తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2024 Maruti Suzuki Swift : సరికొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్​.. వచ్చే నెలలో లాంచ్​!

2024 Maruti Suzuki Swift : సరికొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్​.. వచ్చే నెలలో లాంచ్​!

Sharath Chitturi HT Telugu

15 April 2024, 13:34 IST

    • Maruti Suzuki Swift 2024 : సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్​ 2024 వచ్చేస్తోంది! వచ్చే నెలలోనే ఇది ఇండియాలో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు..
సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్​ వచ్చేస్తోంది..
సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్​ వచ్చేస్తోంది..

సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్​ వచ్చేస్తోంది..

Maruti Suzuki Swift on road price Hyderabad : మారుతీ సుజుకీ స్విఫ్ట్ 2024 వర్షెన్​.. గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ప్రముఖ హ్యాచ్​బ్యాక్​.. ఈ ఏడాది మేలో ఇండియాలో లాంచ్​ అవుతుంది. దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.. ఈ న్యూ జనరేషన్​ స్విఫ్ట్​ని మే 9న లాంచ్​ చేస్తుందని సమచారం. ఇండియాలో మారుతీ సుజుకీకి బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది స్విఫ్ట్​. చాలా కాలం తర్వాత.. అప్డేట్స్​ అందుకుంటుండటంతో.. 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్​పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త తరం మారుతీ సుజుకీ స్విఫ్ట్.. 2023 జపాన్ మొబిలిటీ షోలో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి.. ఈ హ్యాచ్​బ్యాక్​.. యూ​రప్, జపాన్ వంటి ప్రపంచ మార్కెట్లలో సేల్​లో ఉంది. ఇప్పుడు ఆ జాబితాలోకి భారత్ కూడా చేరబోతోంది. ఇండియా-స్పెక్ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్.. గ్లోబల్ మోడల్​ను పోలి ఉంటుంది.

2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్: ఎక్స్​టీరియర్​..

వైఈడీ అనే కోడ్ నేమ్​తో వస్తోంది కొత్త మారుత సుజుకీ స్విఫ్ట్. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న మోడల్​తో పోలిస్తే గణనీయమైన, విలక్షణమైన విజువల్ లుక్​ ఇందులో కనిపిస్తోంది. ఇందులో అప్​డేటెడ్ రేడియేటర్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో షార్ప్ అండ్ రీడిజైన్ చేసిన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్​ల్యాంప్స్ ఉన్నాయి. టాప్ వేరియంట్లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉండనున్నాయి. బంపర్ కూడా డిఫరెంట్​గా కనిపిస్తోంది. హ్యాచ్​బ్యాక్​లో కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ లభించింది. అంతేకాదు.. ప్యాసింజర్ డోర్ హ్యాండిల్స్​ని కూడా రీలోకేట్​ చేసింది సంస్థ. వెనుక భాగంలో, కొత్త స్విఫ్ట్ స్పోర్ట్స్ రీడిజైన్ చేసిన ఎల్ఈడి టెయిల్ లైట్లు, రీడెవలప్డ్​ బంపర్​ని చూడవచ్చు. 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్​ కొత్త కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.

2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్: ఇంటీరియర్యయ

Maruti Suzuki Swift 2024 : కొత్త స్విఫ్ట్​ ఇంటీరియర్​లో చాలా మార్పులు కనిపించే అవకాశం ఉంది. డ్యాష్​బోర్డ్ లేఅవుట్​ కొత్తగా ఉంది. ఫ్రీ స్టాండింగ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​ను కలిగి ఉంది. సీటు, అప్​హోల్ స్టరీ మెటీరియల్ కూడా రిఫ్రెషింగా ఉన్నాయి.

2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్: సేఫ్టీ..

సేఫ్టీ పరంగా.. కొత్త స్విఫ్ట్​లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్​ విత్ ఈబీడీ, ఈఎస్​పీ స్టాండర్డ్​గా, రెండవ వరుసలో సెంటర్ ప్యాసింజర్ కోసం మూడు పాయింట్ల సీట్ బెల్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి. ఇండియా-స్పెక్ స్విఫ్ట్ గ్లోబల్ మోడల్లో అందుబాటులో ఉన్న 360 డిగ్రీల కెమెరా, అడాస్​ వంటివి ఇందులో ఉండకపోవచచు.

2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్: ఇంజిన్​..

2024 Maruti Suzuki Swift : కొత్త తరం మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్​బ్యాక్​లో​.. కొత్త జడ్-సిరీస్ 1.2-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్​ని పొందుతుంది. ఇది ప్రస్తుత మోడల్​లోని కే12 నాలుగు సిలిండర్ల పెట్రోల్ యూనిట్ స్థానంలో వస్తుంది. కొత్త ఇంజిన్.. పవర్- టార్క్ అవుట్​పుట్.. కే12 యూనిట్ ఉత్పత్తి చేసే విధంగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత ఇంజిన్.. గరిష్టంగా 89బీహెచ్​పీ పవర్, 113ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. కొత్త స్విఫ్ట్​లో 5-స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్, ఏఎమ్​టీ ఆప్షన్ అందుబాటులో ఉంటాయని ఆశించవచ్చు. అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉండే మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ అతిపెద్ద హైలైట్!

తదుపరి వ్యాసం