Bullet 350 vs Honda H'ness CB350 : ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్?
04 September 2023, 14:58 IST
- Bullet 350 vs Honda H'ness CB350 : రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 వర్సెస్ హోండా హైనెస్ సీబీ350.. ఈ రెండిట్లో ఏది బెస్ట్?
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 వర్సెస్ హోండా హైనెస్ సీబీ350..
Bullet 350 vs Honda H'ness CB350 : రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350కి 2023 వర్షెన్‌ను లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఈ బైక్.. హోండా హైనెస్ సీబీ350కి గట్టిపోటీగా మారుతుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెడింటినీ పోల్చి.. ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు బైక్స్ ఫీచర్స్ ఇవే..
2023 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350లో టియర్‌డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. సర్క్యులర్ హెడ్‌ల్యాంప్, సిగ్నేచర్ టైగర్ ఐ పిలట్ ల్యాంప్స్, సింగిల్ పీస్ సీట్, ఇంటిగ్రేటెడ్ గ్రాబ్ రెయిల్, వయర్ స్పోక్డ్ వీల్స్ వంటివి లభిస్తున్నాయి.
ఇక 2023 హోండా హైనెస్ సీబీ350లో స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్‌లైట్, వైడ్ హ్యాండిల్‌బార్, అప్స్వెప్ట్ ఎగ్సాస్ట్, డిజైనర్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి.
ఈ రెండు బైక్స్ ఇంజిన్, సేఫ్టీ ఫీచర్స్ ఇవే..
2023 Royal Enfield Bullet 350 : సరికొత్త బుల్లెట్ 350, హోండా హైనెస్ సీబీ350 మోడల్స్‌లోని రెండు వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్‌తో పాటు డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ వస్తున్నాయి. అయితే.. హోండా బైక్‌లో హెచ్ఎస్టీసీ (హోండా సెలెక్టెబుల్ టార్క్ కంట్రోల్) ఫీచర్ కూడా వస్తోంది.
రెండు బైక్స్‌కు ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్ వంటివి లభిస్తున్నాయి.
ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. బుల్లెట్ 350లో 349సీసీ సింగిల్ సిలిండర్ జే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20 హెచ్‌పీ పవర్‌ను, 27ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 2023 హోండా హైనెస్ సీబీ350లో 348.6 సీసీ, ఎయిర్ కూల్డ్, ఫ్యుయెల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ మోటార్ ఉంటుంది. ఇది 20.8 హెచ్‌పీ పవర్‌ను, 30ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
వీటి ధరల వివరాలివే..
Royal Enfield Bullet 350 price : 2023 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఎక్స్‌షోరూం ధర రూ. 1.74లక్షలు- రూ. 2.16లక్షల మధ్యలో ఉంటుంది. 2023 హోండా హైనెస్ సీబీ350 ఎక్స్‌షోరూం ధర రూ. 2.1లక్షలు- రూ. 2.15లక్షల మధ్యలో ఉంటుంది.