తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs Apache Rtr 310 : కేటీఎం 390 డ్యూక్​కు పోటీగా.. టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310- త్వరలోనే లాంచ్​!

TVS Apache RTR 310 : కేటీఎం 390 డ్యూక్​కు పోటీగా.. టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310- త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu

12 February 2023, 7:03 IST

google News
    • 2023 TVS Apache RTR 310 : టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310 త్వరలోనే లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310 లాంచ్​.. త్వరలోనే!
టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310 లాంచ్​.. త్వరలోనే! (HT AUTO/ representative image)

టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310 లాంచ్​.. త్వరలోనే!

2023 TVS Apache RTR 310 : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టీవీఎస్​ మోటార్​.. అపాచీ ఆర్​టీఆర్​ 310ని ఇండియాలో లాంచ్​ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. త్వరలోనే ఈ బైక్​ ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ బైక్​ డిజైన్​.. 2014 ఆటోఎక్స్​పోలో సంస్థ ప్రదర్శించిన డ్రాకెన్​ కాన్సెప్ట్​ను పోలి ఉండనుంది. ఇక లాంచ్​ అనంతరం.. ఈ స్ట్రీట్​ఫైటర్​ మోటర్​సైకిల్​.. కేటీఎం 390 డ్యూక్​, బీఎండబ్ల్యూ జీ 310 ఆర్​, బజాజ్​ డామినర్​ 400 వంటి మోడల్స్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310 అనేది ఒక మిడిల్​వెయిట్​ స్ట్రీట్​ఫైటర్​ మోటర్​సైకిల్​. ఈ సెగ్మెంట్​లో కేటీఎం, బీఎండబ్ల్యూ, బజాజ్​ సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక ఈ లాంచ్​తో.. సబ్​-400 సీసీ కేటగిరీపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది టీవీఎస్​. ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉండటంతో.. రానున్న మోడల్స్​ ప్రదర్శనపై మార్కెట్​ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310- ఫీచర్స్​..

TVS Apache RTR 310 price : టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310లో బీఎస్​6 ఆధారిత 312సీసీ, లిక్విడ్​ కూల్డ్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉండనుంది. అపాచీ ఆర్​ఆర్​ 310లోనూ ఇదే ఇంజిన్​ ఉంది. ఈ ఇంజిన్​ 33.5హెచ్​పీ పవర్​ను, 27.3ఎన్​ఎం పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఇక డిజైన్​ పరంగా చూసుకుంటే.. ఈ బైక్​ ఫ్యూయెల్​ ట్యాంక్​ లుక్​ మస్క్యులర్​గా ఉండొచ్చు. యాంగ్యులర్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాప్​ విత్​ డీఆర్​ఎల్స్​, వైడ్​ హ్యాండిల్​బార్​, స్పూకీ లుకింగ్​ మిర్రర్స్​, స్ప్లిట్​- టైర్​ సీట్స్​, అప్​స్వెప్ట్​ ఎక్సాస్ట్​, స్లిమ్​ టెయిల్​ సెక్షన్​, స్ప్లిట్​ టైర్​ గ్రాబ్​రెయిల్స్​, లైట్​వెయిట్​ అలాయ్​ వీల్స్​, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​ వంటి ఫీచర్స్​ వచ్చే అవకాశం ఉంది.

TVS iQube ST: త్వరలో మార్కెట్లోకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ టీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

TVS Apache RTR 310 : అపాచీ ఆర్​ఆర్​ 310లో బెస్ట్​ ఇన్​ క్లాస్​ మిషిలిన్​ రోడ్​ టైర్స్​ ఉంటాయి. త్వరలో రానున్న టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310లోనూ ఇవే ఉండొచ్చు. మిడిల్​వెయిట్​ సెగ్మెంట్​లో ఈ టైర్స్​ ది బెస్ట్​ అని ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నాయి. పర్ఫార్మెన్స్​, బ్యాలెన్స్​తో పాటు లాంగ్​ లైఫ్​ కూడా ఉండటం విశేషం.

2023 TVS Apache RTR 310 launch : ఇక ఈ టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​, ధర వంటి వివరాలను సంస్థ ప్రకటించాల్సి ఉంది. త్వరలనే దీనిపై మరింత సమాచారం బయటకొచ్చే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం