ్లిప్ 4</p>

Samsung Galaxy Z Flip 4 : Samsung Galaxy Unpacked 2022 ఈవెంట్ ఆగస్టు 10వ తేదీన జరగనుంది. ఈ విషయాన్ని Samsung Electronics వెల్లడించింది. అయితే.. ఈ కార్యక్రమంలో వివిధ పరికరాలను కంపెనీ ఆవిష్కరిస్తుంది. ఇప్పటివరకు ఏయే పరికరాలను ఆవిష్కరిస్తుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించనప్పటికీ.. Samsung Galaxy Z Flip4ను విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు. Samsung నుంచి వచ్చే నెక్స్ట్-జెన్ ఫోల్డబుల్స్ ఇది. ఎందుకు విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారంటే.. రాబోయే ఈవెంట్ టీజర్ వీడియోలో.. కంపెనీ Samsung Galaxy Z Flip4ను ఉంచింది.

టీజర్​లో ఇమేజ్ ప్రకారం.. కొత్త Samsung Galaxy Z Flip4 పర్పుల్ కలర్ ఆప్షన్‌లో కనిపించింది. రాబోయే Samsung Galaxy Z Flip4 లీక్ అయిన ప్రెస్ ఇమేజ్‌లలో కూడా ఇలాంటి కలర్ ఆప్షన్‌లు కనిపించాయి. లీకైన ప్రెస్ షాట్‌ల ప్రకారం.. Samsung Galaxy Z Flip4 మూడు రంగు ఎంపికలలో వస్తుంది. ఫాంటమ్ బ్లాక్, లేత గోధుమరంగు, గ్రేగ్రీన్. మరోవైపు గ్రే, పర్పుల్, గోల్డ్, లేత నీలం రంగులలో ఇది అందుబాటులో ఉంటుందనే పుకారు ఉంది.

Samsung Galaxy Z Flip 4 సన్నగా, తేలికగా, విశాలమైన స్క్రీన్‌లతో వస్తుంది. ఈ పరికరం Android 12లో నడుస్తుంది. Qualcommకు చెందిన స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌తో 12GB RAM, 512GB వరకు అంతర్గత నిల్వతో వస్తుంది. Galaxy Z Flip 4 దాని ముందున్న దాని కంటే మెరుగైన కెమెరాలతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 12-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ లెన్స్, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్‌తో వస్తుందని భావిస్తున్నారు. గెలాక్సీ Z ఫోల్డ్ 4 ఔటర్ డిస్‌ప్లేలో 10-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఫోల్డింగ్ డిస్‌ప్లేపై 16-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌తో వస్తుంది.

ఇది కాకుండా ఈ ఈవెంట్​లో Samsung కొత్త Samsung Galaxy Watch 5, Samsung Galaxy Buds 2 Proని కూడా ఆగస్టు 10న జరిగే Samsung Galaxy Unpacked ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు భావిస్తున్నారు.

సంబంధిత కథనం

టాపిక్