Yamaha Electric Scooter: వచ్చే ఏడాది యమహా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్!-yamaha e01 electric scooter may launch in india in 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Yamaha Electric Scooter: వచ్చే ఏడాది యమహా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్!

Yamaha Electric Scooter: వచ్చే ఏడాది యమహా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్!

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 06:37 PM IST

Yamaha E01 Electric scooter : యమహా కూడా వచ్చే ఏడాది ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఈ కంపెనీ తీసుకొస్తోందని తెలుస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Yamaha E01 Electric scooter launch : ప్రస్తుతం ద్విచక్ర వాహనాల తయారీ సంస్థల మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ల పోటీ నెలకొంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ లను తీసుకురాగా.. వచ్చే ఏడాది లాంచ్ చేసేందుకు మరికొన్ని సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే జపాన్‍కు చెందిన యమహా (Yamaha) కూడా ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసేందుకు చూస్తోంది. వచ్చే ఏడాదిలో భారత మార్కెట్‍లో ఎలక్ట్రిక్ స్కూటర్ ను యమహా లాంచ్ చేయడం దాదాపు ఖాయమైంది. యమహా ఈ01 (Yamaha E01) పేరుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రానుందని తెలుస్తోంది. మంచి లుక్, ఎక్కువ బ్యాటరీ రేంజ్ ఉండే ఈ స్కూటర్.. ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీని ఇచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

Yamaha E01 Electric Scooter Features : యమహా అంటేనే క్రేజ్

ఇప్పటికే భారత మార్కెట్‍లో యమహాకు చెందిన చాలా పెట్రోల్ బైక్స్, స్కూటర్స్ మంచి క్రేజ్ సంపాదించాయి. ఈ నేపథ్యంలో 2023లో యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు ఆ కంపెనీ సిద్ధమైందని రిపోర్ట్ లు బయటికి వస్తున్నాయి. భారత్‍తో పాటు ఇండోనేషియా, థాయ్‍లాండ్, మలేసియాతో పాటు మరిన్ని దేశాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయాలని యమహా భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జపాన్‍తో పాటు మరికొన్ని దేశాల్లో యమహా ఈ01 అందుబాటులోకి వచ్చింది.

Yamaha E01 Electric Scooter Features : యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు

యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ 4.9కిలో వాట్ హవర్ (kWh) సామర్థ్యమున్న బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఫుల్ చార్జ్ పై ఈ బ్యాటరీ 104 కిలోమీటర్ల వరకు రేంజ్‍ను ఇస్తుంది. ఐదు గంటల్లో ఇది ఫుల్ చార్జ్ అవుతుంది. డిస్క్ బ్రేక్స్, వైడ్ టైర్స్ లాంటి ఫీచర్లు ఉంటాయి. ఈ స్కూటర్ కు డిస్‍ప్లే ఉండనుండగా.. బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్‍కు కనెక్ట్ చేసుకోవచ్చు.

Yamaha E01 Electric Scooter Features: రిలీజింగ్ ఎప్పుడు?

Yamaha E01 Electric Scooter Price : భారత్‍లో యమహా ఈ10 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్‍పై ఇంకా స్పష్టత రాలేదు. ఆ కంపెనీ కూడా ఇంకా విడుదల గురించి అధికారికంగా సమాచారం వెల్లడించాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ స్కూటర్ ధర గురించిన అంచనాలు వెలువడుతున్నాయి. యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర ఇండియాలో రూ.1.15లక్షలుగా ఉంటుందని అంచనా. ఇదే జరిగితే ఓలాతో పాటు వచ్చే ఏడాది మార్కెట్‍లోకి రానున్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లకు యమహా ఈ01 గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ మోడల్ గురించి యమహా ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తుందో చూడాలి.

Whats_app_banner