Yamaha MT 15 launch : 2023 యమహా ఎంటీ 15 లాంచ్​.. ధర ఎంతంటే!-2023 yamaha mt 15 launched in india check features price and full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Yamaha Mt 15 Launch : 2023 యమహా ఎంటీ 15 లాంచ్​.. ధర ఎంతంటే!

Yamaha MT 15 launch : 2023 యమహా ఎంటీ 15 లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Feb 17, 2023 10:23 AM IST

2023 Yamaha MT 15 launched in India : 2023 యమహా ఎంటీ 15 ఇండియాలో లాంచ్​ అయ్యింది. కొత్త ఫీచర్స్​, ధరతో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

యమహా ఎంటీ 15 లాంచ్​.. ధర ఎంతంటే!
యమహా ఎంటీ 15 లాంచ్​.. ధర ఎంతంటే!

2023 Yamaha MT 15 launched in India : దిగ్గజ టూ వీలర్​ ఆటోమొబైల్​ సంస్థ యమహా.. ఇటీవలి కాలంలో తన పోర్ట్​ఫోలియో లైనప్​ను అప్డేట్​ చేస్తూ వస్తోంది. ఆర్​15 వీ4, ఎఫ్​జెడ్​ వంటి మోడల్స్​ వీటిల్లో ఉన్నాయి. ఇక తాజాగా 2023 ఎంటీ-15 మోడల్​ను సైతం ఇండియా మార్కెట్​లో లాంచ్​ చేసింది యమహా. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

యమహా ఎంటీ15- లుక్స్​..

నెక్​డ్​ సెగ్మెంట్​లో ఉన్న ది బెస్ట్​ లుకింగ్​ బైక్స్​లో ఈ యమహా ఎంటీ15 ఒకటి. ఆర్​15 వీ4కు ఇది నెక్​డ్​ వర్షెన్​లాగా కనిపిస్తుంది. కొత్త మోడల్​లో మెటాలిక్​ బ్లాక్​ కలర్​ థీమ్​ వస్తోంది. రేసింగ్​ బ్లూ, ఐస్​- ఫ్లో వెర్మిలియన్​, సైన్​ స్టార్మ్​ వంటి థీమ్స్​ ముందే అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఈ బైక్​కు ఎల్​ఈడీ టర్న్​ ఇండికేటర్స్​ కొత్తగా వచ్చాయి.

యమహా ఎంటీ15- ఇంజిన్​, గేర్​బాక్స్​..

Yamaha MT 15 features : 2023 యమహా ఎంటీ15 ఇంజిన్​లో ఎలాంటి మార్పు లేదు. ఇందులో 155సీసీ, సింగిల్​ సిలిండర్​ లిక్విడ్​ కూల్డ్​ వీవీఏ ఇంజిన్​ ఉంటుంది. ఇది 18.4 బీహెచ్​పీ పవర్​ను (10,000 ఆర్​పీఎం), 14.1 ఎన్​ఎం టార్క్​ను (7,500 ఆర్​పీఎం) జనరేట్​ చేస్తుంది. ఇందులో స్లిప్​ అండ్​ అసిస్ట్​ క్లచ్​తో కూడిన 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

ఏప్రిల్​ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్​6 స్టేజ్​ 2 నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అందుకు తగ్గట్టుగా ఈ బైక్​లో మార్పులు జరిగాయి.

యమహా ఎంటీ15- ఫీచర్స్​..

2023 Yamaha MT 15 : కొత్త యమహా ఎంటీ15లో ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ ఉంటుంది. ఫ్యూయెల్​ కన్జమ్షన్​ ఇండికేటర్​, వీవీఎస్​ ఇండికేటర్​, షిఫ్ట్​ టైమింగ్​ లైట్​, గేర్​ పొజిషన్​ ఇండికేటర్​, టాకోమీటర్​ రీడింగ్స్​ ఇందులో కనిపిస్తాయి. బ్లూటూత్​ కనెక్టివిటీ, ఎల్​ఈడీ లైటింగ్​ వంటివి లభిస్తున్నాయి.

యమహా ఎంటీ15- సేఫ్టీ..

2023 ఎంటీ 15లో సైడ్​ స్టాండ్​ ఇంజిన్​ కట్​-ఆఫ్​ స్విఛ్​, ట్రాక్షన్​ కంట్రోల్​ సిస్టెమ్​, డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ వంటివి సేఫ్టీ ఫీచర్స్​ కింద లభిస్తున్నాయి.

యమహా ఎంటీ15- ధర..

2023 Yamaha MT 15 on road price in Hyderabad : మార్కెట్​లో యమహా ఎంటీ-15 ఎక్స్​షోరూం ధర రూ. 1,68,400గా ఉంది. ఈ యమహా ఎంటీ- 15 లీటరుకు 40- 45కి.మీల మైలేజ్​ ఇస్తుంది.

WhatsApp channel