Romance on Bike: బైక్‍పై లవర్స్ రొమాన్స్: కేసు నమోదు: వైరల్ వీడియో-romance on bike viral video rajasthan ajmer police registers case against couple romancing on moving motorcycle
Telugu News  /  National International  /  Romance On Bike Viral Video Rajasthan Ajmer Police Registers Case Against Couple Romancing On Moving Motorcycle
Romance on Bike: బైక్‍పై లవర్స్ రొమాన్స్ (Twitter Video Screen Grabs)
Romance on Bike: బైక్‍పై లవర్స్ రొమాన్స్ (Twitter Video Screen Grabs)

Romance on Bike: బైక్‍పై లవర్స్ రొమాన్స్: కేసు నమోదు: వైరల్ వీడియో

08 February 2023, 11:41 ISTChatakonda Krishna Prakash
08 February 2023, 11:41 IST

Romance on Bike: రన్నింగ్ బైక్‍పై ఓ ప్రేమ జంట రొమాన్స్ చేసుకుంది. ఈసారి ఇది జరిగింది రాజస్థాన్‍లో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Romance on Bike: ‘బైక్‍పై లవర్స్ రొమాన్స్’ ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. గత నెల జార్ఘండ్, లక్నోలో ఇలాంటివి జరగగా.. తాజాగా రాజస్థాన్‍లోనూ ఓ యువ జంట బైక్‍పై రెచ్చిపోయింది. రాత్రి వేళలో యువకుడు బైక్ నడుపుతుండగా.. అతడి వైపు ముఖం చేసి ట్యాంక్‍పై అమ్మాయి కూర్చుంది. బైక్ నడుపుతుండగానే ఇద్దరూ రొమాన్స్ చేశారు. అజ్మీర్‌లో సోమవారం ఇది జరగగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. పూర్తి వివరాలు ఇవే..

ఇదీ జరిగింది..

Romance on Bike: రాజస్థాన్‍ అజ్మీర్‌లోని రీజనల్ కాలేజ్ క్రాస్ రోడ్స్ నుంచి నౌసూర్ వ్యాలీ రోడ్డు మధ్య ఓ ప్రేమ జంట బైక్‍పై రొమాన్స్ చేసింది. అబ్బాయి బైక్‍ను వేగంగా నడుపుతుండగా.. అమ్మాయి అతడి ముందు కూర్చుంది. రోడ్డుపై బైక్ నడుపుతూనే ఇద్దరూ రొమాన్స్ చేసుకున్నారు. ఈ విషయాన్ని కొందరు కెమెరాల్లో బంధించగా.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కేసు నమోదు

Romance on Bike: బైక్‍పై యువ జంట రొమాన్స్ చేసుకున్న వీడియోలు వైరల్‍గా మారటంతో పోలీసులు రంగంలోకి దిగారు. రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా బైక్ నడిపిన యువకుడిని అజ్మీర్‌లోని క్రిస్టియన్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేశారు. అతడి బైక్‍ను సీజ్ చేశారు. కాగా, బైక్ నడిపిన యువకుని సాహిల్‍గా గుర్తించారు పోలీసులు.

Romance on Bike: ఛత్తీస్‍గఢ్, ఉత్తర ప్రదేశ్‍లోనూ ఇలాంటి ఘటనలే ఇటీవల జరిగాయి. జనవరి 21వ తేదీన ఛత్తీస్‍గఢ్‍లోని భిలాయ్‍లో ఓ యువ జంట ఇలాగే బైక్‍పై రొమాన్స్ చేసింది. యువకుడు బైక్ నడపగా.. యువతి ట్యాంక్‍పై అతడి ముందు కూర్చొంది. అదే నెల 17వ తేదీ ఉత్తర ప్రదేశ్‍లోని లక్నోలో ఓ స్కూటీపై ఇలాంటిది జరిగింది. నడుస్తున్న స్కూటీపైనే ఆ యువ జంట రెచ్చిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.