తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Yamaha Mt 15 Vs Ktm 125 Duke : యమహా ఎంటీ 15 వర్సెస్​ కేటీఎం 125 డ్యూక్​.. ది బెస్ట్​ ఏది?

Yamaha MT 15 vs KTM 125 Duke : యమహా ఎంటీ 15 వర్సెస్​ కేటీఎం 125 డ్యూక్​.. ది బెస్ట్​ ఏది?

Sharath Chitturi HT Telugu

24 February 2023, 10:39 IST

google News
    • Yamaha MT 15 vs KTM 125 Duke : యమహా ఎంటీ 15, కేటీఎం 125 డ్యూక్​.. ఈ రెండింట్లో ఒకటి కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే..
యమహా ఎంటీ 15 వర్సెస్​ కేటీఎం 125 డ్యూక్​.. ది బెస్ట్​ ఏది?
యమహా ఎంటీ 15 వర్సెస్​ కేటీఎం 125 డ్యూక్​.. ది బెస్ట్​ ఏది? (HT AUTO)

యమహా ఎంటీ 15 వర్సెస్​ కేటీఎం 125 డ్యూక్​.. ది బెస్ట్​ ఏది?

Yamaha MT 15 vs KTM 125 Duke : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో టూ వీలర్​ బైక్స్​కు మంచి డిమాండ్​ ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు కొత్త కొత్త లాంచ్​లు, అప్డేటెడ్​ వర్షెన్​లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో యమహా ఎంటీ 15, కేటీఎం 125 డ్యూక్​ బైక్స్​ను పోల్చి.. ఏది బెస్ట్​ అనేది తెలుసుకుందాము..

యమహా ఎంటీ 15 వర్సెస్​ కేటీఎం 125 డ్యూక్​- లుక్స్​..

యమహా ఎంటీ 15 లుక్స్​ చాలా యునీక్​గా ఉంటాయి. ఇందుకు కారణంగా ఈ బైక్​ స్టైలింగ్​. బైక్​ ఫ్రెంట్​లో.. ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్స్​తో కూడిన సింగిల్​ ప్రొజెక్టర్​ ఎల్​ఈడీ సెటప్​ ఉంటుంది. సింగిల్​ ఎగ్జాస్ట్​, మస్క్యులర్​ ట్రాంక్​ ష్రౌడ్స్​ ఉన్నాయి. ఇక కేటీఎం 125 డ్యూక్​.. 390 డ్యూక్​కు మిని వర్షెన్​లాగా కనిపిస్తుంది. ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్స్​తో కూడిన ఫ్లాట్​ హాలిజెన్​ హెడ్​ల్యాంప్​, షార్ప్​ లుకింగ్​ రేర్​ ఎండ్​ ఎగ్జాస్ట్​ వంటివి ఉంటాయి.

యమహా ఎంటీ 15 వర్సెస్​ కేటీఎం 125 డ్యూక్​- ఇంజిన్​..

Yamaha MT 15 on road price in Hyderabad : యమహా ఎంటీ 15లో 155 సీసీ, సింగిల్​ సిలిండర్​ లిక్వ్​డ్​ కూల్డ్​ వీవీఏ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 10,000 ఆర్​పీఎం వద్ద 18.4 బీహెచ్​పీ పవర్​ను, 7,500 ఆర్​పీఎం వద్ద 14.1 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో స్లిప్​ అండ్​ అసిస్ట్​ క్లచ్​తో కూడిన 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

KTM 125 Duke on road price : ఇక కేటీఎం 125 డ్యూక్​లో 124.7 సీసీ, సింగిల్​ సిలిండర్​, లిక్వ్​డ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 9,250 ఆర్​పీఎం వద్ద 14.3 బీహెచ్​పీ పవర్​ను, 8,000 ఆర్​పీఎం వద్ద 12 బీహెచ్​పీ పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

యమహా ఎంటీ 15 వర్సెస్​ కేటీఎం 125 డ్యూక్​- ఫీచర్స్​..

Yamaha MT 15 features : యమహా ఎంటీ 15లో ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్​ కలస్టర్​ ఉంటుంది. ఫ్యూయెల్​ కన్జమ్షన్​ ఇండికేటర్​తో పాటు వివిధ ఆప్షన్స్​ ఇందులో కనిపిస్తాయి. వీవీఏ ఇండికేటర్​, షిఫ్ట్​ టైమింగ్​ లైట్​, గేర్​ పొజిషన్​ ఇండికేటర్​, టాకోమీడర్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. ఆల్​ ఎల్​ఈడీ లైటింగ్​, బ్లూటూత్​ కనెక్టివిటీ ఫీచర్స్​ సైతం దీని సొంతం.

ఇక కేటీఎం 125 డ్యూక్​లో ఎల్​సీడీ డిజిటల్​ క్లస్టర్​ ఉంటుంది. ఇందులోనూ వివిధ సమాచారాలు తెలుసుకోవచ్చు.

యమహా ఎంటీ 15 వర్సెస్​ కేటీఎం 125 డ్యూక్​- ధర..

KTM 125 Duke on road price in Hyderabad : ఇండియా మార్కెట్​లో యమహా ఎంటీ 15 ఎక్స్​షోరూం ధర రూ. 1,68,400గా ఉంది. ఇక కేటీఎం 125 డ్యూక్​ ఎక్స్​షోరూం ధర రూ. 1,75,942గా ఉంది.

తదుపరి వ్యాసం