తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2024 Hyundai Creta : హ్యుందాయ్​ క్రేటా బుకింగ్స్​ షురూ.. ఇంటీరియర్​ టీజర్​ రిలీజ్​

2024 Hyundai Creta : హ్యుందాయ్​ క్రేటా బుకింగ్స్​ షురూ.. ఇంటీరియర్​ టీజర్​ రిలీజ్​

Sharath Chitturi HT Telugu

03 January 2024, 15:30 IST

google News
    • 2024 Hyundai Creta : హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి. మరోవైపు కొత్త ఎస్​యూవీ ఇంటీరియర్​ని సంస్థ రివీల్​ చేసింది.
హ్యుందాయ్​ క్రేటా బుకింగ్స్​ షురూ.. ఇంటీరియర్​ టీజర్​ రిలీజ్​
హ్యుందాయ్​ క్రేటా బుకింగ్స్​ షురూ.. ఇంటీరియర్​ టీజర్​ రిలీజ్​

హ్యుందాయ్​ క్రేటా బుకింగ్స్​ షురూ.. ఇంటీరియర్​ టీజర్​ రిలీజ్​

2024 Hyundai Creta : హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​పై బజ్​ నెలకొంది. భారీ అంచనాల మధ్య.. ఈ ఎస్​యూవీ, ఈ నెల 16న ఇండియాలో లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో.. ఈ వెహికిల్​ బుకింగ్స్​ని కూడా సంస్థ తాజాగా ప్రారంభించింది. రూ. 25వేల టోకెన్​ అమౌంట్​తో 2024 క్రేటాని హ్యుందాయ్​ డీలర్​షిప్​షోరుమ్స్​, ఆన్​లైన్​లో బుక్​ చేసుకోవచ్చు. మరోవైపు లాంచ్​ టైమ్​ సమీపిస్తుండటంతో ఒక్కొక్క టీజర్​ని విడుదల చేస్తోంది సంస్థ. తాజాగా వచ్చిన ఓ టీచర్​.. హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ ఇంటీరియర్​ని రివీల్​ చేస్తోంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

2024 హ్యుందాయ్​ క్రేటా..

కొత్త హ్యుందాయ్​ క్రేటా ఎక్స్​టీరియర్​ డిజైన్​తో పాటు ఇంటీరియర్​లో భారీ మార్పులే కనిపిస్తాయని టాక్​ నడుస్తోంది. ఇక తాజాగా రిలీజ్​ అయిన టీజర్​ ప్రకారం.. కేబిన్​ మినిమలిస్టిక్​గా ఉంటుందని స్పష్టమైంది. ఇందులో.. 10.25 ఇంచ్​ డ్యూయెల్​ స్క్రీన్​ సెటప్​ ఉంటుంది. హ్యుందాయ్​ అల్కజార్​లోని డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ని క్రేటాలో కూడా వాడుతోంది సంస్థ.

Hyundai Creta facelift booking : 2024 హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీలో సెంటర్​ కన్సోల్​ కూడా మారింది. సెంటర్​లో ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ కనిపిస్తోంది. దాని కిందే.. క్లైమేట్​ కంట్రోల్​ సిస్టెమ్​ ఉంటుంది. టచ్​ కంట్రోల్​ ప్యానెల్స్​ కూడా వస్తున్నాయి. గేర్​ లెవర్​ని కూడా రీ-డిజైన్​ చేయడం జరిగింది. ఏసి వెంట్స్​ స్లిమ్​గా కనిపిస్తున్నాయి. ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, క్లైమేట్​ కంట్రోల్​ సెటప్​ మధ్యలో ఇవి ఉంటాయి. అంతేకాకుండా.. ఈ క్రేటా ఫేస్​లిఫ్ట్​లో బాక్​లిట్​ స్విచెస్​, 4 స్పోక్​ స్టీరింగ్​ వీల్​, సెంటర్​ ఆర్మ్​రెస్ట్​, డ్యూయెల్​- టోన్​ థీమ్​, యాంబియెంట్​ లైటింగ్​ వంటివి వస్తున్నాయి.

7 వేరియంట్లలో హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​..!

2024 హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీలో మొత్తం 7 వేరియంట్లు ఉంటాయని సంస్థ ప్రకటించింది. అవి.. ఈ, ఈఎక్స్​, ఎస్​, ఎస్​(ఓ), ఎస్​ఎక్స్​, ఎస్​ఎక్స్​ టెక్​, ఎస్​ఎక్స్​(ఓ). 6 మోనో టోన్​, 1 డ్యూయెల్​ టోన్​ కలర్​ ఆప్షన్స్​ వస్తున్నాయి.

2024 Hyundai Creta launch in India : వీటిటో పాటు ఈ మిడ్​ సైజ్​ ఎస్​యూవీలో 3 ఇంజిన్​ ఆప్షన్స్​ ఉంటాయి. అవి. 1.5లీటర్​ ఎంపీఐ పెట్రోల్​, 1.5లీటర్​ యూ2 సీఆర్​డీఐ డీజిల్​, 1.5లీటర్​ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్​ ఇంజిన్​లు.

ఇండియాలో హ్యుందాయ్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటి క్రేటా. ఇప్పటివరకు 9.5లక్షల యూనిట్​లు అమ్ముడుపోయాయి.

"క్రేటా బ్రాండ్​ అంటే.. ఎస్​యూవీ మాత్రమే కాదు. క్రేటా అంటే ఒక ఏమోషన్​. గత 8ఏళ్లల్లో అమ్ముడుపోయిన మిడ్​ సైజ్​ ఎస్​యూవీల్లో 3వది క్రేటానే!," అని హ్యుందాయ్​ మోటార్​ ఇండియా సీఓఓ తరుణ్​ గార్గ్​ తెలిపారు.

Hyundai Creta facelift price in Hyderabad : ఇక లాంచ్​ తర్వాత ఈ హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​.. టయోటా అర్బన్​ క్రూజర్​ హైరైడర్​, మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, కియా సెల్టోస్​, ఎంజీ ఆస్టర్​, టాటా హారియర్​, స్కోడా కుషాక్​, వోక్స్​వ్యాగన్​ టైగన్​ వంటి ఎస్​యూవీలకు గట్టిపోటీనిస్తుంది మార్కెట్​ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇక 2024 హ్యుందాయా క్రేటా ధరకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. కాగా.. ఈ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 10.87లక్షలు- రూ. 19.2లక్షల మధ్యలో ఉండొచ్చని మార్కెట వర్గాలు భావిస్తున్నాయి.

తదుపరి వ్యాసం