Yamaha Aerox 155 : 2023 యమహా ఏరోక్స్ 155 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే
08 April 2023, 6:26 IST
- 2023 Yamaha Aerox 155 launched : 2023 యమహా ఏరోక్స్ 155 మోడల్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్కూటర్ ఫీచర్స్, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
2023 యమహా ఏరోక్స్ 155 లాంచ్..
2023 Yamaha Aerox 155 launched in India : ఏరోక్స్కు 2023 వర్షెన్‌ను లాంచ్ చేసింది యమహా మోటార్ ఇండియా సంస్థ. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,42,800గా ఉంది. ఈ 2023 యమహా ఏరోక్స్ 155లో కొత్తగా సిల్వర్ కలర్ ఆప్షన్ లభిస్తోంది. ఇప్పటికే ఈ స్కూటర్‌ను మూడు రంగుల్లో విక్రయిస్తోంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. అవి మెటాలిక్ బ్లాక్, రేసింగ్ బ్లూ, గ్రే వెర్మీలియన్. ఈ కొత్త వర్షెన్‌లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టెమ్ ఉంటుంది. ఈ సెగ్మెంట్ స్కూటర్లలో ఈ సిస్టెమ్ లభిస్తున్న తొలి వాహనం ఈ ఏరోక్స్ 155 కావడం విశేషం.
ఇంజిన్‌లో మార్పులు లేవు..
Yamaha Aerox 155 on road price in Hyderabad : 2023 యమహా ఏరోక్స్ 155 ఇప్పుడు ఈ20 ఫ్యూయెల్ కంప్లైంట్. ఇందులో ఓబీడీ-2 సిస్టెమ్ కూడా ఉంది. అదనంగా.. ఈ స్కూటర్‌కు హజార్డ్ స్విచ్ స్టాండర్డ్‌గా లభిస్తోంది. ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు. ఇందులో 155సీసీ బ్లూ కోర్ ఇంజిన్ విత్ వీవీఏ (వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్) ఉంది. యమహా ఆర్15లోనూ ఇదే వినియోగిస్తోంది సంస్థ. ఇందులో సీవీటీ ట్రాన్స్మిషన్ కొత్తగా యాడ్ అయ్యింది. ఇక ఈ ఇంజిన్.. 8000 ఆర్పీఎం వద్ద 14.8 బీహెచ్పీ పవర్‌ను, 6,500 ఆర్పీఎం వద్ద 13.9 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇదీ చదవండి :- దొంగల బారి నుంచి మీ బైక్‌ను రక్షించుకోండి ఇలా..!
ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. 2023 యమహా ఏరోక్స్ 155లో ఎల్ఈడీ పొజీషనింగ్ ల్యాంప్స్‌తో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఫ్రెంట్ పవర్ సాకెట్, మల్టీ-ఫంక్షనల్ కీ, ఎక్స్టర్నల్ ఫ్యూయెల్ లిడ్ వంటివి వస్తున్నాయి. 24.5 లీటర్ కెపాసిటీతో కూడిన అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంది.
2023 Yamaha Aerox 155 features : ఇక ఈ ఏరోక్స్ 155లో 14ఇంచ్ అలాయ్ వీల్స్, 140 సెక్షన్ రేర్ టైర్, ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్, రేర్‌లో ట్విన్ గ్యాస్ ఛార్జ్డ్ షాక్ అబ్సార్బర్స్ వస్తున్నాయి. ఫ్రెంట్లో 230 ఎంఎం డిస్క్, రేర్‌లో 130ఎంఎం డ్రమ్ బ్రేకింగ్ సెటప్ ఉంటుంది.
ఇక సేఫ్టీ విషయానికొస్తే.. ఈ 2023 యమహా ఏరోక్స్ 155లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టెమ్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ వంటివి లభిస్తున్నాయి. ఈ స్కూటర్ ఇన్స్టెంట్గా క్లిక్ అవుతుందని సంస్థ భావిస్తోంది.