Tata Nexon EV vs Mahindra XUV400 : ఈ రెండు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో ఏది బెస్ట్?
09 September 2023, 6:10 IST
- Tata Nexon EV vs Mahindra XUV400 : 2023 టాటా నెక్సాన్ ఈవీ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌యూవీ400.. ఏది బెస్ట్?
ఈ రెండు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో ఏది బెస్ట్?
Tata Nexon EV vs Mahindra XUV400 : టాటా నెక్సాన్ ఈవీకి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను తాజాగా ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. ఈ 2023 టాటా నెక్సాన్ ఈవీ.. మహీంద్రా ఎక్స్‌యూవీ400తో ఇప్పటికే ఉన్న గట్టి పోటీని, మరింత రసవత్తరంగా మారుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
టాటా నెక్సాన్ ఈవీ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌యూవీ400- డిజైన్..
టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో బంపర్ మౌంటెడ్- ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సీక్వెన్షియల్ లైటింగ్‌తో కూడిన ఫుల్-విడ్త్ డీఆర్ఎల్, 16 ఇంచ్ అలాయ్ వీల్స్, కనెక్టెడ్ టైప్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, వై షేప్ వ్రాప్ అరౌండ్ మోటిఫ్స్, స్లీక్ రూఫ్ రెయిల్స్ వంటివి లభిస్తున్నాయి.
ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ400లో స్కల్ప్టెడ్ హుడ్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, ట్వీన్ పీక్స్ లోగో, ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్స్తో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సిల్వర్డ్ రూఫ్ రెయిల్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, వ్రాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ వస్తున్నాయి.
టాటా నెక్సాన్ ఈవీ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌యూవీ400- ఫీచర్స్..
2023 Tata Nexon EV price : టాటా బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ వెహికిల్ కేబిన్‌లో మినిమలిస్ట్ డ్యూయెల్ టోన్ డాష్‌బోర్డ్, టచ్ ఆధారిత బాక్లిట్ స్విచ్‌లు, వయర్లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 10.25 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటివి లభిస్తున్నాయి.
ఎక్స్‌యూవీ400లో మినిమలిస్ట్ డాష్‌బోర్డ్ డిజైన్, ప్రీమియం అప్‌హోలిస్ట్రీ, యాంబియెంట్ లైటింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7.0 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటివి వస్తున్నాయి.
ఇదీ చూడండి:- Tata Nexon EV facelift : సరికొత్తగా టాటా నెక్సాన్ ఈవీ- ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో భారీ మార్పులు..
Mahindra XUV400 on road price Hyderabad : ఇక టాటా నెక్సాన్ ఈవీలో పీఎంఎస్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. 30కేడబ్ల్యూహెచ్, 40.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ వస్తున్నాయి. వీటి రేంజ్ 325కి.మీ, 465కిమీలు.
మహీంద్రా ఎక్స్‌యూవీ400లో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌కు 39.4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. దీని రేంజ్ 456కి.మీలు.
ఈ ఈవీల ధరలు ఇవే..
Tata Nexon EV facelift price : టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. సెప్టెంబర్ 14న లాంచ్‌తో క్లారిటీ వస్తుంది. అయితే.. ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 15లక్షలుగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Mahindra XUV400 features : ఇండియాలో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎక్స్‌షోరూం ధర రూ. 16లక్షలు- రూ. 19.2లక్షల మధ్యలో ఉంటుంది.