Yamaha 125cc scooters : కొత్త రంగుల్లో- సరికొత్తగా 3 యమహా 125సీసీ రేంజ్​ స్కూటర్లు-yamaha launches 203 lineup of its 125 cc scooter range check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Yamaha 125cc Scooters : కొత్త రంగుల్లో- సరికొత్తగా 3 యమహా 125సీసీ రేంజ్​ స్కూటర్లు

Yamaha 125cc scooters : కొత్త రంగుల్లో- సరికొత్తగా 3 యమహా 125సీసీ రేంజ్​ స్కూటర్లు

Sharath Chitturi HT Telugu
Feb 20, 2023 01:21 PM IST

Yamaha 125cc scooters launch : యమహాకు చెందిన 125 సీసీ సెగ్మెంట్​లోని మూడు స్కూటర్లకు అప్డేటెడ్​ వర్షెన్​లు లాంచ్​ అయ్యాయి. వాటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

కొత్త రంగుల్లో- సరికొత్తగా యమహా 125సీసీ రేంజ్​ స్కూటర్లు
కొత్త రంగుల్లో- సరికొత్తగా యమహా 125సీసీ రేంజ్​ స్కూటర్లు (HT AUTO)

Yamaha 125cc scooters launch : 125 సీసీ స్కూటర్​ సెగ్మెంట్​లో పలు మోడల్స్​కు 2023 వర్షెన్​లను లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల సంస్థ యమహా మోటార్​ ఇండియా. 2023 ఫాసినో 125 ఫై హైబ్రీడ్ ఎక్స్​షోరూం​ ధర రూ. 91,030గా ఉంది. రేయ్​ జెడ్​ఆర్​ 125 ఫై హైబ్రీడ్​ ఎక్స్​షోరూం ధర రూ. 89,530గా ఉంది. ఇక రేయ్​ జెడ్​ఆర్​ స్ట్రీట్​ ర్యాలీ 125 ఫై హైబ్రీడ్ ఎక్స్​షోరూం​ ధర రూ. 93,530గా ఉంది. ఈ మోడల్స్​ అన్ని కూడా ఈ20 ఫ్యూయెల్​ కంప్లైంట్​ ఇంజిన్​తో వస్తున్నాయి.

కొత్త రంగుల్లో.. సరికొత్తగా..!

Yamaha Fascino 125 Fi Hybrid price : ఈ కొత్త మోడల్స్​ అన్నీ ఓబీడీ2 కంప్లైంట్​తో రూపొందించినవే. రియల్​ టైమ్​లో ఇంజిన్​ ప్రదర్శనను ట్రాక్​ చేసే డేటా కూడా వీటిల్లో వస్తున్నాయి. వీటితో.. స్కూటర్​ను వెలువడుతున్న ఉద్గారాలు తగ్గనున్నాయి. ఈ 125 సీసీ హైబ్రీడ్​ స్కూటర్​ రేంజ్​లోని మోడల్స్​ అన్నింటికీ బ్లూటూత్​ ఎనెబుల్డ్​ వై- కనెక్ట్​ యాప్​ వస్తోంది. ఇందులో ఫ్యూయెల్​ కన్జమ్షన్​ ట్రాకర్​, మెయిన్​టేనెన్స్​ రికమెండేషన్​, లాస్ట్​ పార్కింగ్​ లొకేషన్​, మాల్​ఫంక్షన్​ నోటిఫికేషన్​, రివర్స్​ డాష్​బోర్డ్​, రైడర్​ ర్యాంకింగ్​తో పాటు మరిన్ని ఫీచర్స్​ ఉన్నాయి.

ఈ కొత్త వర్షెన్​లలో వివిధ కలర్​ స్కీమ్స్​ కూడా లభిస్తున్నాయి. ఫాసినో 125 ఫై హైబ్రీడ్​ డిస్క్​ వేరియంట్​, రేయ్​ జెడ్​ఆర్​ 125 ఫై హైబ్రీడ్​ వేరియంట్​లకు న్యూ డార్క్​ మాట్​ బ్లూ కలర్​ వస్తోంది. ఇక రేయ్​ జెడ్​ఆర్​ స్ట్రీట్​ ర్యాలీ 125 ఫై హైబ్రీడ్​కు మాట్​ బ్లాక్​, లైట్​ గ్రే వెర్మిలియన్​ రంగులు లభిస్తున్నాయి. రేయ్​ జెడ్​ఆర్​ 125 ఫై హైబ్రీడ్​ డిస్క్​ అండ్​ డ్రమ్​ వేరియంట్​లో మాట్​ రెడ్​, మెటాలిక్​ బ్లాక్​, సియన్​ బ్లూ రంగులు వస్తున్నాయి.

Yamaha Ray ZR 125 Fi Hybrid on road price in Hyderabad : ఈ సరికొత్త వర్షెన్​లలో ఓబీడీఐ2, ఈ-20 ఫ్యూయెల్​ కంప్లైంట్​ బీఎస్​6, ఎయిర్​- కూల్డ్​ ఫ్యూయెల్​ ఇంజక్షన్​ (ఎఫ్​ఐ), 125 సీసీ బ్లూ కోర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 6,500 ఆర్​పీఎం వద్ద 8.2 పీఎస్​ పవర్​ను, 5000 ఆర్​పీఎం వద్ద 10.3 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. హైబ్రీడ్​ ఇంజిన్​లో స్మార్ట్​ మోటార్​ జనరేటర్​ సిస్టెమ్​ కూడా ఉంటుంది.

WhatsApp channel