తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2023 Tvs Apache Rtr 160 4v: అపాచె కొత్త మోడల్ వచ్చేసింది.. ధర ఎంతంటే..!

2023 TVS Apache RTR 160 4V: అపాచె కొత్త మోడల్ వచ్చేసింది.. ధర ఎంతంటే..!

30 November 2022, 11:26 IST

    • 2023 TVS Apache RTR 160 4V Special Edition: 2023 అపాచె ఆర్టీఆర్ 160 4వీ స్పెషల్ ఎడిషన్ ఇండియాలో లాంచ్ అయింది. కొత్త లుక్, మెకానికల్ అప్‍గ్రేడ్లతో వచ్చింది. పూర్తి వివరాలు ఇవే.
2023 TVS Apache RTR 160 4V: అపాచె కొత్త మోడల్ వచ్చేసింది.. ధర ఎంతంటే..!
2023 TVS Apache RTR 160 4V: అపాచె కొత్త మోడల్ వచ్చేసింది.. ధర ఎంతంటే..!

2023 TVS Apache RTR 160 4V: అపాచె కొత్త మోడల్ వచ్చేసింది.. ధర ఎంతంటే..!

2023 TVS Apache RTR 160 4V Special Edition: పాపులర్ బైక్ ‘అపాచె ఆర్టీఆర్ 160 4వీ’కి 2023 స్పెషల్ ఎడిషన్‍ను తీసుకొచ్చింది టీవీఎస్ మోటార్స్ (TVS Motors). భారత మార్కెట్‍లో దీన్ని లాంచ్ చేసింది. అపాచె ఆర్టీఆర్ 160 4వీ స్పెషల్ ఎడిషన్ సరికొత్త పెర్ల్ వైట్, మ్యాట్ బ్లాక్ స్పెషల్ ఎడిషన్ పెయింట్ స్కీమ్ కలర్ ఆప్షన్‍లలో అందుబాటులోకి వచ్చింది. సాధారణ అపాచె ఆర్టీఆర్ 160 4ఈతో పోలిస్తే.. ఈ నయా 2023 స్పెషల్ ఎడినషన్ కొత్త లుక్‍తో పాటు మెకానికల్ అప్‍గ్రేడ్లను కలిగి ఉంది. కొన్ని కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి.

2023 టీవీఎస్ అపాచె ఆర్టీఆర్ 160 4వీ స్పెషల్ ఎడిషన్ ధర

2023 TVS Apache RTR 160 4V Special Edition Price: ఈ 2023 టీవీఎస్ అపాచె ఆర్‍టీఆర్ 4వీ ప్రత్యేక ఎడిషన్ బైక్ ధర రూ.1,30,090 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ప్రస్తుతం ఆథరైజ్డ్ డీలర్ల వద్ద ఈ నయా బైక్ లభిస్తోంది.

2023 TVS Apache RTR 160 4V Special Edition: వివరాలు

టీవీఎస్ అపాచె ఆర్‍టీఆర్ 160 లాగా.. ఈ 2023 స్పెషల్ ఎడిషన్ కూడా 159.7 సీసీ, ఎయిల్ కూల్డ్ ఎస్ఓహెచ్‍సీ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్‍తో వస్తోంది. 9,250ఆర్పీఎం వద్ద 17.30 బీహెచ్‍పీ పవర్ ను, 7,250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎం పీక్ టార్క్యూను జనరేట్ చేస్తుంది. ఫైప్-స్పీడ్ గేర్ బాక్స్ ను ఈ బైక్ కలిగి ఉంటుంది.

అర్బన్, స్పోర్ట్, రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ 2023 TVS Apache RTR 160 4V Special Edition బైక్‍కు ఉంటాయి. అర్బన్, రెయిన్ మోడ్‍లో టాప్ స్పీడ్ గంటకు 103 కిలోమీటర్లకు పరిమితమై ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్‍లో టాప్ స్పీడ్ గంటకు 114 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. బైక్‍కు బ్లూటూత్ కనెక్టివిటీ కోసం స్మార్ట్‌క్సోనెక్ట్ (SmartXonnect)ను టీవీఎస్ ఇస్తోంది. ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ లో సాధారణ సమాచారంతో పాటు గేర్ షిప్ట్ ఇండికేటర్ వివరాలు కూడా కనిపిస్తాయి. కొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‍తో ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్ అప్‍డేట్ అయింది.

బ్రేక్స్ విషయానికి వస్తే, 2023 TVS Apache RTR 160 4V Special Editionకు ఫ్రంట్‍లో 270 mm పెటల్ డిస్క్, వెనుక 200 mm పెటల్ డిస్క్ ఉన్నాయి. ఫ్రంట్‍లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్స్.. సస్పెన్షన్ పనిని చేస్తాయి.

టాపిక్