TVS Creon features: వచ్చే సంవత్సరం మార్కెట్లోకి టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్
30 November 2022, 19:39 IST
TVS Creon: టీవీఎస్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి టీవీఎస్ క్రియాన్(TVS Creon) ఎంటరవుతోంది. 2023 జూన్ లో ఈ స్కూటర్ ను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశముంది.
టీవీఎస్ క్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్
టీవీఎస్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి టీవీఎస్ క్రియాన్(TVS Creon) ఎంటరవుతోంది. తాజాగా, ఈ స్కూటర్ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన ఆటో ఎక్స్ పో లో కనిపించింది. ఇది ఇటాల్ జెట్ డ్రాగ్ స్టర్ అప్పీయరెన్స్ లో ఉంది. 2023 జూన్ లో ఈ స్కూటర్ ను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశముంది.
TVS electric scooter: సెకన్లలో 60 కిమీ వేగం
ఈ టీవీఎస్ క్రియాన్((TVS Creon)లో 16 పీఎస్ ఎలక్ట్రిక్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 5 సెకన్లలోనే సున్నా నుంచి 60 కిమీల వేగాన్ని అందుకుంటుంది. పెరిమీటర్ ఫ్రేమ్ తో పాటు, యాంగ్యులార్ డిజైన్ తో డైనమిక్ లుక్స్ లో ఉంది. ఎల్ ఈడీ లైటింగ్, బ్లూటూత్ సదుపాయం ఉన్న డిజిటల్ కన్సోల్ ఉన్నాయి. చాలా స్పోర్ట్స్ బైక్స్ ను మించిన అత్యాధునిక ఫీచర్లను ఇందులో పొందుపర్చారు.
TVS Creon battery: స్పీడ్ చార్జింగ్
ఈ స్కూటర్ లో ర్యాపిడ్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంది. గంటలో 80% వరకు బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా కూడా బ్యాటరీ పాక్షికంగా చార్జ్ అవుతుంది. మూడు రైడింగ్ మోడ్స్, జియో ఫెన్సింగ్, జీపీఎస్, పార్క్ అసిస్ట్, సేఫ్టీ, యాంటీ థెఫ్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఏబీఎస్ ఫెసిలిటీతో రెండు వీల్స్ కు డిస్క్ బ్రేకులను అమర్చారు.
TVS Creon: అందరికీ అనుకూలంగా..
యువతనే కాకుండా, అన్ని వయస్సుల వారిని ఆకట్టుకునేలా ఈ TVS Creon ను తీర్చిదిద్దారు. దీని ధరల శ్రేణిని సంస్థ ఇంకా ప్రకటించలేదు. కానీ, ఇది సుమారు రూ. 1.2 లక్షల శ్రేణిలో ఉండవచ్చని భావిస్తున్నారు. 80 కిమీల రేంజ్ తో మూడు లిథియం ఇయాన్ బ్యాటరీలు ఇందులో ఉన్నాయి.
టాపిక్